pizza
Naruda DONORuda release on 4 November
నవంబ‌ర్ 4న `న‌రుడా..డోన‌రుడా`
You are at idlebrain.com > News > Functions
Follow Us

31 October 2016
Hyderaba
d

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందిన చిత్రం `నరుడా..! డోన‌రుడా..!`. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ‌, సుధీర్ పూదోట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబ‌ర్ 4న సినిమావిడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌ అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో....హీరో సుమంత్‌, తనికెళ్ల భరణి, మల్లిక్‌రామ్‌, నిర్మాతలు జాన్‌ సుధీర్‌ పూదోట, వై.సుప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ - ''హీరో సుమంత్‌తో సత్యం, గోదావరి సినిమాల నుండి మంచి పరిచయం ఉంది. ఆ పరిచయంతో 'నరుడా డోనరుడా' చిత్రంలో డా.ఆంజనేయులు అనే మంచి పాత్ర చేయడానికి అవకాశం ఇచ్చారు. హీరో పాత్రకు సమానంగా ఉండే పాత్రలో నటించాను. ఆరవై శాతం సినిమాలో నా పాత్ర కనపడుతుంది. హిందీలో విజయవంతమైన 'విక్కిడోనర్‌' సినిమాను తెలుగులో మన ఆడియెన్స్‌కు తగిన విధంగా రూపొందించడమంటే చిన్న విషయం కాదు. ఈ సినిమా షూటింగ్‌ టైంలో టీం చేస్తున్న వర్క్‌ చూసి నాకు లేడీస్‌ టైలర్‌ సినిమా గుర్తుకు వచ్చింది. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ తమ సినిమాగా భావించి ఈ సినిమాకు పనిచేశారు. దర్శకుడు మల్లిక్‌రామ్‌ సినిమా స్క్రీన్‌ప్లేను చక్కగా రాసుకున్నాడు. సుమంత్‌ కర్త, కర్మ తానై సినిమా యూనిట్‌ను ముందుండి నడిపించాడు. చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాం. హిందీలోఅన్ను కపూర్‌చేసిన పాత్రను తెలుగులో నేను వేశాను. హిందీలో అన్ను కపూర్‌ పాత్రకు నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది. అటువంటి క్లిష్టమైన పాత్ర చేయడం అంటే సులువు కాదు. సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. చివర్లో అర్ధ్రత నిండి ఉంటుంది. రియాలిటీతో కూడిన మెసేజ్‌ ఉండే సినిమా'' అన్నారు.

నిర్మాత జాన్‌సుధీర్‌ పూదోట మాట్లాడుతూ - ''సుమంత్‌ చాలా గ్యాప్‌ తీసుకుని చేస్తున్న సినిమా ఇది. అయినా ఇలాంటి ఓ సబ్జెక్ట్‌ ఉన్న సినిమా చేయడానికి గట్స్‌ ఉండాలి. తను దగ్గరుండి అందరకీ కనెక్ట్‌ అయ్యేలా స్క్రిప్ట్‌ను దగ్గరుండి రాయించుకున్నారు. ట్రైలర్‌, సాంగ్స్‌కు మంచి పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. సుమంత్‌ రోల్‌ చూసిన వారు భవిష్యత్‌లో సుమంత్‌ ఏ క్యారెక్టర్‌ అయినా చేయగలడని ప్రూవ్‌ చేస్తాడు. మల్లిక్‌రామ్‌ సినిమాను అద్భుతంగా డీల్‌ చేశాడు. ఎంటర్‌టైన్మెంట్‌తోపాటు చిన్న మెసేజ్‌ కూడా ఉంది. నవంబర్‌ 4న సినిమా రిలీజ్‌ అవుతుంది'' అన్నారు.

చిత్ర దర్శకుడు మల్లిక్‌రామ్‌ మాట్లాడుతూ - ''సినిమా పాటలకు, థియేట్రికల్‌ ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నవంబర్‌ 4న సినిమా రిలీజ్‌ అవుతుంది. ఇలాంటి సబ్జెక్ట్‌ను డీల్‌ చేయడం నాకు మొదటి నుండి రిస్క్‌ అనిపించలేదు. ఎందుకంటే పన్నెండేళ్లుగా దర్శకత్వశాఖలో పనిచేసిన అనుభవముంది. ఇలాంటి సబ్జెక్ట్‌ను డీల్‌ చేయడానికి కామెడి అవసరం అనిపించింది. అందువల్లే సినిమాను కామెడి ప్రధానాంశంగా చెప్పడానికి ప్రయత్నం చేశాం. స్ఫెర్న్‌ డోనేషన్‌పై చాలా సినిమాలు వచ్చాయి కానీ విక్కీడోనర్‌ నాకు తెలిసి బెస్ట్‌ స్క్రీన్‌ప్లే ఉన్న సినిమా'' అన్నారు.

సుప్రియ మాట్లాడుతూ - ''సుశాంత్‌ విక్కిడోనర్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తానని చెప్పగానే నేను నవ్వేశాను. నువ్వు కాన్ఫిడెంట్‌గానే ఉన్నావా అని అడిగాను. ఇలాంటి డిఫరెంట్‌ సబ్జెక్ట్‌ను లైట్‌ వేలో జెంటిల్‌గా చెప్పిన తీరు బావుంది. గత ఇరవైయేళ్లుగా ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎవరూ టచ్‌ చేయలేదు. ఇలాంటి సబ్జెక్ట్‌ను చక్కగా డీల్‌ చేసిన మల్లిక్‌రామ్‌కు హ్యాట్సాఫ్‌'' అన్నారు.

హీరో సుమంత్‌ మాట్లాడుతూ - ''నరుడా డోనరుడా ఓసెన్సివిటీ ఉన్న సబ్జెక్ట్‌. సినిమాను 60 రోజుల పాటు షూట్‌ చేశాం. తాతగారు ఉన్నప్పుడు ఆయన చివరిరోజుల్లో ఈ సినిమాను చూసి ఇలాంటి కొత్త సబ్జెక్ట్‌ను మన తెలుగులో కూడా తీస్తే బావుంటుందని అన్నారు. దాంతో నేను నా వద్దకు సినిమాలు చేయాలని వచ్చే దర్శకులకు విక్కీడోనర్‌లాంటి కథను చేయాలని ఉందని చెప్పి చాలా కథలు విన్నాను. చివరకు విక్కీడోనర్‌ను రీమేక్‌ చేయాలనుకున్నాను. గోల్కోండ హైస్కూల్‌ నిర్మాత రామ్మోహన్‌గారు కూడా ఈ సినిమా నన్ను చేయమని అనడం కూడా మరో కారణమైంది. డైరెక్టర్‌గా ఎవరినీ పెడదామని అనుకుంటున్న సమయంలో గోల్కోండ హైస్కూల్‌, ఊహలు గుసగుసలాడే సినిమాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసిన మల్లిక్‌రామ్‌ పేరుని రామ్మోహన్‌గారే సూచించారు. ఈ సినిమాను చాలా లిమిటెడ్‌ బడ్జెట్‌లో నిర్మించాం. క్షణం సినిమాకు వర్క్‌ చేసిన చాలా మంది టెక్నిషియన్స్‌ను ఈ సినిమాకు వర్క్‌ చేయించాను. సినిమా బాగా వచ్చింది. ఎవరినీ డిసాప్పాయింట్‌చేయదు. చాలా ఫ్రెష్‌ఫీల్‌ను కలిగిస్తుంది. స్క్రీన్‌ప్లేను తెలుగులో మార్చాం. కెరీర్‌ పరంగా నాకు ఈ సినిమా హెల్ప్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాను'' అన్నారు.

ఈ చిత్రంలో శ్రీల‌క్ష్మి, సుమ‌న్ శెట్టి, భ‌ద్ర‌మ్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ శేషు, సుంక‌ర‌ల‌క్ష్మి, పుష్ప‌, చ‌ల‌ప‌తిరాజు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సినిమాటోగ్ర‌ఫీః షానియల్ డియో, మ్యూజిక్ః శ్రీర‌ణ్ పాకాల‌, ఎడిట‌ర్ః కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్ః రామ్ అర‌స‌వెల్లి, డైలాగ్స్ః కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, సాగ‌ర్ రాచ‌కొండ‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః డా. అనిల్ విశ్వ‌నాథ్‌, నిర్మాత‌లుః వై.సుప్రియ‌, సుధీర్ పూదోట‌, ద‌ర్శ‌క‌త్వంః మ‌ల్లిక్ రామ్‌.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved