pizza
Journey-2 release on 30 September
ఈ నెల 30న `జ‌ర్నీ - 2` విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 September 2016
Hyderaba
d

గ‌ణేశ్ క‌థానాయ‌కుడిగా మంజ‌రి, మాళ‌విక నాయిక‌లుగా న‌టించిన చిత్రం `జ‌ర్నీ - 2`. శాఖ‌మూరి కృష్ణ‌చైత‌న్య స‌మ‌ర్పిస్తున్నారు. జ‌య‌ల‌క్ష్మీ ఆర్ట్స్ ప‌తాకంపై రూపొందుతోంది. చిగులూరి గంగాధ‌ర‌రావు చౌద‌రి నిర్మిస్తున్నారు. ఎస్.నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం గురించి హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం విలేక‌రుల స‌మావేశం జ‌రిగింది.

శాఖ‌మూరి కృష్ణ‌చైత‌న్య మాట్లాడుతూ ``ఇందులో నాలుగు పాట‌లున్నాయి. ఈ నెల 30న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. గ‌ణేశ్‌కి క‌న్న‌డ‌లో పెద్ద మార్కెట్ ఉంది. ఆయ‌న ఖాతాలో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలున్నాయి. మంజ‌రి తెలుగువారికి బాగా సుప‌రిచితురాలే. యువ‌త‌కు క‌నెక్ట్ అయ్యే సినిమా అవుతుంది.`` అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ ``అనువాద ప‌నుల‌న్నీ పూర్త‌య్యాయి. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ కావాలి`` అని అన్నారు.

సినిమా పెద్ద హిట్ కావాల‌ని మ‌ల్కాపురం శివ‌కుమార్ అభిల‌షించారు.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved