30 October 2017
Hyderabad
రమణ శ్రీ గుమ్మకొండ, గీతా మన్నం సమర్పణలో రమణ శ్రీ ఆర్ట్స్ బేనర్‌పై కార్తీకేయ, సిమ్రత్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `ప్రేమతో మీ కార్తీక్`. రిషి దర్శకత్వంలో రవీందర్ ఆర్.గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా...
చిత్ర దర్శకుడు రిషి మాట్లాడుతూ - ``ఈ చిత్రంలో మురళీశర్మగారు పుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశారు. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలకు డిఫరెంట్‌గా ఎమోషనల్‌గా సాగే తండ్రిగా పాత్రలో ఆయన నటించారు. నాలుగు సాంగ్స్ ఉన్నాయి. షాన్ రెహ్మాన్ అద్భుతమైన సంగీతం అందించారు. శివశంకరి మాస్టర్‌లోకొరియోగ్రఫీలో చేసిన పెళ్లి సాంగ్‌కు చాలా మంచి గుర్తింపు వస్తుంది. దర్శకుడిగా నేను చేసిన తొలి సినిమా. మంచి కుటుంబ, సామాజిక విలువలతో సినిమా చేయాలని, మంచి కథను రాసుకుని సినిమా చేశాను. నిర్మాతగారి సహకారం మరచిపోలేను. పాడేరు, గోవా సహా పలు లొకేషన్స్‌లో సినిమాను పూర్తి చేశాం. సాయిప్రకాష్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుంది. సహకారం అందించిన అందరికీ థాంక్స్`` అన్నారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ - ``మా సినిమా `ప్రేమతో మీ కార్తీక్` సాంగ్‌ను నవంబర్‌లో విడుదల చేస్తున్నాం. అల్రెడి విడుదలైన చినుకు చినుకు..అనే సాంగ్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. వన్ మిలియన్ వ్యూస్ రాబ్టుకోవడం విశేషం. అలాగే ట్రైలర్, సినిమా అదే రేంజ్‌లో పెద్ద హిట్ అవుతుంది. ఏడాది పైగా కష్టపడి చేసిన సినిమా. ఈ కష్టమంతా ప్రేక్షకులను మెప్పించడానికి. మా ప్రయత్నం సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం. రిషిగారు నాపై నమ్మకంతో, ఆయన తొలి సినిమాను నాతో చేసినందుకు థాంక్స్. అలాగే నిర్మాతలు అయిన బాబాయ్‌లకు రుణపడి ఉంటాను. పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కలిసి ఈ సినిమాలో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చేయడం నాకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం. నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ - ``సినిమా చాలా బాగా వచ్చింది. వచ్చే నెలలో విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నాం. నిర్మాణంలో దిల్‌రాజుగారు అందిస్తున్న సహకారం మరువలేనిది. ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు`` అన్నారు.
కార్తికేయ,సిమ్రత్, గొల్లపూడి మారుతీరావు, సుమిత్ర, మురళీశర్మ, పృథ్వీ, ప్రగతి, ఝాన్సీ, దువ్వాసి, కారుమంచి రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి సాహిత్యంః శ్రీమణి, ఎడిటర్ః మధు, ఆర్ట్ః హరివర్మ, సినిమాటోగ్రఫీః సాయిప్రకాష్ ఉమ్మడిసింగు, సంగీతంః షాన్ రెహమాన్, లైన్ ప్రొడ్యూసర్ః అశోక్‌రెడ్డి గుమ్మడికొండ, నిర్మాతః రవీందర్ ఆర్.గుమ్మడికొండ, రచన, దర్శకత్వంః రిషి.