pizza
Naresh birthday 2018 celebrations
త్వరలోనే విజయకృష్ణ పేరుతో ట్రస్ట్ ఆరంభించి అవసరార్ధులను ఆదుకొంటాను !! - పుట్టినరోజు వేడుకల్లో సీనియర్ నరేష్
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

20 January 2018
Hyderabad

సీనియర్ నరేష్ పుట్టిన రోజు వేడుకలు శనివారం హైదరాబాద్ లోని నానాక్ రామ గూడలోని కృష్ణ నివాసంలో అభిమానులు మరియు 'మా' సభ్యుల నడుమ ఘనంగా జరిగాయి.

ఈ సంధర్బంగా సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, నవీన్ కృష్ణ, మురళి మోహన్, 'మా' ప్రెసిడెంట్ శివాజీ రాజా, "శతమానం భవతి" దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత దిల్ రాజు, నటుడు ప్రదీప్, మరియు ఇతర నిర్మాతలు తదితర ప్రాంతాల నుంచి విచ్చేసిన అభిమానులు పాల్గొన్నారు.

నరేష్ అభిమానులు తెచ్చిన కేకు ను కట్ చేసి ఆ తరువాత కళాకారులను, సీనియర్ అభిమానులను కొందరిని సన్మానించి మొమెంటోలను, సెర్టిఫికెట్ లను ఇచ్చి శాలువాలతో సత్కరించారు.

అనంతరం సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. "నరేష్ కెరీర్ అప్పటి కంటే ఇప్పుడే బూస్ట్ అప్ లో ఉంది. శతమానం భవతి సినిమా దర్శక నిర్మాతలను ఈ సంధర్బంగా సన్మానించుకువడం సంతోషంగా ఉంది. ఒకప్పుడు 4 భాషల్లో ఒకే సంవత్సరంలో 6 సినిమాలు విడుదలై విజయం సాధించాయి. ఇప్పుడు నిర్మాత దిల్ రాజు కూడా ఇదే తరహా విజయాన్ని అందుకున్నారు. అయితే ఒకే భాషలో అవడం విశేషం. ఇక నరేష్ ఇలానే ప్రతి ఏటా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ఇంకా మంచి పేరు సంపాందించుకోవాలని ఆశీర్వదిస్తున్నా" అన్నారు.

విజయ నిర్మల మాట్లాడుతూ.. "పాత్రలకు తగ్గట్టు బాడీ ల్యాంగువేజ్ ను మలచుకునే నటుడు నరేష్. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా మరో వైపు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇదే విధంగా ముందుకుసాగాలని కోరుకుంటున్నా" అన్నారు.

నరేష్ మాట్లాడుతూ.. "అప్పుడే 50 సంవత్సరాలు అయిపోయాయంటే నమ్మేలా లేదు. ఈ కెరీర్ మొత్తం సజావుగా సాగిపోయింది. నా తల్లి దండ్రుల సమక్షంలో ఇలా ప్రతి ఏటా నా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. మా ఘట్టమనేని ఫ్యామిలీ ప్రతి ఒక్కరితో మమేకం.. నాకు ఇన్ని సంవత్సరాలుగా మంచి పాత్రలు ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి దర్శక నిర్మాతలకీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా. ప్రేక్షకులకు వినోదాన్ని, ప్రేమను పంచడం, సేవ చేయడం నా ద్యేయంగా పెట్టుకున్నా. నటుడిగా ఎస్వీయార్ స్ఫూర్తి. డైనమిజం కృష్ణగారి నుంచి నేర్చుకున్నా. జంధ్యాల నాకు గురువు. విజయ కృష్ణ పేరుతో తొందర్లో ట్రస్ట్ ను ప్లాన్ చేయనున్నాము" అన్నారు.



 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved