pizza
Needi Naadi Oke Katha thanks meet
'నీది నాది ఒకే కథ` థాంక్స్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 March 2018
Hyderabad

శ్రీ విష్ణు హీరో గా నటించిన 'నీది నాది ఒకే కథ' చిత్రం మార్చ్‌ 23 న విడుదలైంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన 'బిచ్చగాడు' ఫేమ్‌ సాట్నా టైటస్‌ జతగా న‌టించింది. ప్రశాంతి, కృష్ణ విజయ్‌ మరియు అట్లూరి నారాయణ రావు అరాన్‌ మీడియా వర్క్స్‌ మరియు శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌ బ్యానర్‌ లపై సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్బంగా ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన థాంక్స్ మీట్‌లో ...

డైరెక్ట‌ర్స్ దన్, జి. నాగేశ్వర్ రెడ్డి, లక్ష్మి భూపాల్, వి ఎన్. ఆదిత్య, తమ్మారెడ్డి భరద్వాజ్, బెక్కం వేణుగోపాల్, రాజ్ కందుకూరి, పవన్ సాధినేని, విరించి వర్మ, సాగర్ చంద్ర, తిరుమల తదితరులు పాల్గొని చిత్ర టీమ్‌ను అభినందించారు..

చిత్ర సమర్పకుడు అట్లూరి నారాయ‌ణ‌ రావు మాట్లాడుతూ ``చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా నన్ను నమ్మి నాకు ఈ సినిమా నిర్మాణంలో న‌న్ను భాగం చేసినందుకు నారా రోహిత్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.. అంతకు ముందు నాకు దర్శకుడు వెంకీ ఎవరో నాకు తెలియదు కానీ సినిమా చూశాక నేను అతనికి పెద్ద ఫ్యాన్ అయిపోయా, సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షుకులందరికీ నా కృతజ్ఞతలు`` అని అన్నారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ``ఈ సినిమాకు ముందు వేరే టైటిల్ అనుకున్నాం.. కానీ ఏ ముహూర్తాన `నీది నాది ఒకే కథ` అని పెట్టామో ఇక అప్పటినుంచి అందరూ కనెక్ట్ అయిపోయి అపీప్రిసియేట్ చేస్తున్నారు.. ఈ సినిమా ను చూసి ఇన్‌స్పైర్ అయ్యే వారు ఉన్నారంటే ఇంతకంటే సంతోషం ఎక్కడా దొరకదు`` అన్నారు.

దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ ``నారా రోహిత్ గారికి, నిర్మాతలకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమాను చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాను`` అని తెలిపారు.

నారా రోహిత్ మాట్లాడుతూ ``క్రిటిక్స్‌కు ఆడియెన్స్‌కు నా స్పెషల్ థాంక్స్ తెలియచేస్తున్నను. సినిమా చాలా బాగుంది కానీ కమెర్షియల్ గా డబ్బు తెచ్చిపెడుతుందా? అని చాలా మంది అన్నారు.. కానీ డబ్బు పోతే పోయింది ఒక మంచి సినిమాను అందించానని తృప్తి జీవితాంతం నాకు ఉంటుంది.. ఈ చిత్రం విడుదలైన రోజు కంటే నేటికీ థియేటర్స్ పెరుగుతున్నాయి.. ఈ సినిమా టాక్ ఎక్కడి వరకు పోతుందో తెలియదు కానీ బెస్ట్ గా మాత్రం నిలిచి పోతుందని నమ్ముతున్నాను`` అన్నారు.

దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ``మంచి కథను సినిమాగా తెరకెక్కించిన ఆరాన్ మీడియా మరియు శ్రీ వైష్ణవి వారికి, దర్శకుడు వేణుకు ముందుగా కృతజ్ఞతలు తెలపాలి. ఇంత డిఫరెంట్ సినిమాను ఆదిరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి.. మొదట్లో అనుకున్న ఇంత డిఫరెంట్ స్టోరీ తో సినిమా చేస్తారా అని ఆలోచనలో ఉండగానే నన్ను నటించమని అడిగే సరికి ఇంకా షాక్ కు గురయ్యా.. ఒక్కటి మాత్రం చెప్పగలను ఒక వేళ ఈ సినిమాలో నేను నటించక ఉండక పోతే ఒక గొప్ప గౌరవాన్ని కోల్పోయేవాడినని ఖచ్చితంగా చెప్పగలను. నాకు వచ్చిన ప్రతి అపీప్రిసియేషన్ దర్శకుడికే దక్కుతుంది`` అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, డిఒపి రాజ్ తోట, పార్వీ జ్ కె, నిర్మాత ప్రశాంతి తదితరులు పాల్గొని అభినందనలు, కృతజ్ఞతలను తెలియచేశారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved