pizza
Vunnadi Okate Zindagi Music Launch
'ఉన్నది ఒకటే జిందగీ' పాటలు విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

13 October 2017
Hyderabad

రామ్‌ హీరోగా అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. స్రవంతి రవికిషోర్‌, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్బంగా..

కొడాలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ''వాటమ్మ వాట్‌ ఈజ్‌ దిస్‌ అమ్మా..అంటూ సాగే పాట, ఆడియెన్స్‌ను అలరిస్తుంది. ఇది ఫ్రెండ్‌ఫిప్‌కు సంబంధించిన సినిమా కాబట్టి ..ఈ నెల 27న విడుదలవుతున్న ఈ సినిమాను అందరూ చూసి ఎంజాయ్‌ చేస్తారని భావిస్తున్నాను'' అన్నారు.

మల్టీ డైమన్షన్‌ వాసు మాట్లాడుతూ - ''వాటమ్మ..వాట్‌ ఈజ్‌ దిస్‌ అమ్మా.. అనే పదం ఈ మధ్య కాలంలో అందరికీ ఊతపదంగా మారిపోయింది. ఈ ఏడాది టాప్‌ టెన్‌ సాంగ్స్‌లో ఈ సాంగ్‌ ఉంటుందనడంలో సందేహం లేదు'' అన్నారు.

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ - ''చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ఓ మంచి రోల్‌ చేశాను. ఆనందంగా ఉంది. మంచి టీంతో పనిచేశాను'' అన్నారు.

అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమా నా జిందగీలో బిగ్గెస్ట్‌ మెమురీ. ఓ యాక్టర్‌గా ఈ సినిమా నాకెంతో హెల్ప్‌ చేసింది. మహా అనే క్యారెక్టర్‌, ఓ పర్సన్‌గా నాలో మార్పును తెచ్చింది. కిషోర్‌ తిరుమలగారు నేను శైలజ చిత్రంలో 'ఐ లవ్‌ యు..బట్‌ ఐ యామ్‌ నాట్‌ లవ్‌ విత్‌ యు' అనే శైలజతో చెప్పించారు. ఈ సినిమాలో మహాతో 'డోంట్‌ వర్రీ తొదరలోనే ఏడుస్తావ్‌..' అని చెప్పించారు. ఈ సినిమాలో నేను డైలాగ్స్‌ చెబుతున్నప్పుడు నా ఆలోచనలను కిషోర్‌గారు మాటల రూపంలో తీసుకొచ్చినట్లు అనిపించింది. రవికిషోర్‌గారు నిర్మాతగా ఎంతో సహకారం అందించారు. సినిమాటోగ్రాఫర్‌గా సమీర్‌గారితో శతమానం భవతి తర్వాత చేసిన సినిమా ఇది. ఇక రామ్‌ను చూస్తే..అయ్యో రామా..! ఇంత ఎనర్జీ ఎలా వస్తుందనిపించింది. అభి అనే క్యారెక్టర్‌ తన కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌ అవుతుంది. శ్రీవిష్ణు వాసు అనే క్యారెక్టర్‌లో జీవించాడు. తనని ఇకపై అందరూ వాసు అనే పిలుస్తారు. దేవిశ్రీగారి అద్భుతమైన సాంగ్స్‌ ఇచ్చారు. లావణ్య, అనీషా సహా అందరికీ థాంక్స్‌'' అన్నారు.

శ్రీ విష్ణు మాట్లాడుతూ - ''ఈ సినిమాలో నేను ఈ కార్యక్టర్‌ చేశానంటే కారణం, డైరెక్టర్‌ తిరుమల కిషోర్‌గారే. తనకు థాంక్స్‌. ఈ సినిమా చేయడం వల్ల రామ్‌, కృష్ణచైతన్య అందరూ మంచి ఫ్రెండ్స్‌ అయ్యారు. షూట్‌కెళ్లే ముందు భయమేసింది. కానీ..షూటింగ్‌ అయిపోతుందనగానే బాధేసింది. పిక్నిక్‌కు వెళ్లినట్లు వెళ్లి ఎంజాయ్‌ చేశాం. దేవిశ్రీగారు అదిరిపోయే సాంగ్స్‌ ఇచ్చారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. సినిమా చూసిన వారందరూ వారి బెస్ట్‌ ఫ్రెండ్స్‌కు ఫోన్‌ చేస్తారు'' అన్నారు.

కిషోర్‌ తిరుమల మాట్లాడుతూ - ''నిర్మాతగా కృష్ణచైతన్య చేస్తున్న తొలి సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది. రవికిషోర్‌గారి ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. రవికిషోర్‌గారు నాపై పెట్టుకున్న నమ్మకం 'నేను శైలజ' సినిమా అయితే..ఆయన నాపై పెట్టుకున్న గట్టి నమ్మకం ఈ 'ఉన్నది ఒక్కటే జిందగీ'. నాపై నమ్మకం ఉంచినందుకు రవికిషోర్‌గారికి థాంక్స్‌. రీరికార్డింగ్‌తో సినిమా చూశాను. సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అనుపమ పరమేశ్వరన్‌ మహా అనే క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించింది. అలాగే లావణ్య, అనీషా చాలా చక్కటి రోల్స్‌ చేశారు. శ్రీవిష్ణును ఈ సినిమాతో వాసు అని పిలుస్తారు. అంతలా తను ఈ క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. రామ్‌తో నేనుశైలజ చేసేటప్పుడు ఆయనకు దగ్గరయ్యాను. ఈ సినిమాలో ఆయనకు సీన్‌ చెబుతున్నప్పుడే ఆయన పెర్ఫామెన్స్‌ను చూసేశాను. ఒక రైటర్‌గా ఏ క్యారెక్టర్‌ను అయినా ఇతను రాయవచ్చు అనేంత ధైర్యం ఇచ్చిన హీరో రామ్‌. మనమెంత బాగా రాస్తే..తను అవుట్‌పుట్‌ అంత బాగా ఇస్తాడు'' అన్నారు.

కృష్ణ చైతన్య మాట్లాడుతూ - ''దేవిశ్రీ ప్రసాద్‌, సమీర్‌గారు సహా టీం అందరికీ థాంక్స్‌, ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ - ''కిషోర్‌గారితో పనిచేయడం ఎప్పటికీ ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. ఆయనతో 'నేను శైలజ' సినిమాకు పనిచేశాను. ఆయన డైలాగ్స్‌లో డిఫరెంట్‌ సెన్సాఫ్‌ హ్యుమర్‌ ఉంటుంది. అనుపమకు చాలా మంచి పేరు వచ్చింది. లావణ్య, అనీషా బాగా నటించారు. వాసు క్యారెక్టర్‌లో శ్రీవిష్ణు సూపర్బ్‌గా చేశాడు. హీరోకు సమానంగా సాగే పాత్ర ఇది. ఈ సినిమా బెస్ట్‌ ఫ్రెండ్స్‌, ఫ్రెండ్‌షిప్‌ కోసం డేడికేషన్‌ చేసేలా సినిమా ఉంటుంది. స్రవంతి మూవీస్‌లో పనిచేయడాన్ని ఎప్పుడూ ఎంజాయ్‌ చేస్తాను. ఎందుకంటే ఆయన బ్యానర్‌లో పనిచేసే నటీనటులు, టెక్నిషియన్స్‌ను గౌరవించే నిర్మాతల్లో ఆయన ఒకరు. చంద్రబోస్‌గారు, శ్రీమణి మంచి సాహిత్యాన్ని అందించారు. వీరిద్దరికీ థాంక్స్‌'' అన్నారు.

హీరో రామ్‌ మాట్లాడుతూ - '''ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమా నా హృదయానికి చాలా చాలా దగ్గరైన సినిమా. దీనికి దేవిశ్రీ, సమీర్‌రెడ్డి, పెద్దనాన్నగారు, డైరెక్టర్‌ కిషోర్‌గారు నాలుగు స్తంభాల్లాగా నిలబడ్డారు. దేవితో పనిచేయడం చాలా ఇబ్బంది..ఎందుకంటే..అతని పని..మనల్ని మాట్లాడనివ్వకుండా చేసేస్తుంది. లవ్‌ యు దేవి. ఇక సమీర్‌రెడ్డిగారు సన్నివేశాన్ని ఫీల్‌ అయ్యి కెమెరా వర్క్‌ను అందిస్తారు. పెద్దనాన్నగారిని చూసే ప్యాషన్‌ అనే పదానికి అర్థాన్ని తెలుసుకున్నాను. ఇక నాలుగోవ్యక్తి కిషోర్‌. సాధారణంగా ఎవరినైనా మనం పొగుడుతాం. కానీ కిషోర్‌ విషయానికి వస్తే, తనను ఎవరైనా పొగిడితే వినాలనిపిస్తుంది. అసలు ఇండస్ట్రీకి ఎందుకొచ్చానని ఈ సినిమాతో నాకు అర్థమైంది. అనుపమతో వర్క్‌ చేయడాన్ని ఎంజాయ్‌ చేస్తూ వచ్చాను. తను అద్బుతమైన నటి. మ్యాగీ పాత్రలో లావణ్య చక్కగా నటించింది. తను నేచురల్‌గా నటించింది. అలాగే అనీషా కూడా చక్కగా నటించింది. శ్రీ విష్ణు, ఈ సినిమాలో నా బెస్ట్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో నటించాడు. కొన్ని సీన్స్‌లో తన నటనతో చింపేశాడు. ఇందులో ఫ్రెండ్‌ ఫిప్‌ అనే ఫ్యాక్టర్‌కు ఆడియెన్స్‌ కనెక్ట్‌ అవుతారు. అక్టోబర్‌ 27న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా అందరిన
ీ సినిమా మెప్పిస్తుంది'' అన్నారు.

స్రవంతి రవికిషోర్‌ మాట్లాడుతూ - ''దర్శకుడు కిషోర్‌ సినిమా కోసం ఏదీ చేసినా తన గుండె లోతుల నుండే చేస్తాడు. దేవిశ్రీ లేకుండా ఈ సినిమా వీలైయ్యేది కాదు. వండర్‌ఫుల్‌ మ్యూజిక్‌ అందించాడు'' అన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved