pizza
LIE success meet
`లై` థాంక్స్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

13 August 2017
Hyderaba
d

యూత్‌స్టార్‌ నితిన్‌ నటించిన చిత్రం 'లై'. 'అందాల రాక్షసి', కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా వెంకట్‌ బోయిన్‌పల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకంపై టేస్ట్‌ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌ రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'లై'. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలైంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో థాంక్స్‌మీట్ జరిగింది. ఈ సంద‌ర్భంగా..

సినిమాటోగ్రాఫ‌ర్ యువ‌రాజ్ మాట్లాడుతూ - ``నేను ఈ రోజు ఇక్క‌డ నిల‌బ‌డి ఉండ‌టానికి కార‌ణ‌మైన నా గురువు ర‌త్న‌వేలుగారికి థాంక్స్‌. హ‌ను రాఘ‌వ‌పూడితో నేను వ‌ర్క్ చేసిన మూడో సినిమా ఇది. ఈ సినిమాలో ప‌నిచేయ‌డం నాకొక లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్‌. అర్జున్‌గారు, నితిన్‌తో ప‌నిచేయడం గుడ్ ఎక్స్‌పీరియెన్స్‌. అవకాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు స‌హకారం అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌`` అన్నారు.

మేఘా ఆకాష్ మాట్లాడుతూ - ``తెలుగులో నేను చేసిన మొద‌టి సినిమాకు ఇంత మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డం ఆనందంగా ఉంది. నాకు ఇది స్పెష‌ల్ మూవీ. ఈ అవ‌కాశం క‌లిగించిన హ‌నురాఘ‌వ‌పూడి, నిర్మాత‌లు, హీరో నితిన్ స‌హా అంద‌రికీ థాంక్స్‌. సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కులకు స్పెష‌ల్ థాంక్స్‌`` అన్నారు.

హ‌నురాఘ‌వ‌పూడి మాట్లాడుతూ - ``అఆ సినిమా త‌ర్వాత నితిన్ స్థానంలో మ‌రేవ‌రైనా హీరో ఉండుంటే సేఫ్ గేమ్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించేవారు. కానీ త‌ను కొత్త‌గా సినిమా ఉండాల‌నుకున్నాడు. అదే స‌మ‌యంలో నేను క‌లిశాను. సినిమా కొత్త‌గా ఉండాల‌ని త‌ను అన్నాడు. త‌న‌కు ఈ లైన్ చెప్ప‌గానే ఒప్పుకోవ‌డంతో నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. అలాగే అప్ప‌టికే 14 రీల్స్ బ్యాన‌ర్‌లో కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ సినిమా చేశాను. వారితోనే ఈ సినిమా చేసేట‌ప్పుడు వారెంతో స్వేచ్ఛ‌నిచ్చారు. అర్జున్‌గారి సినిమాలు చూస్తూ పెరిగాను. మేట‌ర్ ఆఫ్ డిస్‌గైస్ అనే విధంగా విల‌న్ క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేసుకున్నాను. ఈ సినిమాలో నేను ముందుగా రాసుకున్న‌ది విల‌న్ క్యారెక్ట‌ర్‌నే. చాలా క్రేజీ క్యారెక్ట‌ర్‌. ఈ క్యారెక్ట‌ర్‌ను 150 సినిమాలు చేసిన అర్జున్‌గారు చేయ‌డం ఎంతో బ‌లం చేకూరిన‌ట్ట‌య్యింది. సినిమాను యు.ఎస్‌లో షూట్ చేయ‌డానికి 40 రోజుల ముందుగానే రెక్కీ నిర్వ‌హించుకున్నాం. ఏ షాట్‌ను ఎలా చేయాలో నేను, యువ‌రాజ్ ప్లాన్ చేసుకున్నాం. యువ‌రాజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంటెడ్ ప‌ర్స‌న్‌. త‌న కాకుండా మ‌రేవ‌రైనా ఇంత త‌క్కువ టైమ్‌లో ఇంత‌ క్వాలిటీగా ఈ సినిమాను చేసుండ‌లేరని నేను చాలెంజ్ చేసి చెప్ప‌గ‌ల‌ను రెండు వంద‌ల శాతం న‌మ్మి చేసిన సినిమా ఇది. ప‌దేళ్ల‌లో ఇలాంటి సినిమా రాలేద‌ని చెప్ప‌గ‌ల‌ను. ప్ర‌తి సీన్‌ ఎగ్జ‌యిట్‌మెంట్‌తో క‌ళ్ల‌ప్ప‌గించి చూసేలా ఉంటుంది.`` అన్నారు.

Megha Akash glam gallery from the event

నితిన్ మాట్లాడుతూ - ``ఆగ‌స్ట్ 11న విడుద‌లైన మూడు సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నందుకు ముందుగా ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. లై సినిమా జ‌ర్నీ చాలా పెద్ద‌ది. చాలా మంది కొత్త సినిమాలు రావ‌డం లేద‌ని అంటుంట‌డం మ‌నం వింటూనే ఉన్నాం. అఆ త‌ర్వాత నేను కూడా కొత్త‌గా చేయాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న‌ప్పుడు హ‌ను న‌న్ను క‌లిసి ఈ లైన్‌ను చెప్పాడు. స్టోరీని ప్రిపేర్ చేయ‌మ‌ని చెప్పాను. మా ఇద్ద‌రితో పాటు నిర్మాత‌లు కూడా ఈ క‌థ‌ను న‌మ్మారు. అంద‌రి ఏడాది క‌ష్ట‌మే ఈ సినిమా. టీజ‌ర్‌, పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా ఆగ‌స్ట్ 11న విడుద‌లంటే ఆగ‌స్ట్ 10న టెన్ష‌న్‌తో నిద్ర ప‌ట్ట‌లేదు. ఆల‌స్యంగా నిద్ర‌పోయాను. ముందు సినిమా చాలా బావుందని యు.ఎస్ నుండి పాజిటివ్ టాక్ రాబ‌ట్టుకుంది. త‌ర్వాత ఇండియా నుండి తొలి రోజు డివైడ్ టాక్ వ‌చ్చింది.శ‌నివారం సినిమా 65 శాతం మంది బాగుంద‌ని అన్నారు. ఈరోజు సినిమాను 85 శాతం మంది బావుందంటున్నారు. సినిమాపై రెస్పాన్స్‌, సినిమాకి వ‌స్తోన్న రెవెన్యూ ఎంతో మారింది. కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎంజాయ్ చేస్తున్నారు. అర్జున్‌గారు లేకుంటే సినిమా లేదు. సినిమాను ఊహించుకోలేం. సినిమా రిజ‌ల్ట్‌ను ప‌క్క‌న పెడితే హ‌న
ు రాఘ‌వ‌పూడి చాలా టాలెంటెడ్ డైరెక్ట‌ర్. మూడు నాలుగేళ్ల‌లో త‌ను టాప్ డైరెక్ట‌ర్ అవుతాడు`` అన్నారు.

అర్జున్ మాట్లాడుతూ - ``హీరోగా చేస్తున్న న‌న్ను విల‌న్‌గా చూపెట్టిన అందాల రాక్ష‌సుడు హ‌ను రాఘ‌వ‌పూడి. త‌న‌ను రాక్ష‌సుడ‌ని ఎందుకు అన్నానంటే, త‌ను త‌న వ‌ర్క్ ప‌ట్ల అంత డేడికేటివ్‌గా ఉంటాడు. త‌న‌కు కావాల్సిన అవుట్‌పుట్ వ‌చ్చే వ‌ర‌కు ఎవ‌రినీ వ‌ద‌లిపెట్ట‌డు. సినిమాకు వ‌చ్చిన మంచి క్రెడిట్ అంతా హ‌నుకే ద‌క్కుతుంది. ద‌ర్శ‌కుడిని న‌మ్మి కొత్త కాన్సెప్ట్ సినిమా చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన నిర్మాత‌ల‌కు అభినంద‌న‌లు. ఇక నితిన్ గురించి చెప్పాలంటే త‌న‌తో 12 ఏళ్ల క్రితం శ్రీ ఆంజ‌నేయం సినిమా చేశాను. ఆప్పుడు త‌నెంత డేడికేటివ్‌గా ఉన్నాడో, ఇప్పుడు కూడా అంతే డేడికేష‌న్‌తో ఉన్నాడు. 102 డిగ్రీల జ్వ‌రంతో ఉన్నా కూడా యాక్ష‌న్స్ సీన్స్‌లో న‌టించాడు. మేఘా నేచుర‌ల్ యాక్ట్రెస్‌. యువ‌రాజు ఎంతో హార్డ్‌వ‌ర్క్ చేశారు. మంచి, కొత్త ప్ర‌య‌త్నంగా చేసిన లై సినిమాలో నేను భాగం కావ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved