pizza
Rangu press meet
`రంగు` చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us


14 November 2018
Hyderabad

త‌నీష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా `రంగు`. కార్తికేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప‌ద్మ‌నాభ‌రెడ్డి, న‌ల్ల అయ్య‌న్న‌నాయుడు నిర్మించారు. విజ‌య‌వాడ‌కు చెందిన లారా అలియాస్ ప‌వ‌న్‌కుమార్ క‌థ‌తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో త‌మ బావ‌ను లా చూపించారోన‌నే అనుమానంతో `థియేట‌ర్ల‌లో రంగు ప‌డ‌నివ్వం` అని లారా కుటుంబ స‌భ్యులు ఈ మ‌ధ్య విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. దానికి స‌మాధానం చెప్ప‌డం కోసం చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లో బుధ‌వారం ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించారు.

నిర్మాత ప‌ద్మ‌నాభ‌రెడ్డి మాట్లాడుతూ ``ఇటీవ‌ల మా సినిమాకు సంబంధించి లారా బంధువులు ప్రెస్‌మీట్ నిర్వ‌హించి చేసిన ఆరోప‌ణ‌లు స‌బ‌బుగానే అనిపించాయి. ఈ క‌థ‌ను మా ద‌ర్శ‌కుడు రెండేళ్లుగా రీసెర్చ్ చేసి రాశారు. ఆయ‌న చాలా మందిని క‌లిశారుగానీ, లారా బావ‌మ‌రిదిని క‌ల‌వ‌లేద‌న్న‌ది నిజం. లారా జీవితంలో జ‌రిగిన అంశాల‌ను మేం తెర‌కెక్కించాం. ఎక్క‌డా ఆయ‌న్ని చెడుగా చూపించ‌లేదు. ఈ సినిమా చూసిన వారు త‌ప్ప‌కుండా ఆయ‌న మీద మంచి ఒపీనియ‌న్ క‌లుగుతుంది. సంస్థ చేసిన త‌ప్పును అంద‌రూ గుర్ఇస్తారు. అంతేగానీ ఎక్క‌డా లా వెధ‌వ అని అనిపించ‌దు. ఈ శ‌నివారం, ఆదివారం లారా కుటుంబ‌స‌భ్యుల‌కు మేం షో వేస్తాం. 100 శాతం ఈ నెల 23న సినిమాను విడుద‌ల చేస్తాం. విజ‌య‌వాడ‌లో ఉన్న వారంద‌రూ రౌడీ షీట‌ర్లేనా అని చాలా మంది అడుగుతున్నారు. నిజానికి విజ‌య‌వాడ‌లో ఉన్న‌వారు రౌడీ షీట‌ర్లు కాదు. విజ‌య‌వాడ‌ను మేం ఇందులో కేంద్రంగా చూపించ‌లేదు. అక్క‌డున్న ఓ వ్య‌క్తి క‌థ‌గా దీన్ని రూపొందించాం. తెలుగు రాష్ట్రాలు విడిపోవ‌డం వ‌ల్ల విజ‌య‌వాడ‌లో ప్రెస్‌మీట్ పెడితే అంద‌రికీ తెలియ‌దు `` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``2011 నుంచి నేను స్ట‌డీ చేసి ఈ క‌థ‌ను రాసుకుంటాను. లారా బామ్మ‌ర్ది చెప్పింది నిజం. ఆయ‌న్ని నేను క‌ల‌వ‌లేదు. ఆయ‌న త‌మ్ముళ్ల‌ను, మ‌రికొంత‌మంది స‌న్నిహితుల‌ను క‌లిశాను. కేస్ షీట్‌లో ఉన్న వారంద‌రినీ, ఇన్వెస్టిగేష‌న్ చేసిన పోలీసులను క‌లిశాను. లారా ఫ్యామిలీని వ్య‌తిరేకించి సినిమా తీసే ఉద్దేశం నాకు లేదు. లారా రౌడీషీట‌ర్ అవబ‌డ్డాడు అనేది నిజం. ఆయ‌న హ్యూమ‌న్‌గా ఎలా ఉండేవాడ‌న్న‌ది నాకు ఇంట్ర‌స్ట్ క‌లిగించే విష‌యం. లారా చాలా ఇంట‌లిజెంట్‌. ఎగ్జామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. వాళ్ల ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో చాలా క్లోజ్‌గా ఉండేవాడు. అలాంటి విష‌యాల‌న్నీ ఇందులో చూపిస్తున్నాం. వారి కుటుంబ స‌భ్యుల‌ను త‌క్కువ చేయాల‌నే ఉద్దేశం మాత్రం మాకు లేదు. ఈ సినిమా చూస్తే లారా మా మ‌ధ్య ఇంకా తిరుగుతున్నార‌నే భావ‌న క‌లుగుతుంది`` అని చెప్పారు.

త‌నీష్ మాట్లాడుతూ ``వాళ్ల ఆలోచ‌న‌, వాళ్ల భ‌యం నిజ‌మే. రంగులో నేను లారా లాగా న‌టించాను. మ‌నిషి స‌మాజంలో ఎలా ఉండాలో, ఎలా ఉండ‌కూడ‌దో చెప్పే సినిమా ఇది. ఇంట్ర‌స్టింగ్ కేర‌క్ట‌ర్‌గా అనిపించింది నాకు లారా కేర‌క్ట‌ర్‌. ఐడియాల‌జీ, థాట్ ప్రాస‌స్ అన్నీ ఇందులో ఉంటాయి. 19-27 ఏళ్ల మ‌ధ్య ఆయ‌న త‌న జీవితంలో ఎలా ఉంటారో నేను ఇందులో అలా ఉంటాను. ఈ సినిమా చూస్తే వాళ్ల కుటుంబ స‌భ్యుల‌కు క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరుగుతాయి`` అని అన్నారు.

చిత్ర స‌హ నిర్మాత వాసు మాట్లాడుతూ ``త‌ప్ప‌కుండా లారా కుటుంబ‌స‌భ్యుల ఇష్టంతోనే సినిమాను విడుద‌ల చేస్తాం`` అని అన్నారు.

మ‌రో నిర్మాత న‌ల్ల అయ్య‌న్న నాయుడు మాట్లాడుతూ ``వాళ్ల కుటుంబ స‌భ్యులంద‌రి మెప్పుతోనే సినిమా విడుద‌ల చేస్తాం. త‌ప్ప‌కుండా ఈ నెల 23న సినిమా విడుద‌ల‌వుతుంది`` అని చెప్పారు


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved