pizza
Okka Kshanam teaser launch
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

3 December 2017
Hyderaba
d

అల్లు శిరీష్‌, సుర‌భి, సీర‌త్ క‌పూర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా `ఒక్క క్ష‌ణం`. వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ల‌క్ష్మీ న‌ర‌సింహ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రూపొందుతోంది. చ‌క్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. ఆదివారం ప్ర‌సాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేట‌ర్‌లో ఈ సినిమా టీజ‌ర్‌ను ఆవిష్క‌రించారు.

శిరీష్ మాట్లాడుతూ ``ఉత్కంఠ‌గా సాగే క‌థ ఇది. ల‌వ్, రొమాన్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో సాగుతుంది. ఆనంద్ చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ల‌వ్‌, రొమాన్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌ని క‌ల‌ప‌డం అంద‌రికీ రాదు. కానీ ఆనంద్ ఆ ప‌నిని చాలా చ‌క్క‌గా నిర్వ‌ర్తించారు. ఆయ‌న క‌థ మీద ఎక్కువ ఆ త‌ర్వాతే సెట్స్ మీద‌కు తీసుకొచ్చారు. నేను ప్రేమించే అమ్మాయి ప్రాణాల మీద‌కొస్తే ఫేట్‌తోనైనా, డెస్టినీతోనైనా చివ‌రికి చావుతో అయినా పోరాడ‌తాను అని టీజ‌ర్‌లో చెప్పిన డైలాగ్‌తో క‌థేంటో తెలుస్తుంది. అది శాంపిల్ మాత్ర‌మే. సినిమాలో ఇంకా స‌స్పెన్స్ ఉంది. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం ప్ల‌స్ అవుతుంది. ద‌ర్శ‌కుడి మార్క్ చూపించే సినిమా ఇది`` అని తెలిపారు.

ద‌ర్శ‌కుడు ఆనంద్ మాట్లాడుతూ ``గ‌తేడాది న‌వంబ‌ర్‌లో హీరోకి, నిర్మాత‌కు ఈ క‌థ చెప్పా. న‌న్ను న‌మ్మి నాతో ట్రావెల్ చేశారు. జీవా అనే పాత్ర పండించ‌డానికి శిరీష్ త‌న‌కు మించిన ఎఫ‌ర్ట్ పెట్టాడు`` అని తెలిపారు.

అబ్బూరి ర‌వి మాట్లాడుతూ ``సినిమా చూస్తున్న‌ప్పుడు ఒక్క ఓణం మిస్ అయినా త‌ర్వాత ఏం జ‌రుగుతుందో అన్న ఉత్కంఠ ప్రేక్ష‌కుల్ని వెంటాడుతుంది`` అని అన్నారు.

శీర‌త్ క‌పూర్ మాట్లాడుతూ ``నాకు చాలా చిన్న రోల్ ఇది. కానీ చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా చేశాను`` అని అన్నారు.

నిర్మాత చ‌క్రి మాట్లాడుతూ ``అన్ని ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల చేస్తాం. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది. క‌థ‌కు అనుగుణంగా టైటిల్ పెట్టాం`` అని తెలిపారు.



 
Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved