pizza
Head Constable Venkataramaiah Press Meet
చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌`
You are at idlebrain.com > News > Functions
Follow Us

31 October 2016
Hyderaba
d

శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలిమ్స్ తెర‌కెక్కిస్తున్న చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌`. ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి నిర్మాత‌. చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సంద‌ర్భంగా లోకేష‌న్‌లో సోమ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో....

ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ ``చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావుగారి ద‌ర్శ‌క‌త్వంలో ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. అస‌లు దేశంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మైన న‌ల్ల‌ధ‌నానికి మూలమేంటి? ఓ సాధార‌ణ హెడ్ కానిస్టేబుట్ కుటుంబం, న‌ల్ల‌ధ‌నం వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది, ఎలా విచ్చిన్న‌మైంది. దానికి ఆ హెడ్ కానిస్టేబుల్ ఏం చేశాడ‌నేదే ఈ సినిమా క‌థ‌. మాన‌వీయ విలువ‌లుపై ఆర్ధిక విలువ‌లు ఎలాంటి ఆధిప‌త్యాన్ని క‌న‌పరుస్తున్నాయి. రాజ‌కీయాల‌ను డ‌బ్బు శాసిస్తుంది. ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల నుండి ప్ర‌జ‌లు ర‌క్షించేదెలా అనే సందేశంతో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాం`` అన్నారు.

చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ `` బ్లాక్ మ‌నీ వ‌ల్ల దేశ‌మెంతో వెనుక‌బ‌డిపోతుంది. బ్లాక్ మ‌నీ వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ్డాయనే దాన్ని సినిమాలో చూపిస్తున్నాం. అలాగే బ్లాక్‌మ‌నీ స‌మ‌స్య‌ను రూపుమాపి ఓ హెడ్ కానిస్టేబుల్ స‌మాజాన్ని ముందుకు ఎలా న‌డిపాడ‌నేదే చూపిస్తున్నాం. 60 రోజుల పాటు సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. డిసెంబ‌ర్ 15లోపు చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి జ‌న‌వ‌రిలో సినిమాను తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం`` అన్నారు.

చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు మాట్లాడుతూ ``మంచి మెసేజ్ ఉన్న సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి మా మ‌నిషి. మా సంస్థ‌లో జ‌య‌సుధ చాలా సినిమాలు చేసింది. ఈ మ‌ధ్య‌నే మేం `బిచ్చ‌గాడు` అనే సినిమా చేశాం. ఆసినిమా ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఆ స‌క్సెస్‌తో మా బాధ్య‌త మ‌రింత పెరిగింది`` అని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో టి.ప్ర‌సన్న‌కుమార్‌, డి.ఎస్‌.రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

సునీల్ శ‌ర్మ‌, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, త‌నికెళ్ల భ‌ర‌ణి, చ‌ల‌ప‌తిరావు, వెన్నెల కిశోర్‌, వై.విజ‌య‌, స‌మీర్‌, విజ‌య భాస్క‌ర్‌, విజ‌య్‌, పార్వ‌తి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ సినిమాకు సంగీతం: వందేమాత‌రం శ్రీనివాస్‌, డైర‌క్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీ: కె.సుధాక‌ర్ రెడ్డి, ఎడిట‌ర్‌: మోహ‌న రామారావు, నృత్యాలు: శివ‌సుబ్ర‌హ్మ‌ణ్యం, ఫైట్స్: స‌తీష్ మాస్ట‌ర్‌, స‌మ‌ర్ప‌ణ‌: చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు, నిర్మాత‌: చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved