5 November 2016
Hyderabad
లక్కీ మీడియా నిర్మిస్తున్న చిత్రం `నాన్న, నేను నా బాయ్ ఫ్రెండ్స్`. మానస, మహాలక్ష్మి సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రావు రమేశ్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్ బాబు, పార్వతీశం, నోయల్ సేన్, కృష్ణభగవాన్, సన, తోటపల్లి మధు, ధన్ రాజ్, జబర్దస్త్ షకలక శంకర్, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. బెక్కం వేణుగోపాల్ (గోపి) నిర్మాత. భాస్కర్ బండి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం టీజర్ ను శనివారం హైదరాబాద్‌లో వి.వి.వినాయక్ విడుదల చేశారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ ``భాస్కర్ నా దగ్గర అసోసియేట్‌గా పనిచేశారు. నా కుటుంబ సభ్యుడిలాంటివాడు. అతను ఈ సినిమా గురించి చెప్పగానే నేను వేణుగోపాల్‌కి ఫోన్ చేశాను. దిల్‌రాజు ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాక మరింత గ్లామర్ వచ్చింది. ఆయన సినిమా టేకప్ చేశారంటే బావున్నట్టే లెక్క. నేను మొదలుపెట్టిన ఆయన బ్యానర్‌లో నా అసోసియేట్స్ కొనసాగుతున్నారు`` అని అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ``సినిమా చూపిస్త మావ తర్వాత నేను లోకల్ అనే చిత్రం చేస్తున్నప్పుడు గోపి ఈ కథ నాకు చెప్పాడు. నేను, నా బాయ్ ఫ్రెండ్స్ అనే టైటిల్ ఇంట్రస్టింగ్‌గా ఉందని అనుకున్నా. అయితే కథ విన్నాక ఆ టైటిల్ కన్నాఇప్పుడు పెట్టిన టైటిల్ బావుంటుందని సజెస్ట్ చేశాను. ఇది తండ్రీ, కూతురు మధ్య సాగే కథ. అందుకే నాన్న అనే పదాన్ని ఇంక్లూడ్ చేయమని చెప్పా. ఈ సినిమా ట్రావెల్‌లో నేను కూడా ఉన్నా. అయితే 15 రోజుల ముందు సినిమా చూసి నా పేరు యాడ్ చేసుకోమని చెప్పా. హెబ్బాకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. నావల్టీ ఉన్న కథ ఇది. అన్నీ పాత్రలూ బావుంటాయి. కూతురున్న తండ్రికి, ఆ కుటుంబానికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. శేఖర్‌చంద్ర మంచి సంగీతాన్నిచ్చారు. ఛోటా చేసిన పాటలు బాగా హెల్ప్ అయ్యాయి. భాస్కర్ ఈ సినిమాను చాలా బాగా తీశారు. ఆన్ స్క్రీన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. నా తర్వాత నిర్మాణంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి సినిమా చేసేది గోపీనే. డిసెంబర్ 9న ఈ సినిమాను విడుదల చేస్తాం`` అని చెప్పారు.
Glam galleries from the event |
|
|
భాస్కర్ బండి మాట్లాడుతూ ``ఈ సినిమాకు మా నిర్మాత గోపీ అద్భుతమైతే, దిల్‌రాజు మహాద్భుతంగా నిలుస్తున్నారు`` అని తెలిపారు.
తేజస్విని మాట్లాడుతూ``ఈ సినిమాతో నాకు మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికింది. నన్ను చూసిన వారందరూ నువ్వు దిల్‌రాజు ప్రొడక్షన్ అమ్మాయివా? వాళ్లు తీస్తున్న అన్నీ చిత్రాల్లోనూ ఉంటున్నావ్ అని అడుగుతున్నారు`` అని తెలిపారు.
నిర్మాత గోపీ మాట్లాడుతూ ``నా ఏడో సినిమా తర్వాత నాకు దిల్‌రాజుతో అసోసియేట్ అయ్యే అవకాశం దక్కింది. ఆయన డబుల్ పాజిటివ్ చూసి చాలా పాజిటివ్‌గా స్పందించారు`` అని అన్నారు.
హెబ్బా పటేల్ మాట్లాడుతూ ``అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు`` అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కెమరా: చోటా.కె.నాయుడు, సంగీతం: శేఖర్ చంద్ర, ఆర్ట్: విఠల్ కోసనమ్, ఎడిటర్: చోటా.కె.ప్రసాద్, స్క్రీన్లప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, కథ: బి.సాయికృష్ణ, పాటలు: చంద్రబోస్, భాస్కర్ భట్ల, వరికుప్పల యాదగిరి, కాసర్ల శ్యామ్, నృత్యాలు: విజయ్ ప్రకాశ్, స్టంట్స్: వెంకట్.