pizza
Pizza 2 music launch
`పిజ్జా-2` ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 November 2016
Hyderaba
d

 

వరుస విజయాలతో దూకుడు మీదున్న తమిళ పాపులర్ హీరో విజయ్‌సేతుపతి తమిళంలో నటిస్తున్న చిత్రం `పురియాద పుదీర్‌`. రంజిత్ జ‌య‌కోడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని `పిజ్జా-2` పేరుతో.. ప్రేమకథా చిత్రమ్, జక్కన్న లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీమతి లత సమర్పణలో ఆర్‌పీఏ క్రియేషన్స్‌తో డీవీ సినీ క్రియేషన్స్ సంస్థ కలిసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని ఆదివారం చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. శామ్ సి.ఎస్‌. సంగీతం అందించిన ఈ సినిమాకు తెలుగులో మంత్ర ఆనంద్ సంగీత ప‌ర్య‌వేక్ష‌ణ చేశారు. ఈ సినిమా ఆడియో సీడీల‌ను త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ విడుద‌ల చేసి బెల్లంకొండ సురేష్ అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా....

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ - `` విజ‌య్ సేతుప‌తి సినిమాలో ఏదో కొత్త‌ద‌నం లేకుంటే సినిమా చేయ‌డు. త‌ను కొత్త కొత్త క‌థాంశాల‌తో నాలుగేళ్ల‌లో ఇర‌వై నాలుగు సినిమాల్లో యాక్ట్ చేశాడు. విజ‌య్ సేతుప‌తి న‌టించిన పిజ్జా సినిమాను నేను, సురేష్ కొండేటి తెలుగులో విడుద‌ల చేస్తే సినిమా పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఇప్పుడు త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి న‌టించిన‌ పురియాద పుదిర్ సినిమాను తెలుగులో పిజ్జా-2గా తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. సినిమా పెద్ద హిట్ సాధించి తెలుగు నిర్మాత‌లు డి.వెంక‌టేష్‌, ఆర్‌.సుద‌ర్శ‌న్‌రెడ్డి, త‌మిళ నిర్మాత జె.స‌తీష్ కుమార్‌ల‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - ``డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాల్లో న‌టించే విజ‌య్ సేతుప‌తితో నిర్మాత జె.స‌తీష్‌కుమార్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సినిమాల‌ను నిర్మించారు. ఇప్పుడు తెలుగులో `పిజ్జా-2`గా విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం సాంగ్స్, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ బావున్నాయి. సినిమా డెఫ‌నెట్‌గా పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ - ``ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసకుని థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించబడింది. వరుసగా ఏడు హిట్లతో తమిళ సినీ రంగంలో ముందంజలో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి ఈ చిత్రం ఎనిమిదవ హిట్‌గా నిలుస్తుంది. తెలుగులో ప్రేమకథా చిత్రమ్, జక్కన్న లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలు నిర్మించిన ఆర్‌పీఏ క్రియేషన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడం ఆనందంగా వుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఇదే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి అద్భుతంగా తీర్చిదిద్దారు. గాయత్రి నాయికగా నటించారు`` అన్నారు.

జె.స‌తీష్ కుమార్ మాట్లాడుతూ - ``వెంక‌టేష్ గారు, సుద‌ర్శ‌న్‌గారు సినిమాను తెలుగులో విడుద‌ల చేయడం ఆనందంగా ఉంది. రొమాంటిక్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాను ద‌ర్శ‌కుడు రంజిత్ చాలా చ‌క్క‌గా తెర‌ర‌కెక్కించారు. తెలుగులో త్వ‌ర‌లోనే నేను కూడా సినిమా చేయాల‌నుకుంటున్నాను`` అన్నారు.

మల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ - ``విజ‌య్ సేతుప‌తి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నాడు. త‌ను న‌టించిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు రంజిత్ జ‌య‌కోడి మాట్లాడుతూ - ``పిజ్జా-2 రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.

హీరోయిన్ గాయ‌త్రి మాట్లాడుతూ - ``మా నాన్న‌గారు తెలుగువారే. నేను తెలుగు సినిమాల‌ను చూస్తుంటాను. పిజ్జా-2తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కావ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సి.జె.శోభారాణి, డార్లింగ్ స్వామి త‌దిత‌రులు పాల్గొని చిత్ర‌యూనిట్‌ను అభినందించారు.

ఈ చిత్రంలో నేరం ఫేమ్ రమేష్ తిలక్, సోనియా దీప్తి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శామ్ సిఎస్, సినిమాటోగ్రఫీ: దినేష్ క్రిష్ణన్, ఎడిటర్: భావన శ్రీకుమార్.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved