pizza
Sye Raa Narasimha Reddy teaser launch
`సైరా... న‌ర‌సింహారెడ్డి` టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


21 August 2018
Hyderabad

కొణిదెల ప్రొడ‌క్షన్స్ ప‌తాకంపై రూపొందుతోన్న సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి`. చిరంజీవి క‌థానాయ‌కుడు. న‌య‌న‌తార‌, త‌మ‌న్నా నాయిక‌లు. అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌. సురేఖ కొణిదెల స‌మ‌ర్పిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం ఉద‌యం విడుదల చేశారు.

అంజ‌నాదేవి మాట్లాడుతూ ``అదిరిపోయింది. చాలా బావుంది`` అని అన్నారు.

సురేఖ మాట్లాడుతూ ``చాలా చాలా బావుంది. మాట‌లు స‌రిపోవు. చూడ్డానికి చాలా బావుంది. సురేంద‌ర్‌రెడ్డికి థాంక్స్. చాలా బాగా తీశారు. చాలా బావుంది`` అని అన్నారు.

సాయిమాధ‌వ్ బుర్రా మాట్లాడుతూ ``మెగాస్టార్ సినిమాకు మాట‌లు రాస్తాన‌ని నేనెప్పుడూ ఊహించ‌లేదు. ఖైదీ నెంబ‌ర్ 150కి న‌న్ను పిలిపిస్తే ఆ సినిమాలో ఒక్క డైలాగ్ నేను రాసింది చిరంజీవిగారు ప‌లికినా నా జ‌న్మ ధ‌న్యం అని నేను అనుకున్నా. అలాంటిది రెండు సినిమాలు రాశా. ఖైదీ నెంబ‌ర్ 150, సైరా. నా జీవితం త‌రించిపోయింది. రేపు ఒక అద్భుతాన్ని అంద‌రూ చూడ‌బోతున్నారు. అద్వితియాన్ని ఆస్వాదించ‌బోతున్నారు. ఇప్పుడు చూసిన టీజ‌ర్ ఇలా ఉంటే, సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. చిరంజీవిగారు సినిమా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడే సినిమా సూప‌ర్ హిట్‌. అందులో ఏ మార్పూ లేదు. చిరంజీవిగారి త‌ల్లిగారు, చ‌ర‌ణ్‌గారి త‌ల్లిగారు క‌లిసి ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇద్ద‌రు మాతృమూర్తుల ఆశీస్సుల‌తో ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. త‌ల్లి ఆశీస్సుల‌కు మించింది ఏదీ లేదు ఈ భూమ్మీద‌. ఇద్ద‌రు త‌ల్లుల ఆశీస్సుల‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఏ స్థాయి హిట్ అవుతుందో మీరు ఊహించుకోండి. ఇలాంటి సంచ‌ల‌న‌మైన సినిమాలో నేనూ ఓ భాగ‌మైనందుకు త‌ల‌వంచి న‌మ‌స్కారం చేస్తున్నా. ఈ సినిమాలో నాకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. ఇది టీమ్ వ‌ర్క్. అంద‌రూ న‌న్ను న‌డిపించారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ డైలాగుల‌ను చిన్న‌ప్ప‌టి నుంచి చూసి నేర్చుకుని ఇక్క‌డికి వ‌చ్చాను. సురేంద‌ర్ రెడ్డిగారు ఎంతో ప్రోత్స‌హించారు. ఈ సినిమాకు అవ‌కాశం ఇచ్చినందుకుగానూ చ‌ర‌ణ్‌గారికి, చిరంజీవిగారికి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను`` అని అన్నారు.

క‌మ‌ల్ క‌ణ్ణ‌న్ మాట్లాడుతూ ``ఈ సినిమా నా మ‌న‌సుకు ద‌గ్గ‌రగా ఉన్న సినిమా. గ‌త కొన్ని నెల‌లుగా దీనికి ప‌నిచేస్తున్నాను. రామ్‌చ‌ర‌ణ్‌గారికి, సురేంద‌ర్‌రెడ్డిగారికి ధ‌న్య‌వాదాలు. చాల మంచి సినిమా ఇది. ఫ్యాబుల‌స్ పిక్చ‌ర్. ఈ టీమ్ పెద్ద స‌క్సెస్‌ని సాధించాలి`` అని చెప్పారు.

ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ ``చిరంజీవిగారి జీవితం, మా జీవితం ఖైదీ అనే సినిమాతో బాగా ముడిప‌డి ఉంది.అప్పుడే మేం ఒక‌ళ్ల ఇంట ఒక‌ళ్లం. ఒక‌ళ్ల మ‌న‌స్సుల్లో ఒక‌ళ్లం ఖైదీలైపోయాం. ఇప్పుడు దొంగ మీద సినిమా చేస్తే... దొంగ‌, అడివి దొంగ‌, కొండ‌వీటి దొంగ‌.. ఏ దొంగ అయినా మేమే. అట్లా ఎన్నో జ‌రిగాయి. బుర్రా సాయిమాధ‌వ్ మా సినిమాలు చూశామ‌ని అన్నాడు. కానీ చాలా బాగా రాస్తున్నాడు. శ్రీక‌ర్ ప్ర‌సాద్ కి ఆల్ ఇండియా రేంజ్‌లో ఎన్నో అవార్డులు పొందాడు. ర‌త్న‌వేలు న‌న్న‌యినా అందంగా చూపించ‌గ‌ల వ్య‌క్తి. క‌మల్‌క‌ణ్ణ‌న్ చాలా మంచి టెక్నీషియ‌న్‌. మ‌మ్మ‌ల్ని అంద‌రినీ కృష్ణుడిలాగా, అర్జునుడిలాగా న‌డిపే వ్య‌క్తి మా ద‌ర్శ‌కుడు. చాలా న‌వ్వుతూ ఉంటాడు. కానీ ఏది కావాల‌న్నా.. చేయించుకుంటాడు. ముందు మాత్రం చెప్ప‌డు. ఈ సినిమాకు అత‌ను ప్రాణ ప్ర‌తిష్ట చేస్తున్నాడు. సురేంద‌ర్‌రెడ్డిని చ‌ర‌ణ్‌బాబు ఎందుకు ఎంపిక చేసుకున్నాడో సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ తెలుస్తుంది. ఇక నాకూ, చిరంజీవిగారికీ ఓ పోలిక ఉంది. మేమిద్ద‌రం సోమ‌వారంపుట్టాం. మామూలుగా ఈశ్వ‌రుడు సోలెడు వరాలైనా ఇస్తాడ‌ట కానీ, కొడుకును మాత్రం ఇవ్వ‌డ‌ట . ఎందుకు ఇవ్వ‌డా అని అడిగితే ఆ రోజు పుట్టిన కొడుకు ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తాడ‌ట‌. చిరంజీవిగారి మంచిత‌నం, ఆశీస్సులు న‌డిపిస్తున్నాయి. చిరంజీవిగారి కొడుకు చ‌ర‌ణ్ చాలా తెలివైన‌వాడు. ఎవ‌రి మ‌న‌సులో ఏం ఉందో ముందే చెప్పేస్తుంటాడు. ఈ సినిమా ఓ అద్భుతం. ఈ విష‌యాన్ని త‌క్కువ‌గానే చెప్ప‌మ‌ని అంటున్నారు చిరంజీవిగారు. ఎందుకంటే చూసి జ‌నాలు చెప్పాల‌ని చిరంజీవిగారు న‌మ్మ‌కం. సైరా న‌ర‌సింహారెడ్డి ప‌ది కాలాల పాటు ఉంటుంది. మాకూ, మా త‌మ్ముడికి ఇంత‌కంటే మంచి అదృష్టం లేదు. అది మా న‌మ్మ‌కం`` అని అన్నారు.

ప‌రుచూరి గోపాల‌కృష్ణ మాట్లాడుతూ ``ముంద‌స్తుగా చిరంజీవిగారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. ఆయ‌న పుట్టిన‌రోజుకు ఎన్నో కోట్ల మంది ఆనంద‌ప‌డ‌తారు. ఒక రోజు ముందు మేం టీజ‌ర్‌ని విడుద‌ల చేశాం. 2015లో అమెరికాలో హైవేలో నాకు యాక్సిడెంట్ జ‌రిగింది. ఆ డాక్ట‌ర్ బీపీ చూసి నువ్వు ఎలా మెయింటెయిన్ చేస్తున్నావు. 120/80 బీపీ అని అడిగారు. అంత యాక్సిడెంట్ జ‌రిగినా నేను మెయింటెయిన్ చేయ‌గ‌లిగాను కానీ, ఇప్పుడు 30 సెక‌న్ల‌టీజ‌ర్‌ని చూస్తే మెయింటెయిన్ చేయ‌లేక‌పోయాను. ఇప్పుడు నా బీపీ డ‌బుల్‌గా ఉంటుందేమో. 30 సెక‌న్ల‌కే ఇంత ఉంటే రేపు మూడు గంట‌ల సినిమాకు ఇంకెంత బీపీ రావాలి? నాకు అర్థం కావ‌ట్లేదు. చూస్తే చిరంజీవిగారి న‌ట‌న క‌ళ్ల‌ల్లోనే ఉంటుంది. గుర్రం మీద ఉన్న‌ప్పుడు ఆయ‌న క‌ళ్ల‌ల్లోకి చూస్తే వెయ్యి కూడా పెరుగుతుంది బీపీ. ఓ అద్భుత‌మైన న‌టుడికి అద్భుత‌మైన సాంకేతిక నిపుణులు తోడైతే మ‌హాభార‌త యుద్ధంలో ధ‌ర్మ‌రాజు యుద్ధం చేసిన‌ట్టే. ఇక్క‌డ మా ధ‌ర్మ‌రాజు రామ్‌చ‌ర‌ణే. ఎందుకంటే గెలిచి తీరతారు ఎవ‌రైనా. ఇంత మంది సైన్యాధిప‌తులు అండ‌గా ఉన్న‌ప్పుడు అర్జునుడు చిరంజీవిగారు. ఆయ‌నే యుద్ధం చేస్తున్నారు. అద్భుత‌మైన 356 సినిమాలు రాశాం. మాకు ఆనందాన్ని క‌లిగించిన సినిమాలు ప‌ది, ప‌దిహేను ఉన్నాయి. అయితే ఏ సినిమా రాసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నారు అని అడిగితే మాత్రం `సైరా` రాసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా అని చెప్తాం. ఇది మా జీవితంలో మ‌ర్చిపోలేని సినిమా. 2006లో చిరంజీవిగారితో ప్రారంభించిన ప్ర‌యాణం అది. 12 ఏళ్ల కి ఒక‌సారి మ‌న ద‌గ్గ‌ర పుష్క‌రాలు వ‌స్తాయి. అలా పుష్క‌రాలు వ‌స్తేగానీ చిరంజీవిగారు ఆసినిమాకోసం మేక‌ప్ వేయ‌లేదు. ఈ సినిమా కోసం 12 ఏళ్లు ప‌ట్టింది. ఎందుకు 12 ఏళ్లు ప‌ట్టిందో , ఇప్పుడు వ‌స్తుందో ప్ర‌పంచానికే తెలియాలి. ఏదైనా `సైరా న‌ర‌సింహారెడ్డి` చ‌రిత్ర సృష్టిస్తాడు. ఇది నిజం`` అని చెప్పారు.

ర‌త్న‌వేలు మాట్లాడుతూ ``ఈ సినిమా ప్రెస్టీజియ‌స్‌గా చేస్తున్నాం. చ‌ర‌ణ్ ప్యాష‌నేట్ ఫిల్మ్ ల‌వ‌ర్‌. నిర్మాత‌లు బ‌డ్జెట్ విష‌యంలో కంట్రోల్డ్ గా ఉంటారు. కానీ బిగినింగ్‌లో చ‌ర‌ణ్ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి `ఇది నా తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్. లైఫ్ టైమ్ ప్రాజెక్ట్` అని అన్నారు. ద‌ర్శ‌కుడుగారు, మిగిలిన సాంకేతికి నిపుణులంద‌రూ చాలా బాగా చేస్తున్నారు. అంద‌రూ ఎక్స్ ట్రార్డిన‌రీగా చేస్తున్నారు. ఇది టీజ‌రే. ట్రైల‌ర్‌లో మాట్లాడుతాను`` అని చెప్పారు.

లీ విట్టేక‌ర్ మాట్లాడుతూ ``నేను ఈ సినిమాలో ఉండ‌టం ఆనందంగా ఉంది. స్వాతంత్ర్యం వైపు ఓ వ్య‌క్తి వేసిన అడుగులు ఓ జాతిని ఉత్తేజ‌ప‌రిచాయ‌నే ఈ క‌థ‌ను నాకు చెప్పిన‌ప్పుడు, న‌న్ను ఇందులో భాగ‌మ‌వ్వ‌మ‌ని అడిగిన‌ప్పుడు... అది న‌న్ను క‌దిలించింది. ఈ సినిమాలో ప‌నిచేయ‌డం గౌర‌వంగా భావించాను. ఎంతో మంది సోద‌ర‌,సోద‌రీ మ‌ణులు ప‌నిచేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో నేనూ భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది`` అని అన్నారు.

సుష్మిత మాట్లాడుతూ ``చాలా ఉత్కంఠ‌గా ఉంది. టీజ‌ర్ చూసి భావోద్వేగానికి గుర‌య్యాం. చ‌ర‌ణ్‌కి, మా నాన్న‌కి, ద‌ర్శ‌కుడికి చాలా థాంక్స్. చాలా మంచి టీమ్ ప‌నిచేస్తున్నారు. కాస్ట్యూమ్ డిపార్ట్ మెంట్లోనూ చాలా మంది ప‌నిచేస్తున్నారు`` అని తెలిపారు.

సురేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ ``ఈ సినిమా గురించి తొలిసారి ప్రెస్ ముందుకు వ‌చ్చి మాట్లాడుతున్నాం. చాలా చెప్పాల‌ని ఉంది కానీ చెప్ప‌లేను. అయితే ఒక‌టి మాత్రం చెప్ప‌గ‌ల‌ను. సైరా న‌ర‌సింహారెడ్డి... ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి మ‌న నేల మీద తొలిస్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు. తెలుగు నేల మీద ఆయ‌నే తొలి వ్య‌క్తి. ఈ సినిమాను మొద‌లుపెట్టేట‌ప్ప‌టికీ నాక్కూడా తెలియ‌దు. టేకాఫ్ చేశాక ఏడాది పాటు రీసెర్చి చేశాం. గెజ‌ట్ నోట్స్ నుంచి క‌లెక్ట్ చేశాం. ఆ టైమ్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఇప్ప‌టికి కూడా గెజెట్ నోట్స్ లో ఉన్నాయి. ఉయ్యాల‌వాడ‌కు సంబంధించిన స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడాం. అక్క‌డ ఓ స‌మితి ఉంది. అక్క‌డ కూడా సంప్ర‌దించాం. ఆయ‌న అన్‌సంగ్ హీరో. దాన్ని రేపు అంద‌రూ తెర‌మీద చూడ‌బోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవిగారు చేయ‌డం నా అదృష్టం. ఆయ‌న ఎంత యాప్టో సినిమా చేస్తున్న‌ప్పుడు అర్థ‌మ‌వుతోంది. నేను చాలా గ‌ర్వంగా భావిస్తున్నాను. చిరంజీవిగారు ఫైట్స్ నుంచి ప్ర‌తి విష‌యంలోనూ చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. ఆయ‌నే డూప్ లేకుండా ట్రై చేస్తున్నారు. వ‌ర్క్ చేస్తున్నారు. ఈ సినిమా మొద‌ల‌య్యాక నేనిప్ప‌టి వ‌ర‌కు నేర్చుకున్న‌ది న‌థింగ్‌. ఆయ‌న్ని చూశాక ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది అని అర్థమైంది. అందుకే అదే భ‌క్తితో ప‌నిచేస్తున్నా. ఈ సినిమాకు నాకు మెయిన్‌పిల్ల‌ర్ చ‌ర‌ణ్‌గారు. ఎందుకంటే ఈ సినిమాకు నాకు ఏం కావాల‌ని అనుకున్న‌నో, దానికి ఎక్కువ‌గా ప్యాష‌న్‌తో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సినిమాకు మేజ‌ర్ ఎసెర్ట్ ర‌త్న‌వేలుగారు, రాజీవ‌న్‌. నేనే సినిమా చేసి ఎడిటింగ్ రూమ్‌లో చూసుకున్న‌ప్పుడు కొత్త ఫీలింగ్ ఉంది. ఈ సినిమాకు ప‌రుచూరి బ్ర‌దర్స్, సాయిగారు.. అంద‌రూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నారు. ఇది టీమ్ వ‌ర్క్. అద్భుతంగా జరుగుతోంది. కాస్ట్యూమ్స్ సుష్మిత‌గారు, ఉత్త‌ర‌గారు చేస్తున్నారు. లీవీటెక్క‌ర్‌, క‌మ‌ల్‌క‌ణ్ణ‌న్‌గారూ.. అంద‌రూ ప‌నిచేస్తున్నారు. నేను ఇంత‌కు ముందు చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. ఈ సినిమా అంద‌రికీ ఎక్స్ పెక్టేష‌న్స్ కి మించి ఉంటుంది. ఎంతైనా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఇంకొక్క విష‌యం అమిత్ త్రివేది గురించి చెప్పాలి. ఆయ‌న మ్యూజిక‌ల్ జీనియ‌స్‌. ఆయ‌న్ని నిజంగా నాకు ప్రొవైడ్ చేయ‌డం అనేది చ‌ర‌ణ్‌గారు ఇచ్చిన గిఫ్ట్. ఈ సినిమాకు అమిత్‌గారు పెద్ద ఎసెట్‌. `` అని అన్నారు.

రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ ``నాన్న‌గారి బ‌ర్త్ డే కి టీజ‌ర్‌ని విడుద‌ల చేద్దామ‌ని మేం డిసైడ్ చేశాం. నెక్స్ట్ స‌మ్మ‌ర్‌కి సినిమాను విడుద‌ల చేస్తాం. అంత‌కు ముందు టీజ‌ర్‌ని విడుద‌ల చేద్దామ‌నుకున్నాం. అందుకు కార‌ణం మేమంద‌రం ఎంత ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాం.. అస‌లు న‌ర‌సింహారెడ్డి ఏంటి? ఎవ‌రు? ఎలా ఉండ‌బోతున్నాడు? వంటివ‌న్నీ చాలా మందికి తెలుసుకోవాల‌ని ఉంటుంది. అందువ‌ల్ల నాన్న‌గారి బ‌ర్త్ డే ని చూస్ చేసుకుని దీన్ని విడుద‌ల చేశాం. చాలా పాజిటివ్ రెస్పాన్స్ మా టీమ్‌కి వ‌చ్చింది. బ‌హుశా 12 ఏళ్ల క్రితం ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఈ క‌థ చెప్పారు. అప్ప‌టి నుంచి ప్ర‌తి ఏడాదీ మా ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు `నాన్న‌గారితో సైరా గురించి చెప్పు` అనేవారు. వాళ్లు క‌లిసి ఎన్నో సినిమాలు చేశారు. అయినా నేను చెప్ప‌డ‌మేంటండీ అని అనేవాడిని. క‌థ బిల్డ‌ప్ కార‌ణంగానో, టెక్నిక‌ల్ ల్యాక్ కార‌ణంగానో ఎందుకు డిలే అయిందో తెలియ‌దు. ఇప్ప‌టికి ఓకే అయింది. ఇప్ప‌టికైనా ఓకే అయిందంటే దానికి ముఖ్య కార‌ణం ప‌రుచూరి సోద‌రులు. వారి గ‌ట్ట న‌మ్మ‌కం, సంక‌ల్ప‌మే ఈ సినిమాను ఇవాళ కార్య‌రూపం చేయించింది. 12 ఏళ్లుగా వాళ్లు సాధ‌న‌, మెడిటేష‌న్ చేస్తే వ‌చ్చింది. ఒక వ్య‌క్తి ఒక విష‌యం మీద అలాగే కూర్చుంటే ఏదైనా సాధ్యం అని చెప్ప‌డానికి ఇది ఒక నిద‌ర్శ‌నం. సూరిగారితో ధ్రువ నుంచి ట్రావెల్ అవుతున్నాం. చాలా ఎంజాయ్ చేశాం. సూరిగారి కూడా వేరే వేరే క‌థ‌లు వెతుకుతూ ఉన్న‌ప్పుడు నేను ప‌రుచూరి సోద‌రుల‌ను ఒక‌సారి క‌ల‌వండి సార్‌. ఇలా ఉంది అని అన్నాను. క‌థ విన్నారు. `నాన్న‌గారితో మీరు చేస్తే బావుంటుంది` అని అన్నా. మామూలుగా ఏ డైర‌క్ట‌ర్ అయినా వెంట‌నే గెంతేసేవారు. కానీ సురేంద‌ర్‌రెడ్డిగారు కాస్త టైమ్ తీసుకుని, నాన్న‌గారితో సినిమా అంటే ఎంత బాధ్య‌త ఉంటుందో ఊహించుకుని ఈ సినిమాకు అంగీకారం తెలిపారు. ధ్రువ రిలీజ్ అప్పుడు మేం యు.ఎస్‌లో ఉన్నాం. అప్పుడు ఈ విష‌యాన్ని చెప్పాను. ఆయ‌న అప్పుడు ఏమీ చెప్ప‌లేదు. కానీ ఇండియాకు వ‌చ్చిన వారం త‌ర్వాత ఓకే అని చెప్పారు. అప్పుడు ఆయ‌న క‌థ విని, ఆయ‌న శైలికి అర్థం చేసుకుని నాన్న‌గారిని క‌లిశారు. 12ఏళ్లుగా నానుస్తున్న విష‌యాన్ని నాన్న‌గారు ఒక్క సిట్టింగ్‌తో ఓకే చేసేశారు. ర‌త్న‌వేలుగారు ఖైదీ నెంబర్ 150, రంగ‌స్థ‌లం, ఇప్పుడు సైరా.. ఆయ‌న‌కు హిట్లు కొత్త కాదు. ఆయ‌న విజువ‌ల్స్ మామూలుగా ఉండ‌వు. లీగారు బాహుబ‌లి 2 లోనూ ప‌నిచేశారు. ఆయ‌న ఈ ప్రాజెక్ట్ లో ఉండ‌టం చాలా ఆనందంగా ఉంది. క‌మ‌ల్ క‌ణ్ణ‌న్‌గారు మ‌గ‌ధీర‌కు విజువ‌ల్ ఎఫెక్ట్స్ చేశారు. అప్ప‌టి నుంచి నాకు తెలుసు. సాయిగారు ఇంత‌కు ముందు కూడా మాతో ప‌నిచేశారు. అమిత్ త్రివేదిగారి మ్యూజిక్ కి నేను పెద్ద ఫ్యాన్‌. ఇండియ‌లో నెక్స్ట్ బిగ్గెస్ట్ మ్యూజిషియ‌న్ అని అంటున్నారు. ఇన్నేళ్ల‌లో నాన్న‌గారు ఒక ట్యూన్‌ని విన‌గానే ఓకే చేయ‌డం అనేది ఎప్పుడూ లేదు. అదే అమిత్‌గారు క్లైమాక్స్ సాంగ్ ఇందాకే పంపారు. నాన్న‌గారు విన‌గానే ఓకే చేసేశారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఓ హిందీ వ్య‌క్తి మ‌న తెలుగుద‌నాన్ని అర్థం చేసుకుని మాకు ఎంత‌గానో స‌హ‌క‌రిస్తున్నారు. చిన్న టీజ‌ర్‌లోనే అద్భుత‌మైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు`` అని అన్నారు.

అమితాబ్‌గారు, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, త‌మ‌న్నా, జ‌గ‌ప‌తిబాబుగారికి ధ‌న్య‌వాదాలు.

అనంత‌రం మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు..

* సురేంద‌ర్ రెడ్డిగారు స్టైలిష్ ఫిల్మ్స్ కి పెట్టింది పేరు. ఆయ‌న‌తో ఈ ఎపిక్ సినిమాను చేయ‌డానికి కార‌ణాలేంటి?
రామ్‌చ‌ర‌ణ్‌: ఒక డైర‌క్ట‌ర్‌, ఓ యాక్ట‌ర్ అనే వాళ్లు ఏ క‌థ‌యినా చేయ‌గ‌ల‌రు. న‌టుడిగా మేం ఏదైనా చేయ‌గ‌ల‌గాలి. డైర‌క్ట‌ర్ ఏదైనా చేయ‌గ‌ల‌గాలి. నా కాన్ఫిడెన్స క‌న్నా.. ఆయ‌న మాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయ‌న వ‌ల్లే ముందుకు వెళ్లాం.

* ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు?
రామ్‌చ‌ర‌ణ్‌: వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో. స‌మ్మ‌ర్‌లో ఫ‌స్టాఫా.. సెకండాఫా.. అనేది మేం చెప్తాం.

* ఒక‌టీ, రెండు ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నారుగా.. బ‌డ్జెట్ ఎంత‌నుకున్నారు?
రామ్‌చ‌ర‌ణ్‌: నెంబ‌ర్స్ అనేవి ఇప్పుడు రివీల్ చేయ‌డం లేదు. కానీ భారీగానే తీస్తున్నాం. డాడీ డ్రీమ్‌ప్రాజెక్ట్ కాబ‌ట్టి వెనకా ముందూ చూడ‌కుండా, దేనికీ వెన‌కాడ‌కుండా తీస్తున్నాం. ఎక్కువ‌గానే పెట్టి చేస్తున్నాం. నాకైతే ప్రాఫిట్స్ వ‌స్తే బోన‌స్. రాక‌పోయినా ఆనంద‌మే. నాన్న‌గారు నాతో ఒక‌టే అన్నారు.. ``నాకు ఏదైనా ఈర్ష్యో, జెల‌సీ ఉందంటే నీమీద‌.. నువ్వు రెండో సినిమాకే సోషియో ఫాంట‌సీ డ్రామా చేసేశావ్‌. నేను 35ఏళ్లు.. 150 మూవీస్ చేశాను. నాకు ఇప్ప‌టిదాకా ఒక్క కాస్ట్యూమ్ డ్రామా రాలేదు అని అన్నారు. దానికి స‌మాధాన‌మే ఈ సినిమా. కాబ‌ట్టి ఖ‌ర్చును, మ‌రోదాన్ని దృష్టిలో పెట్టుకోకుండా చేస్తున్నాం.

* ఈ సినిమాను ఎన్ని భాష‌ల్లో ప్లాన్ చేస్తున్నారు?
రామ్‌చ‌ర‌ణ్‌: ప్ర‌స్తుతం ఆల్ సౌత్ ఇండియ‌న్ లాంగ్వేజెస్‌లో స్ట్రెయిట్ రిలీజ్ చేస్తున్నాం.

* ఎలాంటి మెమ‌రీగా ఉండ‌బోతోంది?
రామ్‌చ‌ర‌ణ్‌: ప్రౌడ్ ఫీలింగ్. ప్రెస్టీజియ‌స్ ఫీలింగ్ ఉంది. ఒక ప్రౌడ్ ఫీలింగ్ ని ఇచ్చేలా ఉండ‌బోతోంది.

* చిరంజీవిగారు లేని లోటు తెలుస్తోంది.ఆయ‌న ఎందుకు రాలేదు?
రామ్‌ఛ‌ర‌ణ్‌: నా బ‌ర్త్ డే టీజ‌ర్ చూడండి అని ఆయ‌నే వ‌చ్చి కూర్చోవ‌డం బావుండ‌దు క‌దండీ. ఓ టీమ్‌గా మేం ఇదంతా చేసి, ఆయ‌న‌కు చూపిస్తేనే బావుంటుంద‌ని చేశౄం.

* అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమాల్లో నాగార్జున‌గారిలాంటివారు రోల్స్ చేస్తారు.. ఓ మెగాస్టార్ సినిమాలో మ‌రో మెగాస్టార్ న‌టింప‌జేస్తున్నారు. అమితాబ్ గారు ఈసినిమా చేయ‌డానికి ఒప్పుకోవ‌డానికి గ‌ల రీజ‌న్స్ ఏంటి? ఇద్ద‌రు మెగాస్టార్స్ ని మీరెలా హ్యాండిల్ చేయ‌గ‌లిగారు?
సురేందర్ రెడ్డి: ఫ‌స్ట్.. నిజంగా అమితాబ్‌గారిని డైర‌క్ట్ చేయ‌డం నా ల‌క్‌. చిరంజీవిగారిని డైర‌క్ట్ చేయ‌డం అనేది నేను క‌ల్లో కూడా ఊహించ‌లేదు. నేను థియేట‌ర్లో బ‌ట్ట‌లు చింపుకుని వ‌చ్చి చిరంజీవిగారి సినిమాకు టిక్కెట్లు కొని చూసేవాడిని. అలాంటి స్థానం నుంచి వ‌చ్చి నేను ఆయ‌న్ని డైర‌క్ట్ చేస్తాన‌ని ఎప్పుడూ అనుకోనుకూడా లేదు. నా అదృష్ట‌మ‌ది. అదే స‌మ‌యంలో చిరంజీవిగారితో పాటు అమితాబ్‌గారిని, సుదీప్‌గారినీ... వీళ్లంద‌రినీ చేయ‌డం అనేది గొప్పే. ముందు నాకు ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించేది. కానీ షూటింగ్ స‌మ‌యంలో చాలా బాగా అనిపించింది. అమితాబ్‌గారు ముందు మెగాస్టార్‌కార‌ణం కోసం ఓకే అన్నారు. స్క్రిప్ట్ విన్న త‌ర్వాత డ‌బుల్ ఓకే అన్నారు. ఇలాంటి అన్ సంగ్ హీరోలు ఇండియాలో చాలా మంది ఉన్నారు. తొలిసారి ఇలాంటి స్క్రిప్ట్ మీరు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నేను చేస్తున్నాను అని భ‌రోసా ఇచ్చి చేశారు.

* స్టంట్ కంపోజ‌ర్ అమెరిక‌న్ క‌దా.. మా హీరో సైరా బ్రిటిష్ పీపుల్‌ని చంపుతుంటే మీ రియాక్ష‌న్ ఎలా ఉంది?
లీ: ఇది చాలా మంచి ప్ర‌శ్న‌. స‌ప్రెష‌న్ అనేది స‌ప్రెష‌నే. మ‌న స్వాతంత్రం గురించి అడిగిన‌ప్పుడు ఓకే.

* ఈయ‌న‌క‌న్నా ముందు మంగ‌ళ్‌పాండేలాంటివారు కూడా పోరాడారు..
సురేంద‌ర్ రెడ్డి: ఝాన్సీ, మంగ‌ళ్‌పాండే క‌న్నా ప‌దే ళ్ల ముందే న‌ర‌సింహారెడ్డి పోరాడాడు.

* ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి
లీ: ఇది స్వాతంత్రానికి సంబంధించిన క‌థే. బ్రిటిష్ వాళ్ల‌కు హిస్ట‌రీలో జ‌రిగిందిందేంటో మ‌న‌కు తెలుసు. ఓ ప్రాంతంలో, చిన్న గ్రామంలో ఉన్న న‌ర‌సింహారెడ్డి త‌న వాళ్ల కోసం త‌న నేల కోసం చేసిన పోరాటం నాకు న‌చ్చింది.

ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు: అమెరిక‌న్ల‌ను కూడా బ్రిటిష్ వాళ్లు ప‌రిపాలించారు. కాబ‌ట్టి వాళ్ల‌కు కూడా ఆ క‌డుపుమంట ఉంటుంది. అందువ‌ల్ల తెలుపు చ‌ర్మం గురించి కాదు ఇక్క‌డ‌..

* థియేట‌ర్లో ట్రైల‌ర్ ఎప్ప‌టి నుంచి ప్లే చేస్తారు?
రామ్‌చ‌ర‌ణ్‌: ట‌్రైల‌ర్‌ని విడుద‌ల చేయాల‌నే అనుకున్నా. కానీ ఇందులో యానిమ‌ల్స్ ఉన్నాయి. యానిమ‌ల్ బోర్డుకి ప‌ర్మిష‌న్‌కి లెట‌ర్ పెట్ట‌డంలో డిలే అయింది. 20 రోజులు ముందే పెట్టాల‌న్న విష‌యం తెలియ‌లేదు. అందువ‌ల్ల ఆ డిలే వ‌ల్ల వేయ‌లేక‌పోతున్నాం. సెన్సార్‌కి కూడా పంపిస్తున్నాం. ఇంకో రెండు వారాల్లో థియేట‌ర్ల‌లో ఏ సినిమాలు ఆడుతున్నా స‌రే.. వాటితో పాటు ప్ర‌ద‌ర్శిస్తాం.

* సైరా టీజ‌ర్‌లో చివ‌ర‌గా చూస్తే కొద‌మ‌సింహంలో ఆయ‌న ఉన్న ప‌వ‌ర్‌క‌నిపించింద‌. మీకు ఆ థాట్ ఎలా వ‌చ్చింది?
రామ్‌చ‌ర‌ణ్‌: అది లీ అండ్ డైర‌క్ట‌ర్‌గారు డిజైన్ చేశారు. నాక్కూడా ఫేవ‌రే్ట్ సినిమా కొద‌మ‌సింహం. ఆ సినిమా చూసే నేను కొద‌మ‌సింహం నేర్చుకున్నా.

* సైరా న‌ర‌సింహారెడ్డిగారి చ‌రిత్ర‌ను య‌థాత‌థంగా తీస్తున్నారా? లేకుంటే సినిమాటిక్ డ్రామా చేస్తున్నారా?
సురేంద‌ర్ రెడ్డి: ఈ సినిమా చేసేవ‌ర‌కు నాక్కూడా పెద్ద‌గా తెలియ‌దు. కానీ రీసెర్చ్ చేశాక చాలా తెలిసింది. ఆ చారిత్రాత్మ‌క‌మైన ఆధారాలు తీసుకుని ఆ స్క్రీన్‌ప్లేలో ఇచ్చేసి తీసుకెళ్లాం. మ్యాగ్జిమ‌మ్ ఓ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్ సినిమాను ఎలా చూడాలో.. ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాం. అస‌లు స్వాతంత్రం గొడ‌వ‌లు ఎక్క‌డా చెల‌రేగ‌క‌ముందే ప‌దేళ్ల ముందే ఆయ‌న ప‌ది వేల మందితో పోరాటం చేశాడు. గెజిట్స్ లో, డెత్ సెంటెన్స్ లో ఇవ‌న్నీ ఉన్నాయి. స్వాంతత్ర కాంక్ష‌ను రేపింది తెలుగువాడు అయినందుకు చాలా గ‌ర్వంగా ఉంది.
వాటిని తీసుకుని స్క్రీన్ ప్లే చేసి చేశాం.

* ఒక క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనింగ్ వేరు. ఇలాంటి సినిమాకు ఎలా రీసెర్చ్ చేశారు?
సుష్మిత‌: స్టోరీ చెప్ప‌గానే 6-8 నెల‌లురీసెర్చ్,.. ఆ త‌ర్వాత 8నెల‌లు మేకింగ్కి చేశాం. ఇప్పుడు వాడే కెమిక్స్, క‌ల‌ర్స్ వంటివి అప్పుడు లేవు. అప్పుడు వేరుగా ఉండేవి. ఆథంటిసిటీ కోసం కృషి చేశాం. నేరుగా వీవ‌ర్స్ నుంచి తీసుకున్నాం. ప్యాష‌న్‌తో చేశాం.

* దీని త‌ర్వాత రాజమౌళిగారి సినిమా వ‌స్తోంది. ఆ సినిమా గురించి చెప్పండి?
రామ్‌చ‌ర‌ణ్‌: ఇండ‌స్ట్రీ మంచి కోస‌మైనా మా సినిమాను కొట్టాలి. దీని కోస‌మే కాదు.. ఇండ‌స్ట్రీ మంచి కోస‌మైనా కొట్టాలి. రాజ‌మౌళిగారి సినిమా కోస‌మే కాదు.. స‌మ్మ‌ర్‌లో వ‌చ్చే మిగిలిన సినిమాలు కూడా కొట్టాలి అని మ‌న‌స్ఫూర్తిగా, స్వ‌చ్ఛంగా కోరుకుంటున్నా.

ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌: స‌్ప‌ర్థ‌యా వ‌ర్ధ‌తే విద్య అని అంటారు. అలా నువ్వు కొట్టావు క‌దా... నేను కొడ‌తాను.. అని చెప్పి మ‌రీ కొట్టాలి.

Photo Gallery (photos by G Narasaiah)
 

 

 

 

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved