pizza
RGV UnSchool press meet
ఆర్‌.జి.వి అన్‌ స్కూల్‌ ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 May 2018
Hyderabad

 

విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ 'ఆర్‌.జి.వి అన్‌ స్కూల్‌'ను స్టార్ట్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం జరగిన పాత్రికేయుల సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఈ సమావేశంలో...

రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ ''నేను బ్యాడ్‌ స్టూడెంట్‌ని. నేను పదవ తరగతిలో రెండు సార్లు, ఇంటర్మీడియట్‌లో రెండసార్లు, ఇంజనీరింగ్‌లో రెండుసార్లు ఫెయిల్‌ అయ్యాను.. అందుకనే నా స్కూల్‌కి అన్‌స్కూల్‌ అనే పేరు పెట్టాను. ఫిలిం మేకింగ్‌ అనేది వే ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌. నేను ఫిలిం స్కూల్‌కి చెందిన పలు విద్యార్థులను కలిసినప్పుడు వారందరూ పాత తరం నైపుణ్యాలనే నేర్చుకుంటున్నారని తెలిసింది. సినిమా అనేది ఈరోజుల్లో ప్యాషన్‌ కంటే ప్రొఫెషనల్‌ అనే రీతిగా మారింది. నా అన్‌స్కూల్‌ ప్రస్తుతం ఉన్న ఫిలింస్కూల్స్‌కు వ్యతిరేకంగా ఉంటుంది. విద్యార్థులు ఏం ఆలోచిస్తున్నారు. అందులో తప్పొప్పులేంటి?అనే వాటిని తెలియజేసి వారికి మా అన్‌స్కూల్‌ మార్గదర్శకత్వం చేస్తుందంతే. నేను శివ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నప్పుడు నాకు బేసిక్‌ ఫండ్‌మెంటల్స్‌ కూడా తెలియదని చాలా మంది అన్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత న్యూ ఏజ్‌ మూవీ అని అన్నారు. ఆ సమయంలో నేను రూల్స్‌ను బ్రేక్‌ చేయలేదు. ఎందుకంటే నాకు రూల్స్‌ తెలియవు. సినిమాను నేను ఎలా తీయాలనుకున్నానో అలా తీసుకుంటూ వెళ్లానంతే. అలాగే ప్రతి ఒక ఫిలింమేకర్‌కి ఓ స్టైల్‌ ఉంటుంది. అందుకనే నా అన్‌స్కూల్‌లో విద్యార్థులను బలవం

తంగా ఫిలింమేకర్స్‌ను చేసే ప్రయత్నం ఉండదు. వారికి నచ్చిన రీతిలో ఎంకరేజ్‌ చేయడం జరుగుతుంది. నేను ఇండ్యూవల్‌ యాట్యిట్యూడ్‌ ఉన్న వ్యక్తులను బాగా ఇష్టపడతాను. నా స్కూల్‌కు సంబంధించిన మిగతా విషయాలను మరో 20 రోజుల్లో తెలియజేస్తాను. ఫీజు ఎంత ఉండాల‌ని కూడా నిర్ణ‌యించుకోలేదు. ముంబై, హైద‌రాబాద్‌, న్యూయార్క్ స‌హా మ‌రో ప్రాంతంలో ఈ ఫిలిం స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఓ విద్యార్థికి ప‌ది ప్ర‌శ్న‌లిస్తాం. అందులో ఏడింటికి స‌మాధానం ఇచ్చే విద్యార్థులే టెస్ట్‌కు హాజ‌ర‌వుతారు'' అన్నారు.

 



Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved