పి.హెచ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న హార్రర్, ఫన్, లవ్ కాన్సెప్ట్ మూవీ సినిమా `టిక్ టాక్`. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. హోప్ చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకుని, చంద్రహాస్ చిత్రానికి స్వర్ణ నందిని పొంది, సతీష్, దేవాకట్టా వంటి దర్శకుల్ని, వెన్నెలకిషోర్, పార్వతీమెల్టన్ వంటి నటీనటులను పరిచయం చేసిన సరోజిని దేవి ఇంట్రిగేషన్ అవార్డ్ గ్రహీత పోలిచర్ల హరనాథ్ నిర్మిస్తూ నటిస్తున్న ఈ చిత్ర డిజిటల్ టీజర్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా..
సి.వి.సుబ్బారావు మాట్లాడుతూ - ``హరనాథ్‌గారు మంచి డాక్టరుగా నాకెప్పటి నుండో మంచి పరిచయస్థులు. ఆయన తర్వాత బిజినెస్ మేన్‌గా మారి సక్సెస్ సాధించారు. తర్వాత ఆయన నటుడుగా కూడా మారారు. ఆయనకు తెలుగు భాషంటే చాలా ఇష్టం. ఆమెరికాలో ఇరవై ఏళ్ళుగా ఉన్నప్పటికీ తెలుగుపైన మంచి కమాండ్ ఉన్న వ్యక్తి. తెలుగు సంస్కృతిపై ఉన్న ఆసక్తితోనే ఆయన నటుడుగా మారారు. చంద్రహాస్‌తో నంది అవార్డు పొందిన ఆయన, హోప్ సినిమాతో నేషనల్ అవార్డును కూడా సాధించారు. ఆయన తపనే డాక్టరుగా, బిజినెస్‌మేన్‌గా, యాక్టర్‌గా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చేసిన టిక్ టాక్ చిత్రం కామెడి, హార్రర్ జోనర్‌లో సినిమా చేశారు. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - ``హరనాథ్ పోలిచర్లగారు మంచి సినిమాలు చేయాలని తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. చాలా ప్యాషన్‌తో తెలుగు సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం సినిమా తీయడం ద్వారా రెండు వందల కుటుంబాలకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి వారిని మనమంతా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. హార్రర్, కామెడి జోనర్‌లో చేసిన ఈ టిక్ టాక్ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి`` అన్నారు.
హీరో, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాథ్ మాట్లాడుతూ - ``టైం అనుసరించి మనం కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాం. హార్రర్, కామెడి జోనర్‌లో అన్నీ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా సినిమా ఉంటుంది. అందరి సహకారంతోనే సినిమాలు చేస్తున్నాను. అందరికీ థాంక్స్`` అన్నారు.
నిషిగంద, మౌనిక మాట్లాడుతూ - ``సినిమాలో అవకాశం ఇచ్చిన పోలిచర్ల హరినాథ్‌గారికి థాంక్స్`` అన్నారు.
పోలిచర్ల హరనాథ్, నిషిగంద, మౌనిక, రాహుల్, సందీప్ ఆనంద్, సాయికృష్ణ, అల్లూ రమేష్, రమణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః పి.వంశీకృష్ణ, సంగీతంః ఎస్ అండ్ బి మ్యూజిక్ మిల్, ఎడిటర్ః వెంకట రమణ, ఆర్ట్ః ఇ.గోవింద్, మూలకథః లిఖిత్ శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, డైరెక్షన్ః పొలిచర్ల హరినాథ్.