pizza
Venkatapuram first look launch
'వెంకటాపురం' ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

1 December 2016
Hyderaba
d

రాహుల్‌, మహిమా మక్‌వానా హీరో హీరోయిన్స్‌గా గుడ్‌ సినిమా గ్రూప్‌, బాహుమన్య ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై వేణు మడికంటి దర్శకత్వంలో శ్రేయాస్‌ శ్రీనివాస్‌, తూము ఫణికుమార్‌ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'వెంకటాపురం'. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌ లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి, హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ మారుతి, ప్రముఖ దర్శకుడు బాబీ, ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్‌, మల్టీడైమన్షన్‌ వాసు, చిత్ర దర్శకుడు వేణు మడికంటి, చిత్ర నిర్మాతలు శ్రేయాస్‌ శ్రీనివాస్‌, తూము ఫణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్‌ సభ్యులు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు ఎం.పి. వివేక్‌ మాట్లాడుతూ - ''మూవీ మేకింగ్‌ ఎంత కష్టమైందో నాకు తెలుసు. ఇంత త్వరగా ఓ మంచి టీంను ఏర్పరిచి ఓ మంచి సినిమాను రూపొందించారు. సినిమాను ప్రారంభించడం, త్వరగా పూర్తిచేయడం విడుదలకు తీసుకురావడం గొప్ప విషయం. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన వెంకటాపురం సినిమా పెద్ద హిట్‌ కావాలి. ఇలాగే భవిష్యత్‌లో మరిన్ని మంచి సినిమాలను రూపొందించాలని కోరుకుంటూ దర్శక నిర్మాతలు సహా యూనిట్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ''శ్రీనివాస్‌గారు, మారుతిగారు అందరూ కలిసి ఓ టీంలా ఏర్పడి గుడ్‌ సినిమా గ్రూప్‌ను ఏర్పరిచారు. ఐదేళ్ల క్రితం ఈ బ్యానర్‌లో వచ్చిన ఈరోజుల్లో వంటి సంచలనమైన సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో మనకు తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌తో ఇండస్ట్రీని తమ వైపుకు తిప్పుకున్నారు. గుడ్‌ సినిమా బ్యానర్‌లో వచ్చిన చిన్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధించాయి. ఇలాంటి సంస్థ నుండి ఇప్పుడు వస్తున్న వెంకటాపురం కూడా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - ''సినిమా ఎవరు చేశారో, తీశారో చూడకుండా, సినిమా బావుంటే అందరూ సినిమాను చూసి పెద్ద హిట్‌ చేస్తున్నారు. ఈ మధ్య కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలన్నీ అలా విజయాన్ని సాధించినవే. కంటెంట్‌ ప్రధానంగా రూపొందిన వెంకటాపురం సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుతూ యూనిట్‌కు అభినందనలు తెలుపుతున్నాను'' అన్నారు.

Mahima Makwana Glam gallery from the event

 

ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ - ''సినిమా నిర్మాతలు ఇంకా మరిన్ని మంచి సినిమాలు చేస్తూ పెద్ద నిర్మాతలుగా మారాలని, సమాజానికి తమ సినిమాలతో వినోదాన్నే కాదు, మేసేజ్‌ను కూడా అందించాలని భావిస్తూ ఎంటైర్‌ టీంకు అభినందనలు'' అన్నారు.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ - ''ఈ సంస్థ మంచి ఆశయాలతో ఏర్పడింది. అందుకే దీన్ని గుడ్‌ సినిమా గ్రూప్‌ అంటున్నారు. పోస్టర్‌, టీజర్‌ బావున్నాయి. కాబట్టి సినిమా కూడా బావుంటుందని భావిస్తున్నాను'' అన్నారు.

హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ మారుతి మాట్లాడుతూ - ''ఐదేళ్ల క్రితం ఈ గుడ్‌ సినిమా గ్రూప్‌ బ్యానర్‌ను స్టార్ట్‌ చేశాం. శ్రీనివాస్‌ నాకు మంచి మిత్రుడు. శ్రీనివాస్‌ తన ఫ్రెండ్‌తో కలిసి ఈ సినిమాను చేశారు. సినిమా పెద్ద హిట్‌ కావాలి. అలాగే దర్శకుడు వేణులో మంచి సినిమా నాలెడ్జ్‌ ఉంది. మంచి టాలెంటెడ్‌ ఉన్న డైరెక్టర్‌. మంచి కంటెంట్‌తో కూడిన థ్రిల్లింగ్‌ పాయింట్‌తో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. దర్శకుడు వేణుకు మంచి పేరుని తెచ్చే సినిమాగా, నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చే సినిమాగా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

హీరోయిన్‌ మహిమ మక్‌వానా మాట్లాడుతూ - ''నటిగా ఎలా నటించాలో దర్శకుడు నాకు బాగా ట్రైనింగ్‌ ఇప్పించారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన శ్రేయాస్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ''డిసెంబర్‌ మొదటి వారంలో సినిమా ఆడియో విడుదల చేసి డిసెంబర్‌ ఆఖరి వారంలో కానీ, జనవరిలోకానీ లేదా సంక్రాతికి పండుగకు కానీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్‌ చేస్తున్నాం. మంచి కథ, కాన్ఫిడెంట్‌గా ఉన్నాం'' అన్నారు.

హీరో రాహుల్‌ మాట్లాడుతూ - ''నిర్మాతలు మేకింగ్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు.అలాగే దర్శకుడు మంచి కథతో ఈ సినిమాను రూపొందించారు. మంచి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. దర్శకుడు కథ చెప్పగానే నచ్చింది. మంచి స్క్రీన్‌ప్లే ఉన్న సబ్జెక్ట్‌. నటనకు మంచి స్కోప్‌ ఉంది. అకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.

దర్శకుడు వేణు మడికంటి మాట్లాడుతూ - ''కథ వినగానే నిర్మాతలు శ్రీనివాస్‌, ఫణిగారు సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. మంచి టీంను ఇచ్చారు. అలాగే హీరో హీరోయిన్స్‌, మిగిలిన టెక్నిషియన్స్‌ అందరూ ఎంతో సపోర్ట్‌ చేశారు. అందరి సహకారంతో సినిమా అవుట్‌పుట్‌ అనుకున్న విధంగా వస్తుంది'' అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్‌ను అభినందించారు.

రాహుల్‌, మహిమ మక్‌వానా హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో అజయ్‌, అజయ్‌కుమార్‌, కాశీవిశ్వనాథ్‌, జోగినాయుడు, కోటేశ్వరుడు, అనితానాథ్‌, శ్రీనివాసరావు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌: అచ్చు, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్‌ ఉమ్మడి సింగు, సాహిత్యం: అనంత శ్రీరాం, వనమాలి, ఎడిటింగ్‌: మధు, ఫైట్స్‌: రీల్‌ సతీష్‌; ఆర్ట్‌: జె.మోహన్‌, సహ నిర్మాత: ఉమాదేవి కూనపురాజు, నిర్మాతలు: శ్రేయాస్‌ శ్రీనివాస్‌, తూము ఫణికుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేణు మడికంటి.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved