pizza
VIP 2 press meet
`విఐపి2` ప్రెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 July 2017
Hyderabad

ధ‌నుష్ హీరోగా వి క్రియేష‌న్స్‌, వండ‌ర్ బార్స్ ప‌తాకాల‌పై రూపొందుతున్న చిత్రం `విఐపి2`. సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌కురాలు. క‌లైపులి థాను, ధ‌నుష్ నిర్మాత‌లు. ఈ సినిమా ప్రెస్‌మీట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో..

సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ - ```విఐపి2` నాకు స్పెష‌ల్ మూవీ. ధ‌నుష్ తెలుగులో చేసిన తొలి స్ట్ర‌యిట్ మూవీ. ధ‌నుష్ నాపై న‌మ్మ‌కంతో నాకు అవ‌కాశం ఇచ్చి స‌పోర్ట్ చేసినందుకు ఆయ‌న‌కు థాంక్స్‌`` అన్నారు.

Kajol Glam gallery from the event

హీరో ధ‌నుష్ మాట్లాడుతూ - ``తెలుగులో నేను చేసిన‌ తొలి స్ట్ర‌యిట్ సినిమా `విఐపి2`.తెలుగులో స‌క్సెస్ అయిన విఐపి చిత్రాన్ని తెలుగులో ర‌ఘువ‌ర‌న్ బి.టెక్ పేరుతో విడుద‌ల చేశాం. ఆ సినిమాకు సీక్వెల్‌గానే ఈ సినిమా రూపొందింది. తెలుగులో చేయ‌డం వ‌ల్ల భాష గురించి కూడా తెలుసుకుంటున్నాను. బ్యూటీఫుల్ జర్నీ. ర‌ఘువ‌ర‌న్ బి.టెక్ సినిమాను ప్రేక్ష‌కులు ఎలా ఎంజాయ్ చేశారో ఈ సినిమాను కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. నిర్మాత‌లు థాను, ప‌రంధామ‌న్‌గారికి థాంక్స్‌`` అన్నారు.

కాజోల్ మాట్లాడుతూ - ``నాకు ఇష్ట‌మైన సిటీస్‌లో హైద‌రాబాద్ ఒక‌టి. గ‌తంలో నేను హైద‌రాబాద్‌కు చాలా సార్లు వ‌చ్చాను. నేను హిందీ కాకుండా వేరే భాష‌లో న‌టించి చాలా కాల‌మైంది. కానీ సౌంద‌ర్య‌, ధ‌నుష్ కార‌ణంగానే విఐపి2లో న‌టించాను. ధ‌నుష్ చాలా కేర్ తీసుకున్నాడు`` అన్నారు.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved