pizza
NATS Sambaralu curtain raiser event
న్యూజెర్సీలో నాట్స్ తెలుగు సంబరాల కర్టన్ రైజర్ కు విశేష స్పందన
4 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ముందుకొచ్చిన తెలుగువారు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

2 April 2019
USA

NATS Convention 2019 Curtain Raiser is a thunder success with a good crowd of 500 Telugus & their families.

The program started with lamp lighting by NATS BOD Aruna Ganti and local NATS team.Srihari Mandadi - NATS BOD welcomed everyone for the curtain raiser event. NATS Past President and NATS BOD Mohan Krishna Mannava explained about the 2019 Convention and the details of the guests arriving at Sambaralu in Dallas.

Helpline audio visual has been played which explained the NATS helpline activities and service activities done by NATS over the years which is followed by more details from NATS Vice Chairman Sridhar Appasani and the recent helpline donations and contributions.

NATS Vice President Ramesh Nuthalapati announced the donor names and the total pledges from all NATSIANS and Telugus from NY,NJ and PA areas reached around $400,000 dollars.

NATS Joint Secretary Ranjit Chaganti thanked the sponsors Lakshmi Moparthy (New York Life),Venkata Raja and Keerthika Parvathaneni (Uno Finacials) and Sunil Sankaram (Money 2 India - ICICI Bank) representatives.

NATS Vice President Shyam Nalam welcomed Esha Kode Esha Kode (current reigning Miss Teen India USA) and followed by a felicitation by NATS Past Chairman Madhu Korrapati, NATS Past Chairman Sam Maddali, NATS Vice Chairman Sridhar Appasani and NATS Past President Mohan Krishna Mannava.

NATS team facilitated the Bawarchi Biryanis - Edison and Franklin Park teams for sponsoring the food.

NATS Executive Secretary Vamsee Venigalla introduced prominent Immigration attorney Srinivas Jonnalaggada and applauded his service and help to the student impacted by Farmington University. NATS team fecilitated Srinivas Jonnalagadda.

Prasad Simhadri and Sundari entertained the audience to the fullest extent.

This entire Event was co-ordinated by Mohan Krishna Mannava, Sreedhar Appasani, Ramesh Nuthalapati, Srihari Mandadi, Ranjit Chaganti and Vamee Venigalla. NATS New Jersey Co-ordinator Vishnu Aluru thanked everyone for making the event a grand success.

న్యూజెర్సీలో నాట్స్ తెలుగు సంబరాల కర్టన్ రైజర్ కు విశేష స్పందన
4 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ముందుకొచ్చిన తెలుగువారు

31 మార్చ్: ఎడిసన్, న్యూ జెర్సీ: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే న్యూజెర్సీలో నాట్స్ నిర్వహించించిన తెలుగు సంబరాలు 2019 కర్టన్ రైజర్ అండ్ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. స్థానికంగా ఉండే తెలుగు వారు మేము సైతం తెలుగు సంబరాల్లో పాల్గొంటామని ముందుకొచ్చారు. దాదాపు 500 మంది తెలుగువారు ఈ ఈవెంటు కు హాజరయ్యారు. డాలస్ లో ఇర్వింగ్ వేదికగా మే 24 నుంచి 26 తేదీల్లో జరగనున్న సంబరాలకు వచ్చే తెలుగు అతిరథ మహారథుల గురించి నాట్స్ మాజీ అధ్యక్షులు, నాట్స్ బోర్డ్ డైరక్టర్ మోహన కృష్ణ మన్నవ వివరించారు. నాట్స్ తెలుగు సంబరాలను దిగ్విజయం చేసేందుకు తెలుగువారంతా సహకరించాలని కోరారు. నాట్స్ హెల్ఫ్ లైన్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను నాట్స్ వైస్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని వివరించారు. సేవే గమ్యం అనే నినాదానికి తగ్గట్టుగా నాట్స్ అమెరికాలో తెలుగు జాతికి ఎంత అండగా నిలబడుతుందనేదిఉదాహరణల లతో సహా ఆడియో వీడియో ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నాట్స్ ఉపాధ్యక్షుడు రమేశ్ నూతలపాటి నాట్స్ కోసం విరాళాలు అందిస్తున్న దాతల పేర్లను ప్రకటించారు. ఈ సంబరాల ఫండ్ రైజింగ్ ఈవెంట్ కు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన వచ్చింది. దాదాపు నాలుగు లక్షల డాలర్లను సంబరాలకు నాట్స్ సేకరించింది. నాట్స్ జాయింట్ సెక్రటరీ రంజిత్ చాగంటి ఈ ఈవెంట్ కు స్పానర్స్ గా వ్యవహారించిన న్యూయార్క్ లైఫ్ కు చెందిన లక్ష్మి మోపర్తి, యూఎన్ఓ ఫైనాన్షియల్స్ వెంకటరాజా, కీర్తిక పర్వతనేని , మనీ టూ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ రిప్రంజేటేటివ్స్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలే మిస్ టీన్ ఇండియా యూఎస్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈషా కోడెను నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్యాం నాళం వేదిక మీదకుఆహ్వానించారు. నాట్స్ మాజీ ఛైర్మన్లు, మధు కొర్రపాటి, శ్యాం మద్ధాళి, నాట్స్ వైఎస్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ మాజీ అధ్యక్షులు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గంగాధర్ దేసు తదితరులు ఈషా కోడెను ఘనంగా సన్మానించారు. మోహన కృష్ణ మన్నవ, శ్రీధర్ అప్పసాని, రమేష్ నూతలపాటి, శ్రీహరి మందాడి, రంజిత్ చాగంటి, వంశీ వెనిగళ్లలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఫార్మింగ్ టన్ యూనివర్సీటీ బాధితులకు న్యాయ సాయం అందించడంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ జొన్నలగడ్డ ను నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వంశీ వెనిగళ్ల సభకు పరిచయం చేశారు. తెలుగు విద్యార్ధులకు ఆపద సమయంలో కీలకమైన సలహాలు ఇచ్చిన శ్రీనివాస జొన్నలగడ్డను నాట్స్ ఘనంగా సన్మానించింది. ప్రసాద్ సింహాద్రి, సుందరీలు ఈ ఈవెంట్ ఆద్యంతం పాటలతో వినోదం నింపారు. నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ విష్ణు ఆలూరు ఈ ఈవెంట్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved