pizza
Oxygen music launch
`ఆక్సిజన్‌` ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 October 2017
Hyderabad

గోపీచంద్‌ కథానాయకుడిగా ఏ.ఎం.జోతిక ష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ 'ఆక్సిజన్‌'. గోపీచంద్‌ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. బిగ్‌ సీడీని శరత్‌కుమార్‌, నాజర్‌ విడుదల చేశారు. ఆడియో సీడీలను నిర్మాత ఎ.ఎం.రత్నం విడుదల చేయగా, తొలి సీడీని అను ఇమ్మాన్యుయేల్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా..

హీరో గోపీచంద్‌ మాట్లాడుతూ - '''ఆక్సిజన్‌' సినిమాలో నేను నటించడానికి ప్రధాన కారణం ఎ.ఎం.రత్నంగారు. ఎందుకంటే నేను చిన్నప్పట్నుంచి నాన్నగారి దగ్గర ఆయన్ను చూసేవాడిని. నిర్మాతగా మారిన ఆయన తర్వాత ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌ అయ్యారు. జ్యోతికృష్ణ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు కథ నచ్చింది. నేను వెంటనే రత్నంగారికి ఫోన్‌ చేసి..'అంకుల్‌ మీరు ఈ సినిమా నిర్మిస్తే..నేను సినిమాలో నటిస్తానని చెప్పాను. మీపై నమ్మకం ఉంది. న్యాయం చేయగలరు' అని అన్నాను. ఆయన కూడా 'అలాగే గోపీ, తప్పకుండా కలిసి సినిమా చేద్దామని' అన్నారు. చెప్పినట్లే ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను నిర్మించారు. జోతికృష్ణ వర్కింగ్‌ స్టయిల్‌ ఎంతో బావుంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన వ్యక్తుల్లో సినిమాటోగ్రాఫర్స్‌ వెట్రి, ఛోటా కె.నాయుడుగారు కీలకపాత్రలు పోషించారు. యువన్‌ అద్భుతమైన మ్యూజిక్‌ను అందించాడు. తనతో కలిసి వర్క్‌ చేయాలని చాలా రోజులుగా అనుకునేవాడిని. ఇప్పటికి కుదిరింది. సాంగ్స్‌ చాలా బాగా వచ్చింది. సినిమా కథను నేనైదైతే నమ్మానో దాన్ని చక్కగా తీశారు. జగపతిబాబుగారితో లక్ష్యం తర్వాత కలిసి చేసిన సినిమా ఇది. మంచి అనుభవమున్న నటుడు. అలాగే అలీ, శ్యామ్‌, అను ఇమ్మాన్యుయేల్‌, రాశిఖాన్న సహా అందరూ చక్కగా నటించారు. పీటర్‌ హెయిన్స్‌ ఫైట్స్‌ సినిమాకు పెద్ద ఎసెట్‌ అవుతుంది. మంచి కమర్షియల్‌ వేల్యూస్‌తో పాటు మంచి మెసేజ్‌ కూడా ఇచ్చాం. డెఫనెట్‌గా సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

దర్శకుడు జోతికృష్ణ మాట్లాడుతూ - ''గోపీచంద్‌గారికి నేను ఒకేసారి రెండు స్క్రిప్ట్స్‌ వినిపించాను. ఆయనకు ఆక్సిజన్‌ స్క్రిప్ట్‌ బాగా నచ్చింది. డిఫరెంట్‌గా ఉండటమే కాకుండా మంచి మెసేజ్‌ ఉందని ఆయన చెప్పారు. ఈసినిమాలో గోపీచంద్‌గారి క్యారెక్టర్‌లో మూడు వేరియేషన్స్‌ చూడొచ్చు. గోపీచంద్‌గారు చాలా హార్డ్‌వర్క్‌ చేశారు. రియల్‌ హీరోలా సపోర్ట్‌ చేశారు. అలాగే యువన్‌శంకర్‌ రాజాగారితో నేను వర్క్‌ చేసిన రెండో సినిమా ఇది. ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. మా నాన్నగారికి గొప్ప మెసేజ్‌ ఒరియెంటెడ్‌ సినిమాలు చేయాలనుకుంటారు. ఆయన చేసిన కర్తవ్యం, భారతీయుడు ఇలా మెసేజ్‌ ఒరియెంటెడ్‌ సినిమాలు చాలానే చేశారు. ఆయన గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు. ప్రతి డైరెక్టర్‌కు మా నాన్నగారి ప్రొడక్షన్‌లో సినిమా చేయాలని ఉంటుంది. ఎందుకంటే..ఆయన మంచి అవుట్‌పుట్‌ కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. ఓ దర్శకుడిగా ఆయనకు మంచి సినిమానే అందించానని, ఓ ల్యాండ్‌ మార్క్‌ మూవీ అవుతుందని అనుకుంటున్నాను. ఛోటాగారు, వెట్రిగారికి థాంక్స్‌. ఎడిటర్‌ ఉద్ధవ్‌గారికి, పీటర్‌ హెయిన్స్‌, స్టంట్‌ సెల్వలకు థాంక్స్‌. రాశిఖన్నా, అను ఇమ్మాన్యుయేల్‌ నటన చూసి వారు తప్ప మరెవరూ ఈ సినిమాను చేయలేరు. ఇద్దరికీ మంచి డేడికేషన్‌ ఉంది. నా భార్య ఐశ్వర్య ఈ కథ వినగానే చాలా బావుంది..చేయమని అన్నారు. పూర్తి స్థాయి కమర్షియల్‌ మూవీ. కుటుంబమంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది'' అన్నారు.

అను ఇమ్మాన్యుయేల్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమా నేను తెలుగు సైన్‌ చేసిన మొదటి సినిమా. నాకు చాలా స్పెషల్‌ మూవీ. తెలుగులో ఏమీ తెలియకపోయినా, జోతికృష్ణ, ఐశ్వర్యగారు నాపై నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఎ.ఎం.రత్నంగారికి థాంక్స్‌. యువన్‌ శంకర్‌ మ్యూజిక్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. గోపీచంద్‌గారు ఎంతో మంచి సపోర్ట్‌ను అందించారు'' అన్నారు.

ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ - ''రత్నంగారు నాకు ఎప్పుడూ ఇన్‌స్పిరేషన్‌ ఇచ్చే వ్యక్తి. జోతికృష్ణతో సినిమా అనగానే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. కానీ అతనితో పనిచేసినప్పుడు..తనకున్న క్లారిటీ, స్క్రీన్‌ప్లే ప్రెజన్స్‌ అద్భుతమని అర్థమైంది. తెలుగులో ఇలాంటి సినిమా బాహుశా చూసి చాలా కాలమై ఉండొచ్చు. సెకండాఫ్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. మా గోపీచంద్‌ చాలా క్లియర్‌గా ఉండి చక్కగా నటించాడు. యువన్‌ శంకర్‌ చక్కగా సంగీతం అందించాడు. అందరూ సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

పోకూరి బాబూరావు మాట్లాడుతూ - ''నాకు ఎ.ఎం.రత్నం నలభై ఏళ్లుగా పరిచయం ఉంది. మామూలు మేకప్‌మేన్‌ స్టేజ్‌ నుండ నెంబర్‌ వన్‌ నిర్మాత స్థాయికి ఎదగడం అంటే చిన్న విషయం కాదు. చాలా గొప్ప సినిమాలను నిర్మించిన నిర్మాత రత్నంగారు. చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో ఆక్సిజన్‌ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో తనకు పూర్వ వైభవం రావాలి. జోతికృష్ణకు దర్శకుడిగా మంచి పేరు రావాలి. మా హీరో గోపీచంద్‌ మళ్లీ విజృబించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

నాజర్‌ మాట్లాడుతూ - ''ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించిన ఎ.ఎం.రత్నంగారి గైడెన్స్‌లో ఈ సినిమా రూపొందింది. యాక్షన్‌ ఎంత ఉందో, అంతే ఫ్యామిలీ డ్రామా ఉంది. మంచి సంగీతం, విజువల్స్‌ అన్నీ ఉన్నాయి'' అన్నారు.

ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ - ''సినిమా బాగా రావడానికి సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. మా బేనర్‌లో తమన్నా, జెనిలియా, త్రిష వంటి హీరోయిన్స్‌ను ఇంట్రడ్యూస్‌ చేశాం. ఇప్పుడు అను ఇమ్మాన్యుయేల్‌ను ఇంట్రడ్యూస్‌ చేశాం. ఈ సినిమా విడుదల కాకముందే అను పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంది. స్వార్ధపరులుస్వలాభం కోసం యూత్‌ ఎంత నష్టపోతున్నారనేది ఈ సినిమాలో చూడొచ్చు. గోపీచంద్‌గారికి స్పెషల్‌ థాంక్స్‌. మా జ్యోతి చిన్నప్పట్నుంచి మంచి కథలు రాస్తాడు. తను ఏకలవ్య శిష్యుడు. తను ఫిలిం కోర్స్‌ చేసి డైరెక్టర్‌గా మారాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.

యువన్‌ శంకర్‌ రాజా మాట్లాడుతూ ''మ్యూజిక్‌ చేయడానికి అవకాశం ఇచ్చిన రత్నంగారికి థాంక్స్‌. ఇన్‌టెన్స్‌, ఎమోషనల్‌ లవ్‌స్టోరీ. జ్యోతికృష్ణ సినిమాను చక్కగా డైరెక్ట్‌ చేశాడు'' అన్నారు. ఈ కార్యక్రమంలో పోకూరి బాబూరావు, అంబికా కృష్ణ, అనీల్‌ సుంకర, బివిఎస్‌ఎన్‌.పస్రాద్‌, మల్కాపురం శివకుమార్‌, రాజ్‌ కందుకూరి, సి.కల్యాణ్‌, స్టంట్‌ సెల్వ, సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌, ఉద్ధవ్‌, ఆర్‌.టి.నేసన్‌ , మిలాన్‌, రామ్‌కుమార్‌, సాయి, నవీన్‌, సింగర్‌ దీపక్‌, సురేంద్ర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved