4 December 2016
Hyderabad
తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం ఎస్-3 (`సింగం-3`). సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
హీరో సూర్య మాట్లాడుతూ - ``నా సినిమాలను తమిళ ప్రేక్షకులు ఎలాగైతే ఆదరిస్తారో, తెలుగు ప్రేక్షకులు అంతే ఆదరిస్తుంటారు. . అరవింద్‌గారు ఇప్పుడు రామ్‌చరణ్‌తో చేసిన ధృవ సినిమా చాలా బాగా వచ్చిందని విన్నాను. ఈరోజు ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. రామ్‌చరణ్‌కు ధృవ స్పెషల్ మూవీ కావాలని కోరుకుంటున్నాను. ఇక సింగం విషయానికి వస్తే స్టూడియో గ్రీన్ బ్యానర్ స్టార్ట్ చేసి పది సంవత్సరాలవతున్న సందర్భంగా సింగం 3 సీక్వెల్ ప్రేక్షకులు ముందుకు రానుండటం ఆనందంగా ఉంది. హరిగారి దర్శకత్వంలో నేను నటించిన ఐదో సినిమా, హరీష్ జయరాజ్‌తో నేను చేసిన ఎనిమిదవ సినిమా ఇది. 1997లో నేరుక్కు నేర్ అనే సినిమాతో నేను సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు నన్ను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి స్క్రిప్ట్స్ రాస్తారని అనుకోలేదు. నరసింహం క్యారెక్టర్‌లో బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. యముడు సినిమా చేసినప్పుడు యముడు 2 చేస్తామనుకోలేదు. అలాగే యముడు 2 చేసినప్పుడు యముడు 3 సినిమా చేస్తానని అనుకోలేదు. కానీ అలా అన్నీ కుదిరాయి. ముందు హరి ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మిలటరీ ఆఫీసర్ కథతో నా దగ్గరకు వచ్చాడు. మా కాంబినేషన్‌లో ఆ కథతో సినిమా చేయాలనుకుంటున్న సమయంలో సింగం 3 కథ కుదిరింది. తమిళనాడులో ఎం.జి.రామచంద్రన్ గారు, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.టి.రామారావుగారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు జరిగిన ఘటనల ఆధారంగా ఈ కథను రాసుకున్నారు. మంగళూర్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సినిమాను 90 శాతం వైజాగ్‌లో చిత్రీకరించారు.
హరిగారు నరసింహం క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లి చూపించారు. యూనిట్‌లో ప్రతి ఒక్కరూ నరసింహం క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉండాలని ప్రయత్నించారు. ఇందులో అనుష్కతో పాటు ఈ సిరీస్‌లో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో డిసెంబర్ 11న, తమిళంలో డిసెంబర్ 13న ఆడియో విడుదల చేస్తాం. సినిమాను డిసెంబర్ 23న విడుదల చేస్తున్నాం`` అన్నారు.
శశాంక్ వెన్నెలకంటి మాట్లాడుతూ - ``టీజర్ థాంజడ్ వాలాలా ఉంటే సినిమా టెన్ థాంజడ్‌వాలా ఉంటుంది. సింగం ఒక్కొక్క పార్ట్ రిలీజ్ అవుతున్నప్పుడు ప్రేక్షకుల్లో ఓ ఎక్స్‌పెక్టేషన్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమా ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవుతుంది`` అన్నారు.
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ``యముడు సూపర్‌హిట్ అయితే సింగం సూపర్‌డూపర్‌హిట్ అయ్యింది. ఇప్పుడు సింగం 3 ఈ రెండు చిత్రాలకు మించి పెద్ద హిట్ అవుతుంది. అల్రెడి టీజర్‌తో సూర్య అండ్ టీం సెన్సేషన్ క్రియేట్ చేశారు. సినిమాతో మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. సూర్య, హరి, జ్ఞానవేల్ రాజా కాంబినేషన్‌లో సింగం4 కూడా విడుదల కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ``సింగం 3 సినిమాను తెలుగులో విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన సూర్య, జ్ఞానవేల్ రాజాగారికి థాంక్స్. `24` సినిమా సమయంలో సూర్య, జ్ఞానవేల్‌రాజాగారిని కలిసి సింగం 3 తెలుగు హక్కులు అడిగినప్పుడు 24 సినిమా విడుదల తర్వాత చూస్తామని అన్నారు. అన్నట్లుగానే నాకు హక్కులు ఇచ్చారు. నన్ను నమ్మి తెలుగు హక్కులు ఇచ్చినందుకు వారికి థాంక్స్. శాటిలైట్ హక్కులు కూడా ఓ ప్రముఖ చానెల్ ఫ్యాన్సీ రేటుతో దక్కించుకుంది`` అన్నారు.
జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ - ``మా స్టూడియో గ్రీన్ బ్యానర్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకన్న సందర్భంగా ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది. హరి, సూర్య కాంబినేషన్‌లో వస్తున్న సింగం3 అందరి అంచనాలను అందుకుంటుంది`` అన్నారు.