28 September 2016
Hyderabad
గణేశ్ కథానాయకుడిగా మంజరి, మాళవిక నాయికలుగా నటించిన చిత్రం `జర్నీ - 2`. శాఖమూరి కృష్ణచైతన్య సమర్పిస్తున్నారు. జయలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోంది. చిగులూరి గంగాధరరావు చౌదరి నిర్మిస్తున్నారు. ఎస్.నారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లోని ఫిలించాంబర్ లో జరిగింది. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు ఆడియో సీడీలను విడుదల చేసి తొలి సీడీని సూపర్ హిట్ పత్రికాధినేత, నిర్మాత బి.ఎ.రాజుకు అందించారు. ఈ సందర్భంగా.....
సూపర్ హిట్ పత్రికాధినేత, నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ``జర్నీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. కన్నడలో ముంగారుమలై చిత్రంలో నటించిన గణేష్ కన్నడలో నటించిన ముంజా అనే చిత్రాన్ని తెలుగులో ఇప్పుడు జర్నీ-2 అనే పేరుతో సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నారు. కన్నడలో పెద్ద హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు మాట్లాడుతూ - ``కన్నడలో గణేష్ నటించిన ముంజా పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు చిగులూరి గంగాధరరావు చౌదరిగారు తెలుగులో ఆ చిత్రాన్ని జర్నీ2 పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద విజయాన్ని సాధించి దర్శక నిర్మాతలకు, యూనిట్ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సీనియర్ పాత్రికేయులు వినాయకరావు మాట్లాడుతూ - ``గంగాధరరావు చౌదరిగారు మా ఊరుకి చెందినవారే. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆయన నిర్మాణ రంగంలోకి వచ్చారు. ఆయన నిర్మాతగా వస్తున్న జర్నీ2 కన్నడలో ముంజా అనే పేరుతో విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. సెప్టెంబర్ 30న తెలుగులో విడుదలవుతున్న ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
శాఖమూరి కృష్ణచైతన్య మాట్లాడుతూ ``ఇందులో నాలుగు పాటలున్నాయి. అన్నీ బాగా కుదిరాయి. సినిమాను ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. గణేశ్‌కి కన్నడలో పెద్ద మార్కెట్ ఉంది. ఆయన ఖాతాలో బ్లాక్ బస్టర్ చిత్రాలున్నాయి. మంజరి తెలుగువారికి బాగా సుపరిచితురాలే. యువతకు కనెక్ట్ అయ్యే సినిమా అవుతుంది.`` అని చెప్పారు.
నిర్మాత గంగాధరరావు చౌదరి మాట్లాడుతూ ``సెప్టెంబర్ 30న విడుదలవుతున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించి మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని నమ్మకంగా ఉన్నాం`` అని అన్నారు.
జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ - ``నిర్మాతలు పబ్లిసిటీ పరంగా చాలా కేర్ తీసుకుని ఈ సినిమాను చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో రానటువంటి డిఫరెంట్ లవ్ స్టోరీ జర్నీ2. సెప్టెంబర్ 30న వస్తోన్న ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, ఎడిటర్: ఈ.ఎం.నాగేశ్వరరావు, నిర్మాత: చిగులూరి గంగాధరరావు చౌదరి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.నారాయణ.