pizza
Rajendra Prasad condolences to Jayalalitha
అమ్మ‌కు తెలుగంటే మ‌హా ఇష్టం - `మా` అధ్య‌క్షులు డా.రాజేంద్ర ప్ర‌సాద్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

6 December 2016
Hyderaba
d

అమ్మ జ‌య‌ల‌లిత త‌మిళుల‌కే కాదు.. తెలుగువారికి ఆత్మీయురాలు.. త‌న‌కి తెలుగంటే మ‌హా ఇష్టం. ఎంతో బాగా మాట్లాడుతారు. న‌టిగా మాకు అమ్మ వంటి వారు.. అనీ `మా`అసోసియేష‌న్ అధ్య‌క్షులు డా.రాజేంద్ర ప్ర‌సాద్ అన్నారు. `మా` కార్యాల‌యంలో

డా.రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ -``అమ్మ జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడు గౌర‌వ ముఖ్య‌మంత్రి.. అంత‌కు ముందు సినిమాల్లో క‌థానాయిక‌. త‌ను ఓ స్త్రీ శ‌క్తి.. క‌థానాయ‌కులు ఎంజీఆర్‌, ఎన్టీఆర్ ..డోనాల్డ్ రీగ‌న్ లాంటి వాళ్లంతా ప్ర‌జానాయ‌కులుగా ఎదిగిన‌వారు. వీళ్ల‌లానే క‌థానాయిక‌లు రాజ‌కీయాల్లో ఎదుగుతారు అని నిరూపించిన గొప్ప‌ నాయ‌కురాలు. ఆరుసార్లు ముఖ్య‌మంత్రి అయిన గొప్ప ధీర‌ వ‌నిత‌. నిజ‌మే మ‌నిషి ఒంట‌రిగానే పుడ‌తారు. ఒంట‌రిగానే పోతారు. అది వారిని చూస్తే తెలుసుకోవాల్సిన నిజం. చివ‌రికి వెళ్లిపోయిన‌ప్పుడు ఎంత‌మంది మ‌న‌తో ఉన్నారు? అనేది ఆలోచిస్తే .. కంట్రోల్ చేయ‌లేనంత‌మంది జ‌నం ఆవిడ‌ను క‌డ‌సారి చూసేందుకు వ‌స్తున్నారంటే ..అమ్మ‌పై ప్ర‌జ‌ల ప్రేమ ఎంతో తెలుస్తోంది. ప్ర‌తి ఒక్క‌రూ సొంత మ‌నిషిగా అభిమానించే ఏకైక మ‌హిళ తాను మాత్రమే. జ‌య‌ల‌లిత హ‌ఠాన్మ‌ర‌ణం ఎంతో తీర‌ని లోటు.. తమిళుల‌కే కాదు.. తెలుగువారికి ఆత్మీయురాలు. ఆమెకు తెలుగంటే ఎంతో ఇష్టం. తెలుగు ఎంతో బాగా మాట్లాడుతారు. నేను జ‌య‌ల‌లిత గారికి వీరాభిమానిని. నా అంత అభిమాని వేరొక‌రు ఉంటార‌ని అనుకోను. పోరాటాల నుంచి విజ‌యాల్ని చూసిన ధీర‌వ‌నిత ఆవిడ‌. సినీన‌టిగా ఆవిడ మాకు అమ్మ‌.. క‌డుపున పుట్ట‌క‌పోయినా ఆవిడ‌కు నేను బిడ్డ‌ను. నా త‌ల్లి చ‌నిపోయిన సంద‌ర్భంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ త‌ర‌పున .. ఇంట్లో మ‌నిషి వెళ్లిపోయారు కాబ‌ట్టి సంబంధిత కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం. క‌ష్టంలోనూ పోరాడాలి.. అనేది ఓ మ‌హిళ‌గా అమ్మ‌ నేర్పారు. ప్ర‌తిఒక్క‌రూ అది అనుస‌రించాలి. 68 ఏళ్ల‌కే అంటే తొంద‌ర‌గానే వెళ్లిపోయారు. పోయినోళ్లంతా మంచి వాళ్లు .. ఉన్నోళ్ల‌కు పోయిన‌వాళ్లు తీపి గురుతులుగా భావించి మిమ్మ‌ల్ని ఎప్ప‌టికీ మ‌రువ‌లేం. మ‌రిచిపోలేని మ‌హాద్భుత శ‌క్తి. ఆడాళ్ల శ‌క్తి ఎంత గొప్ప‌దో తెలియ‌జెప్పిన జ‌య‌ల‌లిత గారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్నాను`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved