pizza
Nenorakam music launch
"నేనోరకం" ఆడియో ఆవిష్కరణ..
You are at idlebrain.com > News > Functions
Follow Us

8 March 2017
Hyderaba
d

రామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మహిత్ నారాయణ్ కంపోజ్ చేసిన ఈ సినిమా లొని సాంగ్స్ ను పూరి జగన్నాథ్,దేవిశ్రీ ప్రసాద్, గోపిచంద్ ఒక్కొ పాటను ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు విషెష్ ను తెలిపారు. ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ యుట్యూబ్ ఛానెల్ లో నేనోరకం జూక్ బాక్స్ అప్లొడ్ చేయగా, సినిమా. మార్చి 17 న విడుదలకు సిద్దమవుతోంది.

ఈసందర్బంగా ..

గోపిచంద్ మాట్లాడుతూ.. నేనోరకం ట్రైలర్ సూబర్బ్ గా ఉంది. పాటలు చాలా బాగున్నాయి. ఈ ఇయర్ లో ఓ మంచి సినిమా గా "నేనోరకం" నిలుస్తుందని ఆశిస్తున్నానన్నారు.

పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. నేనోరకం సినిమా నేను చూశాను. సినిమా కధనం చాలా గ్రిప్పింగ్ గా ఉంది. రామ్ శంకర్ కు హిట్ గ్యారెంటీ అన్న నమ్మకం వచ్చింది. పాటలన్ని సందర్బానుసారంగా బాగున్నాయన్నారు..

దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. నేనోరకం టైటిల్ కు తగ్గట్టుగానే పాటలు, ట్రైలర్ ప్రత్యేకంగా ఉన్నాయి. సినిమా సక్సెస్ పై టీమ్ కాన్ఫెడెంట్ గా ఉన్నారు. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అన్నారు..

రామ్ శంకర్ మాట్లాడుతూ.. థ్రిలింగ్ లవ్ కమ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబడిన చిత్రం నేనోరకం. సమకాలీన అంశాల స్పూర్తితో పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు.

దర్శకుడు సుదర్శన్ మాట్లాడుతూ...
మహిత్ పాటలు, రీరికార్డింగ్ నేనోరకం సినిమాకు ఓ ఎసెట్. కంటెంట్ ఈ చిత్రానికి ప్రధాన బలం.

టెక్నికల్ గా కూడా ది బెస్ట్ మూవీ ఇది. శరత్ కుమార్ కేవలం కధ నచ్చి ఈ సినిమాను చేశారు. ప్రేక్షకులకు ఓ సరికొత్త ఫీల్ ను "నేనోరకం " అందిస్తుందన్నారు.

నిర్మాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... హీరో రామ్ శంకర్ కెరీర్ లో నేనోరకం దిబెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఆడియెన్స్ తో పాటు, క్రిటిక్స్ ను కూడా అలరించెలా చిత్రముంటుంది.మార్చి 17న సినిమాను విడుదల చెస్తున్నామన్నారు.

రేష్మి మీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు

కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారాయణ్


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved