pizza
Gruham release on 17 November
నవంబ‌ర్ 17న సిద్ధార్థ్‌, ఆండ్రియా `గృహం`
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 November 2017
Hyderabad

సిద్ధార్థ్, వయూకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఎటాకి ఎంటర్టైన్మెంట్ బేనర్స్‌పై సిద్ధార్థ్, ఆండ్రియూ తారాగణంగా రూపొందిన హారర్ చిత్రం ’గృహం’. మిలింద్ రావ్ దర్శకుడు. ఈ సినివూ నవంబర్ 17 న విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో స్పెషల్ ప్రీమియర్‌ను ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..

హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ - ‘‘గృహం’ సినిమాను హిందీ, తెలుగు, తమిల భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నాను. అయితే కుదరలేదు. కొ న్ని కారణాలతో సినిమాను తెలుగులో నవంబర్ 17న విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నాం. ప్రేమతో, మంచి టెక్నికల్ టీం సపోర్ట్‌తో సినిమాను తెరకెక్కించాం. నేను, మిలింద్ రావ్ ఈ సినిమా కోసం నాలుగన్నరేళ్లుగా జర్నీ చేస్తున్నాం. అలాగే మ్యూజిక డైరెక్టర్ గిరీష్ కూడా మూడున్నరేళ్లుగా ఈసినమాతో ట్రావెల్ చేస్తున్నాడు. హారర్ జోనర్‌లో సినిమా చేయాలనుకోగానే సినిమాకు సంబంధించి చాలా విషయాలు రీసెర్చ్ చేశాం. చాలా కొత్త విషయాలు తెలిశాయి. దేవుడు, దెయ్యం ఉన్నాడా? లేడా? అనేవి వ్యక్తిగత విషయాలు. మేం రీసెర్చ్ చేసిన విషయాల్లో 60 శాతం నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించాం. దీనికి డ్రమటిక్ అంశాలను కూడా జోడించాం. టెక్నికల్‌గా చాలా కేర్ తీసుఉని సినిమా చేశాం. కలర్ టోన్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా ఎ సర్టిఫికేట్..హారర్ మూవీ కాబట్టి, పిల్లలతో, కుటుంబ సభ్యులతో చూడాల్సిన సినిమా అని చెప్పను. అయితే సినిమా నచ్చిన వారు చూస్తే చాలు. ఓ నిర్మాతగా నేను దాన్ని ఇష్టపడుతున్నాను. ఇపుడు హారర్ కామెడీ చిత్రాలే ఎక్కువైపోయాయి. ఇలాంటి తరుణంలో ఓ పూర్తిస్థాయి హారర్ సినిమా చేస్తే బావుంటుందనే ఉద్దేశంతో, ఈ సినిమాను చేశాం. ఒక నటుడిగా కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో పాటు ..సిద్ధార్థ్ అంటే ఇంతే చేస్తాడనే ఓ బ్రాకెట్ క్రియేట్ అయ్యింది. అలాంటి ఓ బ్రాకెట్ నుండి బయటకు రావాలనుకున్నప్పుడు నాకు నేనుగా సినిమా తీస్తే బావుంటుందని నిర్ణయించుకునే ఈ సినిమాకు నేను నిర్మాతగా మారాను’’ అన్నారు.

దర్శకుడు మిలింద్ రావ్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా ప్రధానాంశం నిజ ఫ ుటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కించాం. సమాజంలో చాలా ప్రమాదకరమైన మనుషలు ఉన్నారు. అలాంటి వారిని చూపించాలనే ఉద్దేశంతో ముందుగానే అనుకుని అందుకు తగినట్టు రీసెర్చ్ చేసి కథను తయారు చేసుకున్నాను’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ గిరీష్ వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved