pizza
Plus One music launch
`ప్ల‌స్ వ‌న్‌`ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 December 2016
Hyderaba
d

సుచేతా డ్రీమ్‌వ‌ర్క్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `ప్ల‌స్ వ‌న్‌`. రోష‌న్ క‌థానాయకుడు. ఆర్తి నాయిక‌. అళ‌హ‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విశ్వాస్.హెచ్ నిర్మాత‌. జ‌య‌సూర్య సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. మిస్ రేష్మీఠాగూర్ (మిస్ ప్లానెట్ ఇండియా 2016, మిస్ ఏసియా 2016) ఆడియో సీడీల‌ను విడుద‌ల చేయ‌గా తొలి సీడీని ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ అందుకున్నారు.

`ప్ల‌స్ వ‌న్‌` యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. యువత అంటే అల్ల‌రి చిల్ల‌రిగా తిర‌గ‌డ‌మే కాదు, అనుకోని స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఎంత విజ్ఞ‌త‌ను ప్ర‌ద‌ర్శించి ఆ స‌మ‌స్య నుండి ఎలా భ‌య‌ప‌డ్డార‌నే కాన్సెప్ట్‌తో అశ్లీల‌త‌, అస‌భ్యానికి తావు లేకుండా వినోదాత్మ‌కంగా, సందేశాత్మ‌కంగా రూపొందించామ‌ని ద‌ర్శ‌కుడు అళ‌హ‌రి తెలియ‌జేశారు. సినిమాను డిసెంబ‌ర్ 30న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నామ‌ని, యువ‌త‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే చిత్ర‌మిది. ప్ల‌స్ ఒన్ ఏజ్‌లో యువ‌త మెంట‌ల్లీ, సైక‌లాజిక‌లీ ఎలా ఉంటుందనేది ఇందులో చూపించాం. న‌ల్గొండ‌లో సినిమాను పూర్తి చేశామ‌ని నిర్మాత విశ్వాస్.హెచ్ తెలిపారు. చిన్న సినిమాలు స‌క్సెస్ అయితేనే ఇండ‌స్ట్రీ బావుంటుంది. నైజాంలో సినిమా విడుద‌లైతే థియేట‌ర్స్ విష‌యంలో నేను నాకు త‌గిన స‌పోర్ట్ చేస్తాని ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ అన్నారు. రేష్మీ ఠాగూర్ చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

తేజారెడ్డి, పూర్ణిమ‌, స‌ర‌యు, ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్‌,వి.ఆర్‌, స‌యుదుల్ గౌడ్‌, రావుశ్రీ, అళ‌హ‌రి, మాస్టర్ శ్రీరామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాకు కెమెరా: న‌ర్సింగ‌రావు య‌మ్‌., మాట‌లు: గోపీకిర‌ణ్‌, ముర‌ళీకృష్ణ‌, డ్యాన్స్: ప్రేమ‌ల‌త‌, ఎడిటింగ్‌: లోకేశ్‌, సంగీతం: జ‌య‌సూర్య‌, నిర్మాతః విశ్వాస్.హెచ్, ద‌ర్శ‌క‌త్వంః అళ‌హ‌రి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved