pizza
Vaadena music launch
`వాడేన' గీతావిష్కరణ
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

21 February 2018
Hyderabad

నిర్మాణి ఫిలిమ్స్ బ్యానర్ పై ఓం సాయి రామ్ సమర్పణలో శివ్‌ తాండేల్, నేహా దేశ్ పాండే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం 'వాడేన'. సాయిసునీల్‌ నిమ్మల దర్శకత్వంలో మణిలాల్‌ మచ్చి అండ్‌ సన్స్‌ నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. బిగ్ సీడీని ఎన్ శంకర్ విడుద‌ల చేయ‌గా, ఆడియో సీడీని మరియు చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కుడు ఎన్ . శంకర్ మాట్లాడుతూ ``ట్రైలర్, సాంగ్స్, రీరికార్డింగ్ బావున్నాయి. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, క్యాచీగా ఉంది. అదే స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్ సినిమాలో ఉంద‌ని భావిస్తున్నాను. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను`` అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ ``సైలెంట్ గా వచ్చి పెద్ద హిట్ కొట్టే సినిమా అవుతుందని భావిస్తున్నాను. 5సాంగ్స్, ఆర్.ఆర్ కూడా బాగానే ఉన్నాయి. ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా కొత్త‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాను. కనుక తప్పకుండా విజయం సాదిస్తుందని ఆశిస్తూ శుభాకంక్షలు తెలియచేస్తున్నాను`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ కిర‌ణ్ మాట్లాడుతూ ``నేను సంగీతం అందించిన తొలి చిత్ర‌మిది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు. వంద శాతం న్యాయం చేశాననే భావిస్తున్నా.. పాటలన్నీ అందరికీ నచ్చాయని ఆశిస్తున్నాను`` అన్నారు

నిర్మాత లో ఒకరైన ధృవ్ మాట్లాడుతూ ``పాటలు బావున్నాయి. డైరెక్ట‌ర్‌గారు సినిమాను చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. తప్పకుండా అందరూ సినిమాను చూసి ఆదరించాలని కోరుతున్నాను`` అన్నారు.

హీరోయిన్ నేహా దేశ్ పాండే మాట్లాడుతూ ``అడ్వెంచర్, ట్రెక్కింగ్ లాంటివి ఈ సినిమాలో చేశాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఈ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు గర్వపడుతున్నా... ప్రోత్సహించిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు సాయి సునీల్ నిమ్మ‌ల మాట్లాడుతూ `` ప్రేక్ష‌కులు సినిమా సెకెండ్ ఆఫ్ చూసి చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌గా ఫీల్ అవుతారు. ఈ సినిమాకు నేను దర్శకత్వం చేయ‌డ‌మే కాకుండా నాలుగు పాట‌లు రాశాను. కొరియోగ్ర‌ఫీ చేశాను. చాలా సినిమాలు చూసి, చాలా మందిని ఇన్‌స్పైరింగ్‌గా తీసుకుని ఈ సినిమా చేశాను. మా సినిమా `వాడేన‌` మంచి కాన్సెప్ట్‌తో రూపొందింది. త‌ప్ప‌కుండా మంచి సినిమా గా నిలిచిపోతుందని నమ్మకంగా చెప్పగలను`` అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

శివ్ తాండేల్‌, నేహా దేశ్ పాండే, అజయ్ గోష్, సూర్య, నల్ల వేణు, చమ్మక్ చంద్ర, చిత్రం శీను, జబర్దస్త్ రాకేష్ అప్పారావు, బాబీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: సి భూమేశ్వర చారి, మాటలు: సాయి సునీల్ నిమ్మల, సి. భూమేశ్వర చారి, పాటలు: కాసర్ల శ్యామ్, సాయి సునీల్ నిమ్మల, ఆర్ ఆర్: రాజేష్.ఎస్, మ్యూజిక్: కిరణ్ వెన్న, కెమెరా: డి ఆర్. వెంకట్, ఎడిటర్: ఎస్.బి ఉద్దవ్, ఫైట్స్: రవి, డాన్స్: ఆర్.కె, నిర్మాత‌లు: మణిపాల్ అండ్ సన్స్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల.


 
Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved