pizza
Natukodi music launch
`నాటుకోడి` ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 December 2016
Hyderaba
d

శ్రీకాంత్‌, మ‌నో చిత్ర జంట‌గా నానికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో బంద‌రు బాబీ, నాని కృష్ణ నిర్మాత‌లుగా నానిగాడి సినిమా ప‌తాకంపై రూపొందుతోన్న చిత్రం `నాటుకోడి`. యాజమాన్య సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిష్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాస‌రావు, విక్ట‌రీ వెంక‌టేష్‌, హీరో త‌రుణ్‌, కోట‌శ్రీనివాస‌రావు, ప్ర‌వీణ్‌యాద‌వ్‌, శివాజీరాజా, సాంబ‌శివ‌రాజు, అమ్మిరాజు, ర‌ఘు కుంచె, ప్ర‌భు, మాగంటి గోపినాథ్‌, ద‌ర్శ‌కుడు నాని కృష్ణ‌, నిర్మాత‌ బాబీ, స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, ల‌హ‌రి శ్రీనివాస్ స‌హా చిత్ర యూనిట్ స‌భ్యుల పాల్గొన్నారు.

బిగ్ సీడీని విక్ట‌రీ వెంక‌టేష్ విడుద‌ల చేశారు. ఆడియో సీడీల‌ను త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌, గంటా శ్రీనివాస‌రావు విడుద‌ల చేసి తొలి సీడీని విక్ట‌రీ వెంక‌టేష్ అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాస‌రావు మాట్లాడుతూ - ``శ్రీకాంత్ న‌టించిన `నాటుకోడి` చాలా మాస్ క్యాచీ టైటిల్‌. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అభినంద‌లు తెలుపుతున్నాను. శ్రీకాంత్ ఈ చిత్రంలో క‌రెప్టెడ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించారు. గ‌తంలో శ్రీకాంత్ చేసిన `ఆప‌రేష‌న్ దుర్యోధ‌న` త‌ర‌హాలో ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

తెలంగాణ సినిమాటోగ్ర‌పీ మినిష్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస‌యాదవ్ మాట్లాడుతూ - ``తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో స్వ‌యంకృషితో త‌న కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న శ్రీకాంత్ చేసిన‌ నాటుకోడి టైటిల్‌కే హండ్రెడ్ మార్క్స్ ప‌డ్డాయి. సంక్రాంతికి సినిమా విడుద‌ల‌వుతుంది. శ్రీకాంత్ ఒక క‌మిట్‌మెంట్‌తో పైకొచ్చిన వ్య‌క్తి. అలాగే ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్నారు. ఇంత మంచి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాలి. యాజ‌మాన్య మంచి సంగీతం అందించారు`` అన్నారు.

విక్ట‌రీ వెంక‌టేష్ మాట్లాడుతూ - ```నాటుకోడి` టైటిల్ ఎన‌ర్జిటిక్‌గా, మాసీగా ఉంది. ఐదు పాటలు చాలా క్యాచీగా, మాసీగా ఉన్నాయి. యాజ‌మాన్య‌కు అభినంద‌న‌లు. శ్రీకాంత్‌ను నాని కృష్ణ చాలా ఎన‌ర్జిటిక్‌గా చూపించారు. శ్రీకాంత్ పాతికేళ్లుగా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించి మెప్పించాడు. మ‌రో పాతికేళ్లు ఇలాగే న‌టించి అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని కోరుకుంటున్నాను. ద‌ర్శ‌క నిర్మాత‌లు నాని కృష్ణ‌, బాబీల‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

కోట‌శ్రీనివాస‌రావు మాట్లాడుతూ - ``సినిమా త‌ప్ప‌కుండా బావుంటుంది. ఈ దర్శ‌క నిర్మాత‌లు అన్న‌ద‌మ్ములు. ఈ నిర్మాత‌లు ఎంత క‌ష్ట‌డ్డారో నాకు తెలుసు. ఇలాంటి సినిమా బాగా ఆడాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో శ్రీకాంత్‌గారి ఫాద‌ర్ వేషం వేశాను. అన్నీ ర‌కాల హంగులున్న సినిమా ఇది`` అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ - ``నేను అన్నీ రకాల మూవీస్ చేశాను. క‌ర‌ప్టెడ్ పోలీస్‌గా తొలిసారి న‌టించాను. చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగే సినిమా. నానికృష్ణ సినిమాను చ‌క్క‌టి ఎంట‌ర్‌టైనింగ్‌తో తెర‌కెక్కించాడు. గ‌తంలో మా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన దేవ‌రాయ సినిమాను ఆద‌రించిన విధంగానే ఈ సినిమాను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను. యాజ‌మాన్య మంచి సంగీతాన్ని అందించారు`` అన్నారు.

డైరెక్ట‌ర్ నానికృష్ణ మాట్లాడుతూ - ``నాటుకోడి క‌రప్టెడ్ పోలీస్ ఆఫీస‌ర్ క‌థ కాదు, క‌ర‌ప్టెడ్ ప్ర‌జ‌ల క‌థ‌. క‌రెక్ట్‌గా ఉండే పోలీస్‌కు, క‌రప్టెడ్ ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య జ‌రిగే సినిమా. సంక్రాంతి సినిమాల్లో మా నాటుకోడి ఓ భాగ‌మ‌వుతుందని భావిస్తున్నాను. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత బంద‌రు బాబీ మాట్లాడుతూ - ``మాకు అండగా నిల‌బడ్డ అంద‌రికీ థాంక్స్‌. మా బ్యాన‌ర్‌లో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. మ‌రిన్ని మంచి సినిమాలు మా బ్యాన‌ర్‌లో చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

యాజ‌మాన్య మాట్లాడుతూ - ``గ‌తంలో నేను శ్రీకాంత్‌గారి సినిమాల‌కు కీ బోర్డ్ ప్లేయ‌ర్‌గా ప‌నిచేశాను. ఇప్పుడు ఆయ‌న సినిమాకు మ్యూజిక్ చేసే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, శ్రీకాంత్‌గారికి థాంక్స్‌`` అన్నారు.

శివాజీ రాజా మాట్లాడుతూ - ``పీపుల్స్ ఎన్‌కౌంట‌ర్ నుండి నాటుకోడి వ‌ర‌కు శ్రీకాంత్‌కు క‌ష్ట‌ప‌డ‌టం తెలుసు. నాని, శ్రీకాంత్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలి`` అన్నారు.

క‌ల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ - ``టైటిల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా, క్యాచీగా ఉంది. నాని చాలా మంచి మ‌నిషి. శ్రీకాంత్ అన్న‌య్య న‌టిస్తున్న ఈ సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

అమ్మిరాజు మాట్లాడుతూ - ``నాటుకోడి తినేట‌ప్పుడు ఎప్పుడు తిందామా అనిపిస్తుందో, అలాగే ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందోన‌ని ఆస‌క్తి క‌లిగించింది. సినిమా పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటూ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

ర‌ఘుకుంచె మాట్లాడుతూ - ``యాజ‌మాన్య సాంగ్స్ అన్ని ఎన‌ర్జిటిక్‌గా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ అయ్యి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

హీరో త‌రుణ్ మాట్లాడుతూ - ``ఇండ‌స్ట్రీలో నాకే కాదు, అంద‌రికీ శ్రీకాంత్‌గారు మంచి స్నేహితుడు. సాంగ్స్ అన్నీ ఊర‌మాస్‌గా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు నాని కృష్ణ‌, నిర్మాత నానిగారు స‌హా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ - ``డైరెక్ట‌ర్ నాని కృష్ణ‌, నిర్మాత బాబీల‌కు అభినంద‌న‌లు. గతంలో హీరో శ్రీకాంత్‌తో రెండు సినిమాల‌ను నిర్మించాను. త‌ను అందరికీ కావాల్సిన హీరో. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటూ యూనిట్‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

కోట శ్రీనివాస‌రావు, రావు ర‌మేశ్‌, జీవా, స‌లీమ్ పాండా (ఘ‌ర్ష‌ణ‌), స‌త్తిరెడ్డి, రోల‌ర్ ర‌ఘు, కాదంబ‌రి కిర‌ణ్‌, చిరున‌వ్వుతో ప్ర‌భు, బోస్ బాబు, జ‌య‌వాణి, నేహా త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు సంగీతం: యాజ‌మాన్య‌, కెమెరా: మ‌ల్లేశ్ నాయుడు, ఫైట్స్: డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌, డ్యాన్స్: ప్ర‌దీప్ ఆంటోనీ.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved