pizza
Mela press meet
'మేళా' ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

8 October 2017
Hyderabad

కొంకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సూర్యతేజ, సాయిధన్సిక, అలీ, మంజు, సోనీ చరిష్టా ప్రధాన తారాగణంగా రూపొందనున్న చిత్రం 'మేళా'. ఈసినిమా నెలాఖరున షూటింగ్‌ జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సాయిధన్సిక, సూర్యతేజ, అలీ, కొంకా ప్రొడక్షన్స్‌ అధినేత సంతోష్‌, మాగ్నస్‌ మీడియా మహిధర్‌, మంజు, సోని చరిష్ఠా, సినిమాటోగ్రాఫర్‌ మురళీ మెహన్‌ రెడ్డి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుక్కు, శ్రీపురం కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

అలీ మాట్లాడుతూ - ''కబాలి చిత్రంలో ధన్సిక నటించిన సంగతి తెలిసిందే. తను మంచి నటే కాదు, మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకుంది. ఈ మేళా సినిమాలో చాలా మంచి రోల్‌ చేసింది. సూర్యతేజకు మేళాతో మంచి అవకాశం వస్తుంది. శ్రీపురంకిరణ్‌తో ముప్పై ఏళ్ల పరిచయం ఉంది. తను నెమ్మదిగా ఎదుగుతూ డైరెక్టర్‌స్థాయికి చేరుకున్నారు. కొంకా ప్రొడక్షన్స్‌ సంతోష్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేత. సినిమాపై అభిమానంతో ఈ సినిమాను నిర్మించారు. సినిమా తప్పకుండా మంచి ఆదరణను పొందుతుంది'' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుక్కు మాట్లాడుతూ - ''శ్రీపురం కిరణ్‌గారు పక్కాస్క్రిప్ట్‌తో తయారు చేసుకున్న సినిమా ఇది. మంచి మ్యూజిక్‌ కుదిరింది. తప్పకుండా సినిమా అందరినీ అలరిస్తుంది'' అన్నారు.

సాయిధన్సిక మాట్లాడుతూ -''మేళా నాకు ఎంతో స్పెషల్‌ మూవీ. రెండు నెలలు క్రితం డైరెక్టర్‌ కిరణ్‌గారు స్క్రిప్ట్‌ చెప్పినప్పుడు నేను థ్రిల్‌ అయ్యాను. నా క్యారెక్టర్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. నిర్మాతలు చేస్తోన్న మొదటి సినిమా మేళా. భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

సూర్యతేజ మాట్లాడుతూ - ''వినాయకుడు, శంభోశివశంభో, అప్పుడలా ఇప్పుడిలా సినిమాలు తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో నేను హీరోను కాను. కథే హీరో. కథను నమ్మి చేసిన సినిమా ఇది. శ్రీపురం కిరణ్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. సాయిధన్సిక అద్భుతమైన పెర్ఫామెన్స్‌ చేశారు. శ్రీకాంత్‌గారు డైరెక్టర్‌గారిని, నన్ను నమ్మి సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు. ట్రైలర్‌ను మరో పది రోజుల్లో విడుదల చేస్తాం. సుక్కుగారు అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. మంజుగారు కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగులో ఈ సినిమాతో విలన్‌గా పరిచయం అయ్యారు. మాగ్నస్‌ మీడియాకు థాంక్స్‌. ఇక దర్శకుడు శ్రీపురం కిరణ్‌గారు తయారు చేసిన స్క్రిప్ట్‌ ఇండియాలోనే ఎక్కడా రాలేదు. ఇలాంటి సినిమాలో నన్ను భాగం చేసినందుకు శ్రీపురం కిరణ్‌గారికి థాంక్స్‌'' అన్నారు.

మంజు మాట్లాడుతూ - ''నా తొలి సినిమా ఇది. శ్రీపురం కిరణ్‌తో ఉన్న పరిచయం కారణంగా నేను ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాను'' అన్నారు.

మాగ్నస్‌ మీడియా మహిధర్‌ మాట్లాడుతూ - ''మా సంస్థ చాలా సినిమా ఓవర్‌సీస్‌లో డిస్ట్రిబ్యూషన్‌ చేశాం. నిర్మాతలుగా ఇప్పుడిప్పుడే మా ప్రయాణం ప్రారంభమైంది. మేళా సినిమా విషయానికి వస్తే తప్పకుండా కొత్త కాన్సెప్ట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.

కొంకా ప్రొడక్షన్స్‌ సంతోష్‌ మాట్లాడుతూ - '' నిర్మాతగా తొలి సినిమా. కథపై నమ్మకంతో సినిమా నిర్మిస్తున్నాం. మంచి స్క్రిప్ట్‌, టీమ్‌ కుదిరింది. డైరెక్టర్‌గారు ఎంతో గ్రౌండ్‌ వర్క్‌ చేశారు. అందరి సహకారం ఉంటుందని భావిస్తున్నాం'' అన్నారు.

శ్రీపురం కిరణ్‌ మాట్లాడుతూ - ''నిర్మాత సంతోష్‌గారు స్కైప్‌లో నా కథ విన్నారు. అప్పుడే గో అహెడ్‌ అన్నారు. అంతే కాకుండా ఓ ట్రైలర్‌ చేస్తే బావుంటుందని కూడా సలహా ఇచ్చారు. నమ్మకంతో సినిమా చేస్తున్న సంతోష్‌గారికి థాంక్స్‌. ఓ యదార్థ ఘటన ఆధారంగా రూపకల్పన చేసి మేళా అనే కథను తయారు చేశాను. ఇలాంటి కథను తెరకెక్కించాలంటే నిర్మాతగారికి ప్యాషన్‌ ఉండాలి. అలాంటి నిర్మాత శ్రీకాంత్‌గారు సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. మంజుగారిని ఈ సినిమాలో విలన్‌గా పరిచయం చేస్తున్నాను. అలాగే అలీ, సాయిధన్సిక, సూర్యతేజ టీంకు స్పెషల్‌ థాంక్స్‌'' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, సినిమాటోగ్రఫీ:ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి, ఫైట్స్‌: రామ్‌ సుంకర, ఎడిటింగ్‌: చంద్రమౌళి, పాటలు: కమల్‌ హాస్‌, కిరణ్‌ శ్రీపురం, నిర్మాత: సంతోష్‌ కొంకా, రచన, దర్శకత్వం: కిరణ్‌ శ్రీపురం.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved