pizza
Ami Tumi success meet
`అమీ తుమీ` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

12 June 2017
Hyderabad

ఏ గ్రీన్‌ ట్రీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అవసరాల శ్రీనివాస్‌, అడివిశేష్‌ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో కె.సి.న‌ర‌సింహ‌రావు నిర్మాత‌గా రూపొందిన చిత్రం 'అమీ తుమీ'. ఈ సినిమా జూన్‌ 9న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో స‌క్సెస్‌మీట్ జ‌రిగింది.

ద‌ర్శ‌క‌డు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ మాట్లాడుతూ - ``ఈ సినిమా విజ‌యాన్ని ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రినారాయ‌ణ‌రావుగారికి అంకితం ఇస్తున్నాను. ఎందుకంటే ఆయ‌న చిన్న సినిమాల‌ను, ఇండిపెండెంట్ సినిమాల స‌క్సెస్ కావాల‌ని బాగా కోరుకునేవారు. కాబ‌ట్టి ఆయ‌న‌కు మా సినిమా స‌క్సెస్‌ను అంకిత‌మిస్తున్నాం. సినిమా విడుద‌లైన‌ప్ప‌టి నుండి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అందుకు కార‌ణ‌మైన మీడియా మిత్రుల‌కు అభినంద‌న‌లు. సినిమాను స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌.మా స‌క్సెస్‌కు వ‌స్తోన్న రెస్పాన్స్‌ను ప్రేక్ష‌కుల నుండి తెలుసుకోవ‌డానికి గురువారం నుండి ఆదివారం వైజాగ్ కాకినాడ నుండి తిరుప‌తి వ‌ర‌కు టూర్‌ను నిర్వ‌హిస్తాం```` అన్నారు.

Glam galleries from the event

అడివిశేష్ మాట్లాడుతూ - ``ఈ సినిమా స‌క్సెస్‌లో మీడియా పాత్ర మ‌ర‌చిపోలేం. ఆడియెన్స్ సినిమాను అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. స‌క్సెస్‌కు కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్కరికీ థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత కె.సి.న‌ర‌సింహారావు మాట్లాడుతూ - ``మా సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడికి థాంక్స్‌. సినిమా విడుద‌లైన త‌ర్వాత ఓవ‌ర్‌సీస్ నుండి బ్లూ స్కై వారు, నైజాం నుండి, వైజాగ్ స‌హా అన్ని ఏరియాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మా ద‌ర్శ‌కుడు సినిమా చేసే స‌మ‌యం కంటే సినిమా విడుద‌లైన త‌ర్వాతే ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతున్నారు. మంచి టీం స‌పోర్ట్‌తో మంచి విజ‌యాన్ని సాధించాం`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఈషా, అదితి, శ్యామ‌ల‌, భార్గ‌వ్‌, త‌డివేలు, పిజి విందా త‌దిత‌రులు పాల్గొని చిత్రం విజ‌యం ప‌ట్ల త‌మ సంతోషాన్ని వ్య‌క్త ప‌రిచారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved