pizza
Angel team celebrates success with orphans
అనాధ పిల్లలతో  ఆనందాన్ని పంచుకున్న ఏంజిల్ టీమ్..
You are at idlebrain.com > News > Functions
Follow Us

4 November 2017
Hyderabad

నాగ అన్వేష్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్స్ గా నటించిన సోసియో ఫాంటసీ చిత్రం ఏంజిల్ చిత్రం నవంబర్ 3న విడుదలయ్యి ప్రేక్షకాదరణ పొంది, విజయం వైపు దూసుసుకెళుతున్న సందర్భంగా ఏంజిల్ చిత్ర యూనిట్ సికింద్రాబాద్ కార్ క్కానా లోని సర్వే నీడి అనాదఆశ్రమంలో లోని అనాధ పిల్లల నడుమ తమ విజయోత్సాహాన్ని పంచుకున్నారు ఏంజిల్ బృందం. 28 మంది అనాధ పిల్లల ఆట పాటల నడుమ వారు కూడా చిన్నపిల్లలై మైమరచిపోయారు. అనంతరం అక్కడి ప్రాజెక్ట్స్, సేవాకార్యక్రమాల గురుంచి తెలుసుకొని గౌతమ్ కుమార్ వారికి చేస్తున్న సేవా పనులను ప్రశంసించారు. అనాధ పిల్లలతో కూర్చొని వారికి పండ్లు, స్వీట్స్, భోజనం తామే స్వయంగా వడ్డించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. సినీ రంగంలో ఎప్పుడూ బిజీగా ఉండే మాకు ఈ రోజు ఇలా వీరందరితో గడపడం ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందని హీరో నాగ అన్వేష్ తెలియ పరిచారు. సినిమా సక్సెస్ ను ఇలా అనాధ పిల్లలతో పంచుకోవడం వారికే కాదు వీరి అభిమానులకు ఆనందాన్ని కలిగించింది.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved