pizza
Srivalli teaser launch
`శ్రీవ‌ల్లి` టీజ‌ర్ విడుద‌ల
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 December 2016
Hyderaba
d

రజత్, మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరో హీరోయిన్ లు గా, రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్ పై, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాతగా బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ వంటి చిత్రాలకు అద్భుతమైన కథను అందించి, రాజన్న చిత్రంతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన ప్రఖ్యాత రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `శ్రీవల్లి`. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ద‌ర్శ‌కుడు సుకుమార్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా....

సుకుమార్ మాట్లాడుతూ - ``ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో హీరోల‌కు, నిర్మాత‌ల‌కు క‌థ ఎలా చెప్పాలో నాకు తెలిసేది కాదు. మూడు నాలుగు గంట‌ల పాటు క‌థ చెప్పేవాడిని, అలాంటి స‌మ‌యంలో అదృష్ట‌వ‌శాతు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారిని క‌లిశాను. ఆయ‌న భ‌జ‌రంగీ భాయ్‌జాన్ సినిమా క‌థ‌ను నాకు 22 నిమిషాలు పాటు వివ‌రించారు. ఆయ‌న చెప్పిన క‌థ‌లో అన్నీ ఎలిమెంట్స్‌ను క‌వ‌ర్ చేసేశారు. అప్పుడు నాకు క‌థ‌ను ఎలా చెప్పాలో నాకు తెలిసింది. త‌ర్వాత నేను చేసిన సినిమాల క‌థ‌ను అర‌గంట‌లోనే చెప్పేశాను. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారు మైండ్‌లో థ్రిల్ల‌ర్‌, సైంటిఫిక్ స‌హా అనేక క‌థ‌లుంటాయి. కానీ ఈ వ‌య‌సులో కూడా ఆయ‌న డైరెక్ట్ చేయ‌డం చాలా గ్రేట్‌. `శ్రీవ‌ల్లి` క‌థ‌ను నాకు చెప్పారు. చాలా విచిత్ర‌మైన క‌థ‌. ఆడియెన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియెన్స్ వ‌స్తుంది. ఈ సినిమా నిర్మాత‌ల‌కు పెద్ద స‌క్సెస్‌ను తెచ్చిపెట్టాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``సాధార‌ణంగా అమ్మాయిలు ఓ వ‌య‌సు వ‌చ్చాక పెద్ద‌వాళ్ల‌య్యేట‌ప్పుడు ప్ర‌తి త‌ల్లికి విచిత్ర‌మైన ప‌రిస్థితి ఉంటుంది. ఇప్పుడు మా యూనిట్ ప‌రిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే శ్రీవ‌ల్లి సినిమాను మా అమ్మాయిగా భావించి చేశాం. హీరో ర‌జ‌త్‌, హీరోయిన్ నేహా హింగేల‌ను ఫోటోల‌ను చూసి సెల‌క్ట్ చేశాను. ఇద్ద‌రు వారి వారి పాత్ర‌ల‌ను అద్భుతంగా చేశారు. సినిమా కోసం హీరోయిన్ నేహా టాప్ లెస్‌గా న‌టించింది. ఈ జ‌న్మ‌లోని బంధాలు మ‌న‌కు పూర్వ‌జ‌న్మ కార‌ణంగానే క‌లుగుతాయి. ఈ పూర్వ‌జ‌న్మ‌ల‌పై ప్ర‌ధానంగా చేసుకుని రాసుకున్న క‌థ‌. అలాగే మ‌న‌సుని చ‌ద‌వ‌గ‌లిగితే వండ‌ర్స్ క్రియేట్ చేయొచ్చు అనే అంశాల‌తో చేసిన సినిమా ఇది. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.

Neha Hinge glam gallery from the event

హీరో ర‌జ‌త్ మాట్లాడుతూ - ``డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో స్క్రీన్‌ప్లే, జోన‌ర్‌లో తెర‌కెక్కిన చిత్ర‌మే శ్రీవ‌ల్లి. భావ త‌రంగాల‌ను ఆధారంగా చేసుకుని త‌యారు చేసిన క‌థ ఇది. క‌థ ప్ర‌కారం నేను ఎప్పుడూ క్రింద ప‌డే పోజిష‌న్‌లో ఉన్నా, నాకు స‌పోర్ట్ చేసే రోల్‌లో నేహా న‌టించింది. ప‌ది, ప‌దిహేనేళ్లకు ఒక‌సారి వ‌చ్చే క‌థ ఇది`` అన్నారు.

హీరోయిన్ నేహా హింగే మాట్లాడుతూ - ``ఈ సినిమా చేయ‌డానికి ముందు నెర్వ‌స్‌గా ఫీల‌య్యాను. కానీ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారి స‌పోర్ట్‌తో సినిమాను చ‌క్క‌గా పూర్తి చేశాను. నాకు అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ - ``ఎలాంటి సినిమా చేయాలి, ఎలా చేయాలి అని నిర్మాత‌లుగా ఆలోచిస్తున్న స‌మ‌యంలో విజయేంద్ర‌ప్ర‌సాద్‌ గారిని క‌లిశాము. ఆయ‌న ద‌గ్గ‌ర వంద క‌థ‌లున్నాయి. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారిని క‌థాబ‌లి అనొచ్చు. ఆయ‌న ద‌గ్గ‌రున్న క‌థ‌లో ఓ మంచి క‌థ‌ను మాకిచ్చారు. సినిమాను అద్బుతంగా తెర‌కెక్కించారు`` అన్నారు.

రాజీవ్‌కనకాల, అరహన్‌ఖాన్, సుఫీ సయ్యద్, హేమ, సత్యకృష్ణ, కెప్టెన్ చౌదరి, ఝాన్సీ, రేఖ, మాస్టర్ సాత్విక్, మాస్టర్ సమీర్, బేబి సమ్రీన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, నేపథ్య సంగీతం: శ్రీ చరణ్, పాటలు: శివశక్తి దత్త, అనంత్ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సునీత రాజ్‌కుమార్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: విజయేంద్రప్రసాద్.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved