pizza
Torch Light movie launch
టార్చిలైట్ నూతన చిత్రం ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 November 2017
Hyderaba
d

చంద్ర కళ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి చంద్ర కళ సమర్పించు చిత్రం "టార్చిలైట్". సూర్య శ్రీనివాస్, ఆశ్లేష, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటించనున్న ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవం శనివారం ఉదయం ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిదానంలో పూజా కార్యక్రమాలు జరుపుకున్న అనంతరం క్లాప్ మా అధ్యక్షుడు శివాజీ రాజా ఇవ్వగా, కెమెరా స్విచ్ డి.వి. మరియు సురేష్ కొండేటి చేయగా, గౌరవ దర్శకత్వం సాగర్ వహించారు..

ఈ సందర్భంగా దర్శకుడు వరప్రసాద్ మాట్లాడుతూ... ఇది నా 5 వ సినిమా. ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా రవి బాబు చేస్తున్నారు. డిసెంబర్ రెండవ వారం నుంచి చిత్ర షూటింగ్ మొదలుకానుంది. వైజాగ్, హైదరాబాద్, శ్రీకాకుళం తదితర పరిసర ప్రాంతాల్లో జరుకోనుంది.. సింగల్ షెడ్యుల్ లో షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదల చేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు..

హీరో సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. హారర్ జోనర్ చిత్రమిది. షూట్ త్వరగా పూర్తి చేసి అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తాం అని చెప్పారు. హీరోయిన్స్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు సంతోషంగా ఉన్నాం. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు మా కృతజ్ఞతలు అని చెప్పారు..

సంగీత దర్శకుడు దేవేంద్ర మాట్లాడుతూ.. ఈ చిత్రంలో 5 పాటలు ఉంటాయి అందులో మెలోడీ సాంగ్స్, ఐటమ్ సాంగ్, రెండు బిట్ సాంగ్స్ ఉన్నాయి అని చెప్పారు..

సూర్య శ్రీనివాస్, ఆశ్లేష, ప్రియాంక, రవిబాబు మొదలగువారు నటించనున్న ఈ చిత్రానికి సాంకేతిక వర్గం.. డీఓపీ: ఇ. ఎస్. హెచ్. ప్రసాద్, మ్యూజిక్: దేవేంద్ర, ఎడిటర్: వి. నాగి రెడ్డి, డైలాగ్స్: సుబ్బారాయుడు, నిర్మాతలు: మాస్టర్ ఆర్. మనోజ్ సాయి శ్రీరామ్, మాస్టర్ ఆర్. శ్రీరామ్ అజయ్, సాయి లక్ష్మీ, కో ప్రొడ్యూసర్స్: మంగు నూరు ఆంజనేయులు, ముద్దం రామచంద్రుడు, వాని చౌదరి, డైరెక్టర్: వరప్రసాద్.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved