pizza
Bethaludu success meet
`భేతాళుడు` థాంక్స్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

3 December 2016
Hyderaba
d

విజియ్ ఆంటోని హీరోగా మల్కాపురం శివ‌కుమార్‌, ఫాతిమా విజ‌య్ ఆంటోని స‌మ‌ర్ప‌ణ‌లో మానస్ రిషి ఎంట‌ర్‌ప్రైజెస్‌, విన్ విన్ విన్ క్రియేష‌న్స్‌, ఆరా సినిమాస్ బ్యాన‌ర్స్‌పై ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.రోహిత్‌, ఎస్‌.వేణుగోపాల్ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం `భేతాళుడు`. ఈ చిత్రం డిసెంబ‌ర్ 1న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో....

విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ - ``భేతాళుడు సినిమాను సూప‌ర్‌హిట్ చేసిన ప్రేక్ష‌కులు థాంక్స్‌. న్యూ స‌బ్జెక్ట్‌, కొత్త అటెంప్ట్ చేశాం. ప్రేక్ష‌కులు మా సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ స‌క్సెస్‌తో ఫ్యూచ‌ర్‌లో ఎలాంటి ఇంకా మంచి సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. ఈ సినిమాను తెలుగు, త‌మిళంలో 1300 థియేట‌ర్స్‌కు పైగా విడుద‌ల చేశారు. తెలుగు, త‌మిళం నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఇక‌పై నేను చేసే సినిమాల‌ను తెలుగు రాష్ట్రాల్లో కూడా చిత్రీక‌రిస్తాను. నా త‌దుప‌రి చిత్రం `య‌ముడు`. మ‌రో రెండు, మూడు నెల‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది`` అన్నారు.

Nandita Shwetha Glam gallery from the event

నిర్మాత‌ల్లో ఒక‌రైన వేణుగోపాల్ మాట్లాడుతూ - ``భేతాళుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. డిసెంబ‌ర్ 1న భేతాళుడు చాలా మంచి క‌లెక్ష‌న్స్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. తెలుగు హ‌క్కుల‌ను మా సంస్థ‌కు ఇచ్చినందుకు విజ‌య్ ఆంటోనిగారికి థాంక్స్‌. ఇప్పుడు విజ‌య్ ఆంటోనిగారు తెలుగులోస్ట్ర‌యిట్ సినిమా చేయాల‌ని కోరుకుంటున్నాను. ప్ర‌స్తుతం మా బ్యాన‌ర్‌లో వ‌స్తున్న న‌క్ష‌త్రం త‌ర్వాత విజ‌య్‌గారు ఒప్పుకుంటే ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి నేను సిద్ధంగా ఉన్నాను`` అన్నారు.

భాష్య శ్రీ మాట్లాడుతూ - భేతాళుడు సినిమాకు వ‌స్తున్న ఆద‌ర‌ణ చాలా బావుంది. తెలుగు, త‌మిళంలో ఒకేసారి విడుద‌లైన ఈ సినిమాను ప్రేక్ష‌కులు సూప‌ర్ స‌క్సెస్ చేశారు. త‌మిళంలో అయితే రెండు రోజుల్లోనే ఆరుకోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్‌ను సాధించింది`` అన్నారు.

ఈ సినిమా స‌క్సెస్‌లో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంద‌ని హీరోయిన్ అరుంధ‌తి నాయ‌ర్‌, ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి తెలియ‌జేశారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved