pizza
East Coast productions production no. 2 movie launch
క‌ల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 April 2018
Hyderabad

Actor Kalyan Ram’s upcoming film co-starring Nivetha Thomas and Shalini Pandey was launched at Ramanaidu Film Studios in Hyderabad on Wednesday. Directed by K.V. Guhan, the film is a production of Mahesh Koneru. The muhurat of the film was attended by the actor’s younger brother NTR who sounded the clap, while father Harikrishna switched on the camera. Nandamuri Ramakrishna did the honorary direction for the film’s first scene.

Speaking at the occasion, director K.V. Guhan said, “I am quite excited to be working on a film with such an interesting cast and production team. This is a suspense thriller and the script has come out really well.”

Producer Mahesh Koneru said, “After Naa Nuvve with Kalyan Ram garu in our banner, I am quite glad that we are working on a second film again, even as the first film is set to release soon. Guhan garu’s script impressed everyone and we gave a not soon enough. From May 2, the film’s regular shoot will begin. Music composer Sekhar Chandra has proved his mettle in composing for thrillers and we have roped him in to add value to out film.”

Shalini shared, “This is my second film in Telugu and I am glad that it’s in such an interesting genre.”

Nivetha stated, “Guhan garu narrated the script to me in Tamil. I have been away from Telugu films for a while now, and I am glad to be coming back with this film. I have known Mahesh garu from very long and I am quite happy to be working with him.”

Composer Sekhar Chandra said, “The film’s genre being that of a suspense thriller, I find great scope for music and will give it my best.”

క‌ల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్, నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం బుధ‌వారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ కోనేరు సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహుర్త‌పు స‌న్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్ కొట్ట‌గా నంద‌మూరి హ‌రికృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నంద‌మూరి రామ‌కృష్ణ తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో...

కె.వి.గుహ‌న్ మాట్లాడుతూ - ``క‌ల్యాణ్ హీరోగా మ‌హేశ్ కోనేరుగారి నిర్మాణంలో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ఇదొక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. స్క్రిప్ట్ చాలా బాగా వ‌చ్చింది`` అన్నారు.

నిర్మాత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ - ``క‌ల్యాణ్ రామ్‌గారితో మా బ్యాన‌ర్‌లో `నా నువ్వే` సినిమా చేశాం. అది త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఆ సినిమా విడుద‌ల‌య్యే లోపు క‌ల్యాణ్‌రామ్‌గారితోనే రెండో సినిమాను నిర్మించ‌నుండ‌టం ఎంతో ఆనందంగా ఉంది. గుహ‌న్‌గారు చెప్పిన స్క్రిప్ట్ మాకు న‌చ్చింది. అలాగే క‌ల్యాణ్‌రామ్‌గారికి కూడా న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఆయ‌న ఒప్పుకున్నారు. మే 2 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు శేఖ‌ర్ చంద్ర‌గారు చాలా మంచి సంగీతాన్ని అందిస్తార‌నే సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మా సినిమాకు సంగీతం అందించ‌నుండ‌టం హ్యాపీగా ఉంది`` అన్నారు.

షాలిని పాండే మాట్లాడుతూ ``తెలుగులో నా రెండో సినిమా. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. సినిమాలో భాగం కావ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

నివేదా థామ‌స్ మాట్లాడుతూ - ``గుహ‌న్ గారు స్క్రిప్ట్‌ను త‌మిళంలో వినిపించారు. తెలుగు సినిమాలకు ఆరు నెల‌లు దూరంగా ఉన్నాను. నిర్మాత మ‌హేశ్‌గారితో చాలా కాలంగా అనుబంధం ఉంది. ఆయ‌నతో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

శేఖ‌ర్ చంద్ర మాట్లాడుతూ -``స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్... మ్యూజిక్‌కి మంచి స్కోప్ ఉన్న సినిమా`` అన్నారు.



Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved