pizza
Sharabha release on 1 June
జూన్ 1న `శ‌ర‌భ‌`
You are at idlebrain.com > News > Functions
Follow Us

7 May 2018
Hyderabad

aఎ.ఎస్‌.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఆకాష్‌ కుమార్‌, మిస్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా జయప్రద ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'శరభ'. యన్‌.నరసింహారావు దర్శకుడు. అశ్వనికుమార్‌ సహాదేవ్‌ నిర్మాత. ఈ చిత్రం జూన్ 1న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో...

మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి మాట్లాడుతూ - ``శ‌ర‌భ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి మూడేళ్లు ప‌ట్టింది. అంత స్పాన్ ఉన్న సినిమా. ఎంతో చ‌క్క‌గా తీర్చిదిద్దారు. డైరెక్ట‌ర్ న‌ర‌సింహారావుగారు తొలి సినిమా చేస్తున్నా కూడా ఇంత పెద్ద స‌బ్జెక్ట్‌ను చ‌క్క‌గా డీల్ చేశారు. హీరో ఆకాశ్‌కి ఇది తొలి సినిమా. మంచి ఎక్స్‌పీరియెన్స్‌డ్ మూవీ. నిర్మాత అశ్వ‌నీకుమార్‌గారు సినిమాపై ప్యాష‌న్‌తో ఇంత హెవీ సినిమాను నిర్మించారు. ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. జ‌య‌ప్ర‌ద‌గారు ఈ సినిమాలో త‌ల్లి పాత్ర‌లో అద్భుతంగా నటించారు. మ‌ల్టిపుల్ క్యారెక్ట‌ర్‌లో చ‌క్క‌గా చేశారు. జూన్ 1న సినిమా విడుద‌ల‌వుతుంది. త‌ప్ప‌కుండా యూనిట్ ప్ర‌య‌త్నాన్ని అశీర్వ‌దించాలి`` అన్నారు.

అశ్వ‌నీకుమార్ స‌హ‌దేవ్ మాట్లాడుతూ - ``శ‌ర‌భ సినిమాను జూన్ 1న విడుద‌ల చేస్తున్నాం. మంచి విజువ‌ల్ గ్రాపిక్స్ ఉన్న సినిమా. ప్రేక్ష‌కుల‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది`` అన్నారు.

హీరో ఆకాశ్ మాట్లాడుతూ - ``యూనిట్ స‌భ్యుల స‌హ‌కారంతో సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.

జ‌య‌ప్ర‌ద మాట్లాడుతూ - ``నేను ఒక గ్యాప్ త‌ర్వాత సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు .. ఎలాంటి సినిమా చేయాలి అనే ఆలోచ‌న వ‌చ్చింది. మ‌ళ్లీ న్యూ క‌మ్మ‌ర్‌గా ఎంట్రీ ఇచ్చాను. నేను సినిమా చేయాల‌నుకుంటున్న త‌రుణంలో న‌ర‌సింహారావుగారు వ‌చ్చి ఈ క‌థ‌ను నాకు చెప్పారు. విన‌గానే సినిమా త‌ప్ప‌కుండా క్లిక్ అవుతుందనిపించింది. నాకు స‌క్సెస్ ఫుల్ రీ ఎంట్రీ అవుతుంద‌నిపించింది. అశ్వ‌నీకుమార్‌గారు ధైర్యంతో మూడు ఏళ్లు క్వాలిటీ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. అలాగే అశ్వ‌నీకుమార్ హిందీ కుర్రాడైనా.. తెలుగులో సినిమా చేశాడు. న‌టిగా దాదాపు మూడు వంద‌ల సినిమాలు చేయ‌బోతున్నాను. ఈ త‌రుణంలో నాకు ఈ సినిమా ఓ మ‌లుపు తీసుకొస్తుంద‌ని అనుకుంటున్నాను. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు ద‌ర్శ‌కుడు న‌రసింహారావుగారికి థాంక్స్‌. చాలా వేరియేష‌న్స్ ఉన్న పాత్ర నాది`` అన్నారు. aఆకాష్‌ కుమార్‌, మిస్టి చక్రవర్తి, డా.జయప్రద, నెపోలియన్‌, నాజర్‌, పునీత్‌ ఇస్సార్‌, తనికెళ్ళ భరణి, ఎల్‌.బి.శ్రీరాం, పొన్‌వన్నన్‌, షాయాజీ షిండే, పృథ్వీ, చరణ్‌దీప్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్‌: కోటి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: రమణ సాల్వ, ఆడియోగ్రఫీ: లక్ష్మీ నారాయణ ఎ.ఎస్‌, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌ మన్నె, పాటలు: వేదవ్యాస్‌, రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరాం, నిర్మాత: అశ్వని కుమార్‌ సహదేవ్‌, రచన, దర్శకత్వం: యన్‌.నరసింహారావు.

 

 

 

 

 

 



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved