pizza
Next Nuvve theatrical trailer launch
వి4 క్రియేషన్స్‌ 'నెక్స్‌ట్‌ నువ్వే' ట్రైలర్‌ రిలీజ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 September 2017
Hyderaba
d

భారీ చిత్రాల నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్‌, యు.వి.క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ కలిసి వి4 క్రియేషన్స్‌ పేరుతో ఓ కొత్త చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బేనర్‌పై 'నెక్స్‌ట్‌ నువ్వే' పేరుతో ఓ హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఆది, వైభవి శాండిల్య, రష్మీ గౌతమ్‌, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి టి.వి. యాంకర్‌, నటుడు ప్రభాకర్‌ దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మాత. నవంబర్‌ 3న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌, మారుతి, సాయికుమార్‌, ఆది, వైభవి, రష్మీ, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌, యువి క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌, స్టూడియో గ్రీన్‌ జ్ఞానవేల్‌రాజా, నిర్మాత బన్నివాసు తదితరులు పాల్గొన్నారు.

బన్నీ వాసు మాట్లాడుతూ ''అల్లు అరవింద్‌గారితో చాలా సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నాను. జిఎ2 బేనర్‌తోపాటు మరో రెండు ప్రముఖ సంస్థలతో కలిసి మొదటి ప్రయత్నంగా 'నెక్స్‌ట్‌ నువ్వే' చిత్రాన్ని నిర్మించాము. ప్రభాకర్‌గారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా విషయంలో మేమంతా ఎంతో శాటిస్‌ఫై అయ్యాము. ఆడియన్స్‌ మా కంటే ఎక్కువ శాటిస్‌ఫై అవుతారన్న నమ్మకం వుంది'' అన్నారు.

జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ ''సినిమా చూశాను. సూపర్‌గా వుంది. సీన్స్‌, డైలాగ్స్‌ చాలా బాగున్నాయి. ఈ సినిమా చేయడం నాకు ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌. త్వరలోనే ఆదితో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాం'' అన్నారు.

దర్శకుడు ప్రభాకర్‌ మాట్లాడుతూ ''టి.వి. ఛానల్స్‌లో యాంకర్‌గా, డైరెక్టర్‌, నటుడుగా 25 సంవత్సరాలు గడిచిపోయాయి. సినిమాల్లో ఎంటర్‌ అవ్వాలని ఎప్పటి నుంచో వుండేది. నేను ఈ సినిమా డైరెక్ట్‌ చేస్తున్నానంటే దానికి కారణం అల్లు శిరీష్‌. టాలెంట్‌ని ఎంకరేజ్‌ చెయ్యడంలో శిరీష్‌ ముందుంటారు. ఎంతో అనుభవం వున్న నిర్మాతలతో ఈ సినిమా చేసున్నాననే భయం నాకు వుండేది. అంటే ఆ బేనర్స్‌కి చెడ్డపేరు తేకుండా మంచి సినిమా చెయ్యాలనే భయం మాత్రమే వుండేది. అయితే సినిమా ఫీల్డ్‌కి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. ఒక మంచి సినిమా తీశానన్న తృప్తి నాకు కలిగింది'' అన్నారు. సాయికార్తీక్‌ మాట్లాడుతూ ''చాలా సంతోషంగా వుంది. మూడు పెద్ద బేనర్లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్‌గారికి, బన్ని వాసుగారికి ధన్యవాదాలు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేసేటపుడు సినిమా చూశాను. చాలా బాగుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అన్నారు. రష్మీ మాట్లాడుతూ ''ఇలాంటి పెద్ద బేనర్స్‌ సినిమా చేయాలన్న నా కల నిజమైంది. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది'' అన్నారు.

వైభవి మాట్లాడుతూ ''తెలుగులో ఇది నా మొదటి సినిమా. పెద్ద నిర్మాతలు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా తెలుగులో పరిచయం కావడం చాలా సంతోషంగా వుంది. ప్రభాకర్‌గారు ఎంతో కోఆపరేటివ్‌గా వుంటారు. ఎంతో పేషన్స్‌తో తనకు కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టుకుంటారు'' అన్నారు.

సాయికుమార్‌ మాట్లాడుతూ ''అల్లు అరవింద్‌గారి ఫ్యామిలీ మాకు ఎక్స్‌టెండెడ్‌ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అన్ని సందర్భాల్లోనూ వారు మాతో వున్నారు. వారి బేనర్‌లో ఆది సినిమా చేస్తున్నాడనగానే చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. మా అబ్బాయిని మీ చేతుల్లో పెట్టి నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను అని చెప్పాను. ట్రైలర్‌ చాలా బాగుంది. తప్పకుండా ఈ బేనర్‌కి, ప్రభాకర్‌కి, మా ఆదికి చాలా మంచి సినిమా అవుతుందన్న నమ్మకం కలిగింది'' అన్నారు. హీరో ఆది మాట్లాడుతూ ''వి4 బేనర్‌లో నిర్మిస్తున్న ఫస్ట్‌ సినిమాలో నేను హీరోగా నటించడం చాలా ఆనందంగా వుంది. నాకు సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. బన్నీ వాసుగారు ప్రతిదీ పక్కా ప్లానింగ్‌తో చేస్తారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రభాకర్‌గారు ఓ మంచి సినిమాని రూపొందించారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుంది'' అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ''మేము ఈ కొత్త బేనర్‌ని స్టార్ట్‌ చెయ్యడానికి రీజన్‌ ఏమిటి అని అందరూ అడుగుతున్నారు. ఏ నిర్మాతైనా తను నమ్మిందే కరెక్ట్‌ అని సినిమాలు తీస్తూ వెళితే కొన్నాళ్ళకు సినిమాలు తియ్యకుండా ఆగిపోతారు. ఎప్పటికప్పుడు ట్రెండ్‌ మారుతూ వుంటుంది. దానికి తగ్గట్టుగా సినిమాలు తీస్తేనే కంటిన్యూ అవ్వగలుగుతాం. మా బేనర్‌తోపాటు మరో రెండు బేనర్స్‌తో కలిసి వి4 అనే కొత్త సంస్థని స్టార్ట్‌ చెయ్యడంలో నా స్వార్థం కూడా వుంది. ఎప్పుడూ యంగ్‌స్టర్స్‌తో కలిసి వుంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది అర్థమవుతుంది. తద్వారా అప్‌డేటెడ్‌గా వుంటూ ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలు తీసే వీలుంటుంది. అందుకే ఈ బేనర్‌ స్టార్ట్‌ చేశాము. అయితే వి4లో మూడు బేనర్‌లే వున్నాయి. నాలుగోది బేనర్‌ కాదు. ఫ్రెష్‌ థాట్స్‌, యునీక్‌ సబ్జెక్ట్స్‌ వచ్చేవారు నాలుగోవారు అవుతారు. అలాంటి వారికి మేం ఎప్పుడూ స్వాగతం పలుకుతాం. ఈ సినిమా విషయానికి వస్తే ప్రభాకర్‌ భయపడుతూ చేశానని చెప్పాడు. కానీ, చాలా ఫ్రీగానే చేశాడు. మంచి ఔట్‌పుట్‌ ఇచ్చాడు. తప్పకుండా ఇది మంచి సినిమా అవుతుంది'' అన్నారు.

అవసరాల శ్రీనివాస్‌, హిమజ, జయప్రకాష్‌రెడ్డి, పృథ్వీ, ఎల్‌.బి.శ్రీరామ్‌, పోసాని, రఘు కారుమంచి, బెనర్జీ, తాగుబోతు రమేష్‌, ముమైత్‌ఖాన్‌, షకీలా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: డి.కె., మాటలు: శ్రీకాంత్‌ విస్సా, నిరుపమ్‌ పరిటాల, సంగీతం: సాయికార్తీక్‌, పాటలు: కె.కె, సాగర్‌, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ పళని, ఎడిటింగ్‌: ఎస్‌.బి.ఉద్దవ్‌, ఆర్ట్‌: శ్రీకాంత్‌, సహనిర్మాత: ఎస్‌.కె.ఎన్‌., నిర్మాత: బన్ని వాస్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రభాకర్‌.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved