pizza
Vitalacharya movie launch
`విఠ‌లాచార్య‌` మొద‌లైంది
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 June 2017
Hyderabad

డా. న‌రే్శ్ వి.ఎ., న‌వీన్ విజ‌య కృష్ణ‌, అనీష ఆంబ్రోస్‌, ఇంద్ర‌జ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న సినిమా `విఠ‌లాచార్య‌`. సుహాస్ మీరా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎస్‌.కె.విశ్వేశ్‌బాబు, కె.ఎస్‌.టి.యువ‌రాజ్‌, యం.వి.కె.రెడ్డి నిర్మాత‌లు. ఈ సినిమా ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్‌లో గురువారం ఉద‌యం జ‌రిగింది. ముహూర్త‌పు స‌న్నివేశానికి కృష్ణ క్లాప్‌నిచ్చారు. విజ‌య‌నిర్మ‌ల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బి.గోపాల్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమా బ్రోచ‌ర్స్ ను కోదండ‌రామిరెడ్డి విడుద‌ల చేసి కృష్ణ‌కు అందించారు.

విజ‌య‌నిర్మ‌ల మాట్లాడుతూ ``టైటిల్ చాలా బావుంది. విఠ‌లాచార్య చాలా గొప్ప ద‌ర్శ‌కులు. ఆయ‌న పేరుతో పెట్టిన టైటిల్ చాలా బావుంది. మా త‌ర‌త‌రాలు న‌టీన‌టులుగా కొన‌సాగుతారు. మా పెద్ద మ‌న‌వ‌డితో పాటు చిన్న‌మ‌న‌వ‌డు కూడా ఇందులో న‌టిస్తున్నాడు`` అని చెప్పారు.

కృష్ణ మాట్లాడుతూ ``నేను విఠ‌లాచార్య ద‌గ్గ‌ర ఇద్ద‌రు మొన‌గాళ్లు అనే సినిమాకు ప‌నిచేశాను. ఆయ‌న చాలా హిట్ చిత్రాల‌ను తీశారు. స‌క్సెస్‌కి నాంది ప‌లికే సినిమా ఇది. న‌రేశ్‌, న‌వీన్ క‌లిసి చేస్తున్నారు. ఈ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను`` అని అన్నారు.

సుహాసి మాట్లాడుతూ ``అవ‌కాశం ఇచ్చిన వారికి ధ‌న్య‌వాదాలు. నేను ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావుగారి ద‌గ్గ‌ర ర‌చ‌న‌లోనూ, గుణ‌శేఖ‌ర్‌గారి ద‌గ్గ‌ర టెక్నిక‌ల్‌యాస్పెక్ట్స్ నేర్చుకున్నాను`` అని అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ ``సినిమా పెద్ద హిట్ కావాలి. వైవిధ్యంగా ఉంటుంది`` అని చెప్పారు.

ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ ``సుహాసి నాకు చెప్పిన వాటిల్లో మంచి స్టోరీ ఇది`` అని తెలిపారు.

అనీషా ఆంబ్రోస్ మాట్లాడుతూ ``మంచి పాత్ర‌లో చేస్తున్నందుకు ఆనందంగా ఉంది`` అని అన్నారు.

న‌వీన్ మాట్లాడుతూ ``నా కెరీర్ జ‌స్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. భవిష్య‌త్తులో నా సినిమాల‌ను చూసి గ‌ర్వ‌ప‌డేలా క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటాను. సుహాస్ చాలా మంచి క‌థ చెప్పారు`` అని తెలిపారు.

న‌రేశ్ మాట్లాడుతూ ``వైవిధ్య‌మైన స్క్రిప్ట్ ఇది. ప్ర‌తి సీనూ ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌తి పాత్రా ప్రాముఖ్య‌త ఉన్న‌దే. ఇందులో నా ఇద్ద‌రు కుమారులు న‌టిస్తున్నారు. మాస్‌, ఫ్యామిలీ, యూత్‌, కాన్సెప్ట్ ఇది. ఇందులో మా అమ్మ‌గారు కూడా న‌టిస్తున్నారు`` అని చెప్పారు.

పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, రాజా ర‌వీంద్ర‌, సితార‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, శివ‌న్నారాయ‌ణ‌, గిరిధ‌ర్‌, మ‌ధు నంద‌న్‌, తాగుబోతు ర‌మేశ్‌, జోగి కృష్ణంరాజు త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు. ఈ సినిమాకు కెమెరా: దాశ‌ర‌థి శివేంద్ర‌, సంగీతం: స‌త్య క‌శ్య‌ప్‌, ఎడిట‌ర్‌: కార్తికా శ్రీనివాస్‌, ఆర్ట్: వినోద్ వ‌ర్మ‌, స్టంట్స్: జాషువా, డాన్స్: నిక్స‌న్‌, యాని, పాట‌లు: పూర్ణాచారి.

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved