pizza
Raju Gari Gadhi 2 press meet - Film releasing tomorrow
'రాజుగారి గది-2'తో మళ్లీ వస్తున్నాం.. పెద్ద హిట్‌ కొడతాం అనే గొప్ప నమ్మకం వుంది - కింగ్‌ నాగార్జున
You are at idlebrain.com > News > Functions
Follow Us

12 October 2017
Hyderabad

కింగ్‌ నాగార్జున హీరోగా సమంత ప్రధాన పాత్రలో ఓంకార్‌ దర్శకత్వంలో పి.వి.పి. సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్స్‌పై రూపొందుతున్న చిత్రం 'రాజుగారి గది-2'. సీరత్‌కపూర్‌ హీరోయిన్‌గా, వెన్నెల కిషోర్‌, అశ్విన్‌, ప్రవీణ్‌, షకలక శంకర్‌, రావు రమేష్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్‌ నెలకొని వున్నాయి. అందరి అంచనాలకు మించి దర్శకుడు ఓంకార్‌ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించారని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. కింగ్‌ నాగార్జున క్యారెక్టర్‌, సమంత పెర్‌ఫార్మెన్స్‌ సినిమాకి మెయిన్‌ హైలైట్‌ కానున్నాయి. ఈ చిత్రం అక్టోబర్‌ 13న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక అక్టోబర్‌ 12న హైదరాబాద్‌ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో ప్లెజెంట్‌గా, ఆనందోత్సాహంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కింగ్‌ నాగార్జున, హీరోయిన్స్‌ సమంత, సీరత్‌ కపూర్‌, దర్శకుడు ఓంకార్‌, సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.థమన్‌, పి.వి.పి. సినిమా అధినేత పివిపి, నటులు వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, అశ్విన్‌, మాటల రచయిత అబ్బూరి రవి పాల్గొన్నారు.

కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ - ''ఈ సినిమా నాకు వెరీ వెరీ స్పెషల్‌. సినిమా చాలా బాగా వచ్చింది అని అందరూ చెప్తున్నారు. అక్టోబర్‌ 6న చైతూకి, సమంతకి పెళ్ళి అయ్యింది. కోడలుగా సమంత మా ఇంట్లో అడుగు పెట్టింది. ఈ సినిమా సమంత కోసం హిట్‌ అవ్వాలి. ఎందుకంటే కోడలుగా మా ఇంటికి మంచి హిట్‌తో వస్తే బాగుంటుంది. లేదంటే గిల్టీగా వుంటుంది. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్‌ అవుతుందని గట్టి నమ్మకం వుంది. ప్రతి ఆడియో ఫంక్షన్‌లో మళ్ళీ వస్తున్నాం. మళ్ళీ హిట్‌ కొడుతున్నాం అని కాన్ఫిడెంట్‌గా చెప్పేవాడ్ని. అదే ఇప్పుడు చెబుతున్నా. గ్యారెంటీగా హిట్‌ కొడతాం. ఓంకార్‌ సినిమా మీద ప్రేమతో, ఎంతో శ్రమించి తపనతో ఈ సినిమా తీశాడు. సినిమా చూస్తే అతని కష్టం తెలుస్తుంది. అందరూ ఒక టీమ్‌ వర్క్‌ లాగ కలిసి పని చేస్తే ఏ సినిమా అయినా పెద్ద హిట్‌ అవుతుందని నా నమ్మకం. అలాగే ఈ సినిమాకి మేమంతా నవ్వుతూ ఎంజాయ్‌ చేస్తూ కలిసి పని చేశాం. 'నిన్నే పెళ్లాడతా' సినిమా అప్పట్లో అమెరికాలో చాలా పెద్ద హిట్‌ అయ్యింది. ఆ చిత్రంతోనే ఓవర్సీస్‌ బిజినెస్‌ స్టార్ట్‌ అయ్యింది. ఈ సినిమాని చిన్న చిన్న దేశాల్లో కూడా రిలీజ్‌ చేస్తున్నారు పివిపిగారు. డెఫినెట్‌గా 'రాజుగారిగది-2' చిత్రం ఫ్యాన్స్‌
కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది'' అన్నారు.

హీరోయిన్‌ సమంత మాట్లాడుతూ - ''ఏ సినిమా హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా వన్‌ వీక్‌లో మర్చిపోతాం. కానీ ఆ సినిమాకి పడ్డ కష్టం ఎప్పుడూ మనకి గుర్తుంటుంది. ఈ సినిమాకి ఆరు నెలలు వర్క్‌ చేసాం. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ అనేది చాలా ముఖ్యం. ఈ చిత్రంలో ఒక స్పెషల్‌ అప్పీయరెన్స్‌ క్యారెక్టర్‌లో నటించాను. ఒక్కో సీన్‌కి ఇంపాక్ట్‌ ఎక్కువ వుంటుంది. నా క్యారెక్టర్‌ ద్వారా ఆడవాళ్లందరికీ మంచి మెసేజ్‌ని చెప్తున్నాం. అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. మెసేజ్‌ మాత్రమే కాదు ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసే విధంగా ఫుల్‌ కామెడీ, ఎమోషన్‌ వుంటుంది. వెరీ ఇంటెలిజెంట్‌ ఫిల్మ్‌. నాకు 2017 వెరీ వెరీ ఇంపార్టెంట్‌ ఇయర్‌. ఇంత మంచి సినిమా చేసినందుకు ఎంతో ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. ఓంకార్‌ చాలా ప్యాషన్‌తో ఈ సినిమా రూపొందించారు. పివిపి అండ్‌ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ రియల్లీ సూపర్బ్‌. అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం'' అన్నారు.

దర్శకుడు ఓంకార్‌ మాట్లాడుతూ - ''మా సినిమా రిలీజ్‌ కోసం ఎన్నో రోజులుగా వెయిట్‌ చేస్తున్నాను. యాంకర్‌గా నా కెరీర్‌ను ప్రారంభించాను. కానీ డైరెక్టర్‌ అవ్వాలనే ఆ ఫీల్డ్‌ ఎంచుకున్నాను. అందరూ నన్ను ఆదరించారు. సక్సెస్‌ అయ్యాను. ఒక స్టార్‌ హీరోని డైరెక్ట్‌ చెయ్యాలనేది నా డ్రీమ్‌. అది ఈ సినిమాతో నెరవేరింది. నాగార్జునగారితో ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మూడవ సినిమాకే నాకు నాగార్జునగారు అవకాశం ఇచ్చారు. కథ చెప్పగానే నచ్చి, నా మీద నమ్మకంతో నాగార్జునగారు, సమంతగారు నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. పివిపిగారు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిరంజన్‌గారు నన్ను ఎంతో సపోర్ట్‌ చేసి ఈ సినిమా బాగా రావడానికి సహకరించారు. ఈ చిత్రంలో ఎంత ఎమోషన్‌ వుంటుందో అంతే కామెడీ వుంటుంది. వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, అశ్విన్‌ షకలక శంకర్‌ల హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. రావు రమేష్‌, నరేష్‌గారు కీలక పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో కలిసి చూసేలా ఈ సినిమా వుంటుంది. ఈ చిత్రంలో నాగార్జునగారు, సమంత మామ కోడళ్ల విశ్వరూపం చూస్తారు. ఇద్దరూ మెస్మరైజింగ్‌గా నటించారు. సమంత కెరీర్‌లోనే ది బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రంలో చూస్తారు. నాగార్జునగారు క్లైమాక్స్‌ సీన్స్‌ని నెక్స్‌ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లారు. అబ్బూరి రవి డైలాగ్స్‌, థమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, దివాకరన్‌ ఫొటోగ్రఫీ, ఎడిటర్‌ మధు వర్క్‌ ఈ సినిమా మెయిన్‌ ఎస్సెట్స్‌గా నిలుస్తాయి. మా అందరికీ ఈ సినిమాతో పెద్ద బ్రేక్‌ రాబోతోంది. సీరత్‌కపూర్‌ ఫస్ట్‌హాఫ్‌లో చాలా గ్లామరస్‌గా చాలా ఇంపార్టెంట్‌ సీన్స్‌లో నటించింది. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేయడంలో నాగార్జునగారు బెస్ట్‌ అని చెప్పగలను'' అన్నారు.

నిర్మాత పివిపి మాట్లాడుతూ - ''ఓంకార్‌ వన్‌ ఇయర్‌గా ఈ సినిమాకి కష్టపడి వర్క్‌ చేశాడు. మంచి సినిమా తీశాం. 'శివ' సినిమా చూసి నాగార్జున పెద్ద ఫ్యాన్‌ అయ్యాను. ఆయన ఈ సినిమా చేయడం ప్రాజెక్ట్‌ పెద్ద సినిమా లెవెల్‌కి వెళ్ళింది. ఆయనతో సమంత, థమన్‌, అబ్బూరి రవి అందరితో మా బేనర్‌లో ఇది మూడవ సినిమా. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేశారు. ప్రేక్షకులందరూ ఎంజాయ్‌ చేసేవిధంగా ఈ సినిమా వుంటుంది'' అన్నారు.

హీరోయిన్‌ సీరత్‌ కపూర్‌ మాట్లాడుతూ - ''స్టోరి వినగానే చాలా ఎగ్జైట్‌ అయ్యాను. నాగార్జునగారికి బిగ్‌ ఫ్యాన్‌ని. ఆయన ఈ సినిమా చేయడం లక్కీగా భావిస్తున్నాను'' అన్నారు.

సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.థమన్‌ మాట్లాడుతూ - ''బేసిగ్గా హార్రర్‌ ఫిలింస్‌ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి ఎక్కువ స్కోప్‌ వుంటుంది. అప్పుడే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మమ్మల్ని నిరూపించుకోగలం. ఓంకార్‌ సిట్చ్యుయేషన్‌కి తగ్గట్లు రెండు పాటలు, ఆర్‌ఆర్‌ చేయించుకున్నాడు. లాస్ట్‌ 20 రోజులు నుండి నా బ్రెయిన్‌లో ఓంకార్‌ వెంటాడుతూనే వున్నాడు. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. ఈ క్రెడిట్‌ అంతా ఓంకార్‌కే చెందుతుంది. 'హలో బ్రదర్‌' నుండి నాగ్‌ సర్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. అప్పుడే ఆయన నా బ్రెయిన్‌లో స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయ్యారు. ఆయనతో 'రగడ', 'గ్రీకువీరుడు' సినిమాలు చేశాను. ఇప్పుడు ఈ సినిమా చేశాను. అబ్బూరి రవి డైలాగ్స్‌ మ్యూజిక్‌ని డామినేట్‌ చేసేవిధంగా వున్నాయి. పివిపి, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌లో ఈ సినిమా చేయడం వెరీ వెరీ హ్యాపీ'' అన్నారు.

రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో నాగార్జునగారి లుక్‌, స్మైల్‌, స్టైల్‌తో చాలా బేలెన్స్‌డ్‌గా సెటిల్డ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశారు. ఆయన చెప్పే ప్రతి డైలాగ్‌ ఒక స్టేట్‌మెంట్‌లా వుంటుంది. సమంత క్యారెక్టర్‌ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలుస్తుంది. ఆడవాళ్లందరికీ ఒక గౌరవాన్ని తెచ్చే సినిమా అవుతుంది'' అన్నారు.

అశ్విన్‌ మాట్లాడుతూ - ''నాగ్‌ సర్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, నేను చేసిన కామెడీ సీన్స్‌ ఎంటర్‌టైనింగ్‌గా వుంటాయి'' అన్నారు.

వెన్నెల కిషోర్‌ మాట్లాడుతూ - ''ఓంకార్‌ ప్రతి సీన్‌ని డీటైల్డ్‌గా చెప్పి మా అందరితో యాక్ట్‌ చేయించాడు. పివిపి, మ్యాట్నీ సంస్థలో వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. నాగార్జునగారు, సమంతగారు నటించడంతో ఈ సినిమా రేంజ్‌ పెరిగిపోయింది'' అన్నారు.

ప్రవీణ్‌ మాట్లాడుతూ - ''వెన్నెల కిషోర్‌, నేను ఒక అమ్మాయి కోసం పోటీ పడుతుంటాం. ఆ సీన్స్‌ అన్నీ చాలా ఎంటర్‌టైనింగ్‌గా వుంటాయి'' అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved