శర్వానంద్, మెహరీన్ జంటగా యు.వి.క్రియేషన్స్ బేనర్‌లో నటించిన చిత్రం `మహానుభావుడు`. మారుతి దర్శకుడు. వంశీ, ప్రమోద్ నిర్మాతలు. సినిమా సెప్టెంబర్ 29న విడుదలై సక్సెస్ సాధించిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్, దర్శకుడు మారుతి, దిల్‌రాజు, మెహరీన్, నిర్మాతలు వంశీ, ప్రమోద్, ఎస్.కె.ఎన్, ఎస్.ఎస్.థమన్, భద్రమ్, వేణు, మధునందన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ - ``ఈరోజుల్లో సినిమా నుండి నాకు మారుతిగారితో అనుబంధం ఎక్కువ. ప్రేమకథా చిత్రమ్, భలేభలే మగాడివోయ్ చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేశాను. ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వర్క్ చేశాను. తనతో జర్నీ చాలా హ్యాపీగా ఉంది. అలాగే పండగేదైనా సరే హిట్స్ ఇచ్చే హీరో మన శర్వానంద్‌గారికి కూడా కృతజ్ఞతలు`` అన్నారు.
ఎస్.ఎస్.థమన్ మాట్లాడుతూ - ``మారుతికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫస్ట్‌డే రోజు నుండే అందరూ తమ సినిమాలా భావించి కష్టపడ్డారు. మారుతితో కలిసి పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను. మంచి సాహిత్యం కుదిరింది. దిల్‌రాజుగారి అందించిన సపోర్ట్ మరిచిపోలేనిది. శర్వానంద్, మెహరీన్ చాలా చక్కగా నటించారు. నిర్మాతలు వంశీ,ప్రమోద్, విక్కిలకు థాంక్స్`` అన్నారు.
మెహరీన్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. దర్శకుడు మారుతిగారు నాకు మేఘన రోల్ ఇచ్చినందుకు థాంక్స్. శర్వా లవ్‌లీ కోస్టార్. సినిమా సక్సెస్‌లో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్`` అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ - ``మహానుభావుడు సక్సెస్ రూపంలో ప్రేక్షకులు నాకు గిఫ్ట్ ఇచ్చారు. భలే భలే మగాడివోయ్ తర్వాత నేను ఎంజాయ్ చేస్తూ జరుపుకున్న పుట్టినరోజు ఇది. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను కుటుంబ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. గౌరవం పెంచిన సినిమా ఇది. ఇలాంటి మంచి చిత్రాలు ఇకపై కూడా వస్తాయి. టీమ్ చాలా డేడికేటెడ్‌గా పనిచేసింది. చాలా నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, థమన్ మ్యూజిక్ సహా అందరూ టీం చాలా గ్రిప్పింగ్‌గా పనిచేశారు. శర్వానంద్‌కు చాలా మంచి పేరు వచ్చింది. పెర్ఫామెన్స్ సైడ్, లుక్ ఇలా అన్నీ విషయాల్లో శర్వా బావున్నాడని అందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. నాకు దిల్‌రాజు అందించిన సహకారం మరచిపోలేనిది. ఆయన బ్యానర్‌లో తప్పకుండా సినిమా చేస్తాను. నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీ, ఎస్.కె.ఎన్‌లకు థాంక్స్. ఎస్.కె.ఎన్ తొలిరోజు నుండి ఈరోజు వరకు ఎంతో సపోర్ట్ చేశారు`` అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ - ``ఆర్య సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా స్టార్ట్ అయిన వంశీ, ఇప్పుడు నాతో సమానంగా విజయవంతమైన సినిమాలను చేస్తున్నాడు. ఏడు సినిమాల్లో ఐదు సక్సెస్‌ఫుల్ సినిమాలు చేయడమంటే చిన్న విషయం కాదు. ఎంత హార్డ్‌వర్క్‌చేస్తే సక్సెస్ వస్తుందో నాకు తెలుసు. మారుతి, వంశీలకు మంచి వేవ్ లెంగ్త్ ఉంది. దసరాకు విడుదలైన మహానుభావుడు ఇంత పెద్ద సక్సెస్ కావడం ఆనందంగా ఉంది. పన్నెండు, పదమూడేళ్ల ముందు నుండి శర్వానంద్ నాకు పరిచయం. తను చిన్న క్యారెక్టర్స్ చేసినా, ఇప్పుడు పెద్ద క్యారెక్టర్స్‌లో నటించినా..సినిమాకు తనేం చేయగలడో చేస్తూ వస్తున్నాడు. హీరో సినిమాను మెయిన్‌గా రన్ చేయాలి. హీరోకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. శర్వా ఆ రెస్పాన్సిబిలిటీని నిలబెట్టుకుంటున్నాడు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. మెహారీన్ లక్కీ గర్ల్. ఈ సినిమాతో హీరోయిన్‌గా రెండో సక్సెస్ అందుకుంది. మా రాజా ది గ్రేట్‌తో హ్యాట్రిక్ హీరోయిన్‌గా కూడా పేరు తెచ్చుకుంటుంది. మారుతి కూడా నాతో ఆర్య సినిమాతోనే కనెక్ట్ అయ్యాడు. ప్రేక్షకుడు సినిమాను ఎంజాయ్ చేయాలనేలానే లైటర్ వేలో సినిమా కథలను రాసుకుంటుంటాడు. తన సక్సెస్ ఫార్ములానే అది
. మహానుభావుడు అనే సినిమాలో హీరో క్యారెక్టర్‌ను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. థమన్ మంచి సంగీతం అందించారు. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
శర్వానంద్ మాట్లాడుతూ - ``ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు ఓ నటుడిగా చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమా అంతటా నా క్యారెక్టర్‌ను మారుతి చేయించుకున్న విధానం నచ్చింది. నటుడిగా ఓ శాటిస్పాక్షన్ ఇచ్చిన సినిమా ఇది. ఇంత మంచి సినిమా నాదని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ప్రతి క్యారెక్టర్‌ను రిలేట్ చేసుకుని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. థమన్ చాలా సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. వంశీ, ప్రమోద్, విక్కీలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకే బ్యానర్‌లో మూడు హిట్స్ రావడం అనేది మాటల్లో చెప్పుకోలేనిది. మెహరీన్ నటన చాలా హార్డ్‌వర్కర్, చాలా చక్కగా నటించింది. సహకారం అందించిన అందరికీ థాంక్స్`` అన్నారు.