pizza
Savyasaachi trailer launch
‘సవ్యసాచి’ ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


24 October 2018
Hyderabad

యువసామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై చందూ మొండేటి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న డిఫరెంట్ మూవీ ‘సవ్యసాచి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. డైరెక్టర్ సుకుమార్ ‘సవ్యసాచి’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యువసామ్రాట్ నాగచైతన్య, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్(సివిఎం), సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రాఫర్ యువరాజ్, దర్శకుడు చందూ మొండేటి తదితరులు పాల్గొన్నారు.

సుకుమార్ మాట్లాడుతూ ‘‘ఇది చాలా కొత్త సబ్జెక్ట్. ఇలాంటి సబ్జెక్ట్‌తో సినిమా చేయడం ఏ డైరెక్టర్‌కైనా హ్యాపీగా ఉంటుంది. ఇండియన్ స్క్రీన్‌మీదే ఇది కొత్త సబ్జెక్ట్. హీరో ఎడమ చేయి అతని మాట వినదు. ఇలాంటి సబ్జెక్ట్ చందుకి దొరికినందుకు చాలా జెలస్ ఫీల్ అవుతున్నాను. చందు అంటే నాకు చాలా ఇష్టం. అతను చేసిన కార్తికేయ నా ఫేవరేట్ మూవీ. ఈ సినిమా బాగా తీసాడని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి కీరవాణి మంచి మ్యూజిక్ చేశారు. తాళం కింద పడినా దాని శ్రుతి చెప్పేస్తుంటారని దేవి అంటూ ఉంటాడు. ఆయన ఎమేజింగ్ జీనియస్. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సవ్యసాచి సాంగ్ చాలా చాలా బాగుంది. నిర్మాతలు నవీన్‌గారు, రవిగారు, మోహన్‌గారు జెట్ స్పీడ్‌లో వెళ్తుంటారు. ఒక్కొక్కరు రెండు రెండు సినిమాలు చేసేస్తున్నారు. డెసిషన్ తీసుకోవడంలో చాలా ఫాస్ట్. వాళ్ళకి నచ్చితే మూవ్ అయిపోతారు. నాగచైతన్య ఈ సినిమాలో చాలా క్యూట్‌గా కనిపిస్తున్నాడు. తప్పకుండా చైతన్యకి మంచి సినిమా అవుతుంది’’ అన్నారు.

నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ‘‘ఈ సినిమా 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఆరోజు అందరం మాట్లాడతాం. నవంబర్ 2న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ ‘‘మైత్రి సంస్థ ముగ్గురు నిర్మాతల వల్ల పెట్టారనుకుంటున్నాను. ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. డిఫరెంట్ కాంబనేషన్స్‌లో సినిమాలు తీస్తూ వారికి కావాల్సింది రాబట్టుకుంటూ సినిమాలు తీస్తుంటారు. చందు మంచి నేచర్ ఉన్న వ్యక్తి. అది ఈ జర్నీలో నాకు చాలా ఉపయోగపడింది. సాధారణంగా మల్టీస్టారర్ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే ఇద్దరికీ సమానమైన డ్యూయెట్లు ఉండాలని దర్శకనిర్మాతలు అనుకుంటూ ఉంటారు. ఈ సినిమా విషయానికి వస్తే విక్రమ్‌గా, ఆదిత్యగా కనిపించే నాగచైతన్యకు ఆ గొడవ లేదు. ఈ సినిమా నాగచైతన్యకు మంచి పేరు తెస్తుంది. ఆల్ ది బెస్ట్. యువరాజ్‌గారు చైతన్య, నిధి అగర్వాల్‌లను చాలా అందంగా చూపించారు. ఫైట్స్‌లో కూడా బాగా చూపించారు. సుకుమార్‌గారితో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయించడంతో సినిమా రిలీజ్‌కి రంగస్థలం సిద్ధమైంది. ఆ రంగస్థలం మీద సవ్యసాచి ఏం చేశాడనేది మనం చూస్తాం. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్‌లో సినిమాలో ఏం ఉండబోతున్నాయో కొంచెం కొంచెం చూపించారు. ఈ నెల 27న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఆ ఈవెంట్‌లో ఏమేం ఉండబోతున్నాయో నేను ట్రైలర్‌గా చెప్పబోతున్నాను. ఈ ఫంక్షన్‌కి కొంతమంది ప్రముఖులు వస్తారు. మా సింగర్స్ అందరూ లైవ్‌గా పాటలు పాడతారు. చిన్న చిన్న స్కిట్‌లు ఉంటాయి’’ అన్నారు.

నాగచైతన్య మాట్లాడుతూ ‘‘ట్రైలర్ లాంచ్ చేసిన సుకుమార్‌గారికి థాంక్స్. నా కెరీర్ ప్రారంభంలోనే 100 పర్సెంట్ లవ్ వంటి మంచి సినిమాను నాకు ఇచ్చారు. సవ్యసాచి కాన్సెప్ట్‌ని ప్రేమమ్ సాంగ్ షూటింగ్‌కి నార్వేలో ఉన్నప్పుడు చెప్పాడు. చాలా బాగా అనిపించింది. ప్రేమమ్ అనే సినిమా నాతో చేసి ఒక ఇంపాజిబుల్ మిషన్‌ని పాజిబుల్ చేశాడు. నా కెరీర్‌లో ఓ పెద్ద హిట్ సినిమా ఇచ్చాడు. ప్రేమమ్ సినిమా రిలీజ్ అయిన మూడు నెలల తర్వాత సవ్యసాచి సబ్జెక్ట్ చేద్దామని అడిగాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థాంక్యూ సోమచ్ చందు. మైత్రి మూవీ మేకర్స్ చాలా మంచి సంస్థ. వాళ్ళు కాంబినేషన్‌ని నమ్మి ఈ సినిమా చెయ్యలేదు. కంటెంట్‌ని నమ్మి తీశారు. ఒక నార్మల్ స్కేల్‌లో ఈ సినిమా చేద్దామనుకున్నప్పుడు మైత్రి వంటి పెద్ద సంస్థ, కీరవాణిగారి మ్యూజిక్ యాడ్ అయ్యాయి. ఇంత పెద్ద రేంజ్‌లో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ దొరుకుతారని మేం కలలో కూడా అనుకోలేదు. మాధవన్, భూమిక వంటి ఆర్టిస్టులు ఈ సినిమాకి వర్క్ చేశారు. నా కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పొచ్చు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ప్రతి సంవత్సరం ఒక సినిమా చెయ్యాలి అనిపించింది. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఫోన్ చేసి విష్ చేస్తారు. కానీ, ఫస్ట్ టైమ్ సవ్యసాచి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఫోన్ చేసి మేం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని అడిగారు. అది కీరవాణిగారి వల్లే జరిగింది. మ్యూజిక్‌తోనే కాదు, కొన్ని ఇన్‌పుట్స్ కూడా ఇచ్చి సినిమా బాగా రావడానికి తోడ్పడ్డారు. ఈనెల 27న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. నవంబర్ 2న ఈ సినిమా విడుదల కాబోతోంది’’ అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved