pizza
Howrah Bridge teaser launch
`హౌరా బ్రిడ్జ్‌` టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

12 October 2017
Hyderabad

శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ... ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం `హౌరా బ్రిడ్జ్`. విభిన్నమైన కథలతో దూసుకెళ్తున్న రాహుల్ రవీంద్రన్ మరో ఇంట్రస్టింగ్ సినిమా హౌరా బ్రిడ్జ్‌తో ప్రేక్ష‌కుల ముందుకురానున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను గురువారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

దర్శకుడు రేవన్ యాదు మాట్లాడుతూ ``గోడ, బ్రిడ్జ్ ఒకే మెటీరియల్ తో తయారవుతాయి కానీ గోడ మనుషుల్ని విడదీస్తుంది. బ్రిడ్జ్ మనుషుల్ని కలుపుతుంది ఇదే ఈ చిత్ర కాన్సెప్ట్. హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామా గా సాగుతుంది ఈ సినిమా`` అని తెలిపారు.

రాహుల్ ర‌వీంద్ర‌న్ మాట్లాడుతూ ``లవ్లీ జర్నీ, క్వాలిటీ ప్రాడక్ట్, డైరెక్టర్ చాలా క్లియర్ గా పనిచేశాడు, హీరోయిన్ చాందిని వెరీ టాలెంటెడ్, డైరెక్టర్ తరువాత కెమెరామెన్ హీరో అని చెప్పొచ్చు. బెస్ట్ విసువల్ క్వాలిటీ ఇచ్చారు, ఇక నిర్మాత సపోర్టివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు``అన్నారు.

హీరోయిన్ చాందిని మాట్లాడుతూ ``లాంగ్ అండ్ ఏమోషనల్ జర్నీ. రెవన్ గారితో పని చేయడం బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ ను ఇచ్చింది. సినిమా చాలా రిచ్ గా వచ్చింది`` అని తెలిపారు.

శేఖ‌ర్ చంద్ర మాట్లాడుతూ ``ఈ చిత్రం లో 4 పాటలు, ఒక బిట్సాంగ్ ఉన్నాయి. త్వరలో ఆడియో తో మీ ముందుకు వస్తాం`` అని తెలిపారు

రాహుల్ రవీంద్రన్, చాందిని, మనాలి, రావు రమేష్, ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, మ్యూజిక్: శేఖర్ చంద్ర, లిరిక్స్: శ్రీమణి, భాగ్యలక్ష్మి, పూర్ణ చారి, కరుణాకర్, రచనా సహకారం: సాయి కృష్ణ, శ్యామ్, ఏక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజు, కథ- దర్శకత్వం: రెవన్ యాదు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved