pizza
Aakatayi music launch
`ఆక‌తాయి` ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

8 February 2017
Hyderaba
d

ఆశిష్‌రాజ్‌, రుక్సార్ మీర్ హీరో హీరోయిన్లుగా వి.కె.ఎ.ఫిలింస్ బ్యాన‌ర్‌పై రామ్‌భీమ‌న ద‌ర్శ‌కత్వంలో విజ‌య్ క‌ర‌ణ్‌, కౌశ‌ల్ క‌ర‌ణ్‌, అనిల్ క‌ర‌ణ్ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం `ఆక‌తాయి`. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే సురేష్‌బాబు, స్వామి నాయుడు, జ‌గ‌దీష్‌, తుల‌సీరాం, ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌, ఎడ్ల సుధాక‌ర్‌, వ‌ర‌ప్ర‌సాద్, మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి, రామ‌జోగ‌య్య శాస్త్రి, చైత‌న్య‌ప్ర‌సాద్, తనీష్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

బిగ్ సీడీని రాంకీ విడుద‌ల చేశారు. ఆడియో సీడీల‌ను రాంకీ విడుద‌ల చేయ‌గా తొలి సీడీని స్వామినాయుడు, త‌నీష్ అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా....

ఎమ్మెల్యే సురేష్ బాబు మాట్లాడుతూ - ``ఇలాంటి కాలంలో ఈ టైటిల్స్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద స‌క్సెస్‌ను సాధించాయి. ఆకాష్‌కు,రుక్స‌ర్‌కు ఆల్ ది బెస్ట్‌. ఇప్పుడు వ‌స్తున్న సినిమాల్లో ఇది ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

చిరంజీవి యూత్ ఫ్యాన్స్ అధ్య‌క్షుడు స్వామినాయుడు మాట్లాడుతూ - ``ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ చూశాను. హాలీవుడ్ మూవీకి త‌గ్గ మూవీగా అనిపించింది. రామ్‌భీమ‌న సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. ఆకాష్ స‌హా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు టీం స‌భ్యుల‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు యు.కెలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ట్రైల‌ర్ కూడా చూశాం. హాలీవుడ్ స్ట‌యిల్‌లో రామ్ భీమ‌న టేకింగ్ ఉంది. ద‌ర్శ‌కుడుకి త‌గ్గ‌ట్టు ఎక్క‌డా త‌గ్గ‌కుండా నిర్మాత‌లు సినిమాను నిర్మించారు. హీరో ఆకాష్‌, హీరోయిన్ రుక్సార్ చ‌క్క‌గా న‌టించారు. ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్స్ ఇచ్చిన మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతంలో పాటలు చాలా బాగావున్నాయి. ఈ సినిమా రామ్‌భీమ‌నగారికి ఈ సినిమా పెద్ద హిట్ మూవీగా నిలుస్తుంది. నిర్మాత‌లకు ఈ సినిమా మంచి లాభాల‌ను తెచ్చిపెట్టి వారు మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ - ``షార్ట్ ఫిలింతో ద‌ర్శ‌కుడుగా త‌నెంటో ప్రూవ్ చేసుకున్న రామ్‌భీమ‌న త‌ర్వాత హ‌మ్ తుమ్‌తో ద‌ర్శ‌కుడు సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇలాంటి మంచి నిర్మాత‌ల‌తో సినిమా చేసిన రామ్‌భీమ‌న మంచి ద‌ర్శ‌కుడుగా పేరు తెచ్చుకుంటాడ‌ని భావిస్తున్నాను. ఆకాష్ స‌హా టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

వ‌రప్ర‌సాద్ మాట్లాడుతూ - ``హీరో హీరోయిన్లు అద్భుతంగా న‌టించారు. మ‌ణిశ‌ర్మ‌గారు ఎన్నోర‌కాల ట్యూన్స్‌ను అందించారు. ఈ సినిమాకు కూడా ఎక్స‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను చేశారు. నిర్మాత‌ల‌కు, ద‌ర్శ‌కుడు రామ్‌భీమ‌న‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

త‌నీష్ మాట్లాడుతూ - ``ఆక‌తాయి టీజ‌ర్ చూడ‌గానే ఇంప్రెస్ అయ్యాను. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడా చూశాను. ఇంకా బాగా న‌చ్చింది. రామ్‌భీమ‌న‌గారు ఇంత స్ట‌ఫ్ ఉన్న మూవీని, ఇంత మంచి అవుట్‌పుట్‌తో చేయ‌డం గ్రేట్‌. ఆశిష్ ఎన‌ర్జిటిక్‌గా ఉన్నాడు. బాగా డ్యాన్స్ చేశాడు. చాలా కాలం త‌ర్వాత రాంకీగారు చేసిన మూవీ ఇది. మ‌ణిశ‌ర్మ వంటి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఈ సినిమాకు మ్యూజిక్ చేయ‌డం హైటైట్‌గా నిలుస్తుంది. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరుతో పాటు డ‌బ్బులు కూడా వ‌స్తుంద‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

కౌశ‌ల్ క‌ర‌ణ్ మాట్లాడుతూ - ``ఆక‌తాయి సినిమా కోసం ఎంటైర్ టీం హార్డ్ వ‌ర్క్ చేశారు. సినిమా అంద‌రూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది`` అన్నారు.

రాంకీ మాట్లాడుతూ - ``తెలుగులో చాలా సినిమాలు చేశాను. మ‌ధ్య‌లో తెలుగులో చేయ‌డానికి కుద‌ర‌క‌, మంచి సినిమాలో అవ‌కాశం రాక ఇక్క‌డ సినిమా చేయ‌డానికి గ్యాప్ తీసుకున్నాను. ఈ సినిమా కోసం రామ్‌భీమ‌న ఫోన్‌లో మూడు గంట‌లు పాటు సినిమాను ఎక్స్‌ప్లెయిన్ చేశారు. రామ్‌భీమ‌న నాకు ఎదైతే చెప్పారో, అలాగే ఎగ్జిక్యూట్ చేశారు. ఈ సినిమా చేయ‌డం హ్యాపీగా ఉంది. నిర్మాత‌లకు థాంక్స్‌. కొత్త‌వాళ్ళ‌తో చేస్తున్నా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా, ద‌ర్శ‌కుడికి ఫుల్ స‌పోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

ఆకాష్ రాజ్ మాట్లాడుతూ - ``మ‌ణిశ‌ర్మ‌గారి మ్యూజిక్‌లో నేను సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. యాక్టింగ్ అంటే ప్యాష‌న్‌తో ఈ రంగంలోకి వ‌చ్చాను. వండ‌ర్‌ఫుల్ క‌థ‌. మా వి.కె.ఎ.ఫిలింస్‌కు, ద‌ర్శ‌కుడు రామ్‌భీమ‌న‌గారికి రుణ‌ప‌డి ఉంటాను. సినిమా అద‌రికీ న‌చ్చుతుంది. సినిమా చూసి ఆశీర్వ‌దించండి`` అన్నారు.

రామ్‌భీమ‌న మాట్లాడుతూ - ``నా లైఫ్‌లో బిగ్గెస్ట్ డే. ఎవ‌రికీ థాంక్స్ చెప్పాలో తెలియ‌న క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నాను. ఈ సినిమా క్రెడిట్ అంతా నిర్మాత‌ల‌కే చెందుతుంది. 2013లో హ‌మ్ తుమ్ సినిమా చేసిన త‌ర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. మ‌ణిశ‌ర్మ వంటి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని, అమీషా ప‌టేల్ వంటి స్టార్ హీరోయిన్‌ను స్పెష‌ల్ సాంగ్ కోసం ఇచ్చారు. అలా నిర్మాత‌లు నేను అడ‌గ‌కుండానే వ‌రాలు ఇచ్చారు. ఆకాష్‌, రుక్సార్ నేను ఎలా చెబితే అలా చేశారు. సినిమా చూస్తే ప్రేక్ష‌కులు డిస‌ప్పాయింట్ కార‌ని చెప్ప‌గ‌ల‌ను. రాంకీ వంటి లెజెండ్ న‌టుడుతో సినిమా చేసే అదృష్టం క‌లిగింది. సినిమాటోగ్రాఫ‌ర్ వెంక‌ట్‌గారు అద్భుతమైన విజువ‌ల్స్ అందించారు. మ‌ణిశ‌ర్మ‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని ఇచ్చారు. ఓ ఫ్రెండ్‌లా నాకు అండ‌గా నిల‌బ‌డ్డారు. న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ అంద‌రూ బాగా స‌పోర్ట్ చేయ‌డంతో మంచి సినిమా చేశాను. మా సినిమాను ఆద‌రిస్తారించాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుకుంటున్నాను`` అన్నారు.

ఆశిష్‌రాజ్‌, రుక్సార్ మీర్‌, సుమ‌న్‌, నాగ‌బాబు, రాంకీ, రాశి, బ్ర‌హ్మానందం, అలీ, ప్ర‌దీఫ్ రావ‌త్‌, పోసాని, పృథ్వీ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో అమీషా ప‌టేల్ స్పెష‌ల్‌సాంగ్ చేశారు. ఈ చిత్రానికి సంగీతంః మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః వెంక‌ట్ గంగ‌దారి, ఆర్ట్ః ముర‌ళి కొండేటి, ఫైట్స్ః నందు, ఎడిట‌ర్ః ఎం.ఆర్‌.వ‌ర్మ‌, డ్యాన్స్ః జానీ మాస్ట‌ర్‌, స్వ‌ర్ణ‌, స‌తీష్‌, అమిత్‌, నిర్మాత‌లుః విజ‌య్ క‌ర‌ణ్‌, కౌశ‌ల్ క‌ర‌ణ్‌, అనిల్ క‌ర‌ణ్‌, క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః రామ్

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved