pizza
Raju Gari Gadhi 2 trailer launch
`రాజుగారి గ‌ది2` ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 September 2017
Hyderaba
dఅక్కినేని నాగార్జున‌, స‌మంత‌, శీర‌త్‌క‌పూర్ ప్ర‌ధాన తారాగ‌ణంగా పివిపి సినిమా, మాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రై.లి. బేన‌ర్స్‌పై ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `రాజుగారి గ‌ది2`. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా....

నాగార్జున అక్కినేని మాట్లాడుతూ - ``నాన్న‌గారు మ‌న మ‌ధ్య లేరు అనడం త‌ప్పు తెలుగు ప్రేక్ష‌కులు గుండెల్లో ఎప్పుడూ ఉంటారు. అబ్బూరి ర‌వి, సినిమాటోగ్రాఫ‌ర్ దివాక‌ర‌న్‌, థ‌మ‌న్ సంగీతం ఎఫ‌ర్ట్స్ ఎక్స్‌ట్రార్డిన‌రీ. వీరికి నా అనుభ‌వంతో చిన్న చిన్న ఇన్‌పుట్స్ ఇచ్చాను. ఇప్పుడు విడుద‌ల చేసిన ట్రైల‌ర్ కంటే ముందుగా మ‌రో ట్రైల‌ర్‌ను చూశాను కానీ న‌చ్చ‌లేదు. దాంతో ద‌ర్శ‌కుడు ఓంకార్ ఒక రోజు స‌మ‌యం తీసుకుని మంచి ట్రైల‌ర్‌ను త‌యారు చేశాడు. థ‌మ‌న్ మ్యూజిక్ సినిమాకు పెద్ద హైలైట్ అవుతుంది. అంద‌రూ ఇష్టంతో ఎంతోక‌ష్ట‌ప‌డి సినిమా చేశాం. ఇందులో సినిమా అంతటా క్యారెక్ట‌ర్‌ను చేశాను. మెంట‌లిస్ట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. కేర‌ళ‌లోని ఓ వ్య‌క్తిని బేస్ చేసుకుని నా క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేశారు. అశ్విన్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, వెన్నెల‌కిషోర్ త‌దిత‌రులు కామెడి ట్రాక్ సూప‌ర్బ్‌. ఇందులో స‌మంత‌, శీర‌త్ క‌పూర్ ఎవ‌రు దెయ్యంగా చేశార‌నేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. పివిపిగారు దేనికీ వెనుకాడ‌కుండా ఖ‌ర్చు పెట్టి సినిమా పూర్తి చేశారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ చూసిన త‌ర్వాతే డ‌బ్బింగ్ చెబుతాన‌ని చెప్పాను. అక్టోబ‌ర్ 13 కోసం వెయిట్ చేస్తున్నాను.

ప్ర‌సాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ - ``అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగారి పుట్టిన‌రోజునాడు మా రాజుగారి గ‌ది2 ట్రైల‌ర్ విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది. నాగార్జున‌గారితో మా బేన‌ర్‌లో ఊపిరి సినిమా చేశాం. అంత కంటే క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద సినిమా చేయాల‌నే ఉద్దేశంతో రాజుగారిగ‌ది2 ప్లాన్ చేశాం. నాగార్జున‌గారు హీరోగానే కాకుండా 24 విభాగాల్లో త‌న ఇన్‌పుట్స్‌నిచ్చి సినిమా అవుట్‌పుట్ బాగా రావ‌డంలో స‌పోర్ట్ చేశారు. అక్టోబ‌ర్ 13న సెలబ్రేష‌న్స్ స్టార్ట్ కాబోతున్నాయి`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ఓంకార్ మాట్లాడుతూ - ``సెప్టెంబ‌ర్ 15, 2015న రాజుగారిగ‌ది సినిమా విడుదలైంది. ఇప్ప‌డు 2017 ఇప్పుడు రాజుగారిగ‌ది2 విడుద‌ల‌వుతుంది. నాగార్జున‌గారు క‌థ విన్న ఐదు నిమిషాల్లోనే సినిమా చేస్తున్నాన‌ని అన్నారు. ఆయ‌న నాపై ఉంచిన న‌మ్మ‌కాన్ని అక్టోబ‌ర్ 13న నిజం చేసుకుంటాన‌ని అనుకుంటున్నాను. నాకు నాగార్జున‌గారంటే అభిమానం. ఒక ద‌ర్శ‌కుడిగా కంటే ఓ అభిమానిగా సినిమాను డైరెక్ట్ చేశాను. శివ‌లోని చైన్‌ను సీన్‌ను బేస్ చేసుకుని రుద్రాక్ష సీన్‌ను డిజైన్ చేశాను. టాప్ టెక్నిషియ‌న్స్ ఇచ్చి నా ఎమోష‌న్స్‌ను చూపించాను`` అన్నారు.

Glam gallery from the event

ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ మాట్లాడుతూ - ``ఇంత ప్రెస్టీజియ‌స్ సినిమాలో నేను భాగం కావ‌డం ఆనందంగా ఉంది. ఓంకార్‌గారి విజువ‌ల్స్ చూసిన త‌ర్వాతే నేను ఇంత మంచి మ్యూజిక్ చేయ‌గ‌లిగాను. స‌మంత‌గారు ఇందులో హార్ట్ ట‌చింగ్ రోల్ చేశారు. క‌చ్చితంగా సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంది`` అన్నారు.

శీర‌త్ మాట్లాడుతూ - ``నాకు మాట‌లు రావ‌డం లేదు. ఓంకార్‌గారికి, నాగార్జున‌గారికి థాంక్స్‌. నాగార్జున‌వంటి సీనియ‌ర్ హీరోతో వ‌ర్క్ చేయ‌డంతో క‌ల నిజ‌మైంది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

మాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ జ‌గ‌న్ మాట్లాడుతూ - ``గ‌గ‌నం త‌ర్వాత చేస్తోన్న రెండో సినిమా. ఈ రాజుగారి గ‌ది2లో ఏం చేయాలో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి సినిమా చేయ‌డం ప్రౌడ్‌గా ఫీల‌వుతున్నాను. అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో అబ్బూరి ర‌వి, సినిమాటోగ్రాఫ‌ర్ దివాక‌ర‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved