pizza
Veedevadu release on 8th September
సెప్టెంబ‌ర్ 8న `వీడెవ‌డు`
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 August 2017
Hyderaba
d

స‌చిన్‌, ఇషా గుప్తా హీరో హీరోయిన్లుగా వై కింగ్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రైనా జోషి నిర్మించిన చిత్రం `వీడెవ‌డు`. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 8న విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో స‌చిన్ జోషి, ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య‌, సి.క‌ల్యాణ్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ శివ‌ప్ర‌సాద్ గుడిమిట్ల త‌దిత‌రులు పాల్గొన్నారు.

ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య మాట్లాడుతూ - ``ఎస్‌.ఎం.ఎస్‌, భీమిలి క‌బ‌డ్డీ జట్టు, శంక‌ర సినిమాలు అన్నీ రీమేక్ చిత్రాలే. నేను తెలుగులో చేసిన స్ట్ర‌యిట్ మూవీ వీడెవ‌డు.బినేంద్ర మీన‌న్ సినిమాటోగ్ర‌ఫీ, థ‌మ‌న్ మ్యూజిక్‌, ర‌ఘు కుల‌క‌ర్ణి ఆర్ట్‌, స‌హా అంద‌రూ ఎంతో స‌పోర్ట్ చేశారు. స‌చిన్ జోషిగారు ఎక్స‌లెంట్‌గా న‌టించారు. మంచి థ్రిల్ల‌ర్ మూవీ. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమాను సెప్టెంబ‌ర్ 8న విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ - ``డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో వ‌స్తోన్న సినిమా ఇది. టైటిల్ చాలా ఆస‌క్తిగా ఉంది. ద‌ర్శ‌కుడు స‌త్య సినిమాను ఎంతో ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లేతో తెర‌కెక్కించాడు. తెలుగు, త‌మిళంలో సినిమా సెప్టెంబ‌ర్ 8న సినిమా విడుద‌ల‌వుతుంది. సెప్టెంబ‌ర్ 2న సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హిస్తాం. టీం అందరికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

స‌చిన్ జోషి మాట్లాడుతూ - ``మంచి థ్రిల్ల‌ర్ మూవీ. నా రోల్‌లో పాజిటివ్ యాంగిల్‌, నెగ‌టివ్ యాంగిల్ రెండూ ఉన్నాయి. ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్‌. యూనిక్ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ల‌వ్‌, యాక్ష‌న్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మూవీ. ప్రేక్ష‌కులు నా నుండి ఏదైతే ఆశించి వ‌స్తారో ఆ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉంటాయి. సెప్టెంబ‌ర్ 8న సినిమా విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

స‌చిన్‌, ఇషా గుప్తా, ప్ర‌భు, కిషోర్‌, సుప్రీత్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః బినేంద్ర మీన‌న్‌, సంగీతంః ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, ఎడిటింగ్ః ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్ః ర‌ఘుకుల‌క‌ర్ణి, ఫైట్స్, క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌, పాట‌లుః రామ‌జోగ‌య్య‌శాస్త్రి, భాస్క‌ర‌భ‌ట్ల‌, శ్రీమ‌ణి, కొరియోగ్ర‌ఫీః సీజ‌ర్‌, జానీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః శివ‌ప్ర‌సాద్ గుడిమిట్ల‌, ప్రొడ్యూస‌ర్ః రైనా జోషి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః తాతినేని స‌త్య‌.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved