pizza
Chalo pre release function
`ఛ‌లో` ప్రీ రిలీజ్ వేడుక‌
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

25 January 2018
Hyderabad

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్‌గా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న చిత్రం 'ఛలో'. ఈ చిత్రం టీజర్‌కి, ట్రైలర్‌కి సోషల్‌ మీడియాలో హైయ్యస్ట్‌ వ్యూస్‌ వస్తున్నాయి. మహతి స్వర సాగర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని 'చూసి చూడంగానే' పాట సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. అన్ని పాటలు మంచి హిట్‌ అవడంతో మ్యూజికల్‌గా ఈ చిత్రం పెద్ద హిట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జనవరి 25న హైదరాబాద్‌ యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవ్వగా, ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, నందినిరెడ్డి, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌, సంగీత దర్శకులు మహతి స్వర సాగర్‌, కళ్యాణి మాలిక్‌, నటి ప్రగతి, చిత్ర యూనిట్‌ సభ్యులంతా పాల్గొన్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ - ''ఈ ఫంక్షన్‌కి నేను రావడం ఏంటి అని అందరికీ అన్పించొచ్చు. నాగశౌర్య నన్ను కలవాలని చాలాసార్లు ఫోన్‌ ద్వారా మా ఆఫీస్‌కి కాంటాక్ట్‌ చేశాడు. నేను అందుబాటులో లేక రెస్పాండ్‌ కాలేకపోయాను. మళ్ళీ మళ్ళీ ఫోన్‌ చేస్తే ఎందుకో? ఏమిటోనని రమ్మన్నాను. వారి అమ్మగారితో మా ఇంటికి వచ్చారు. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చేస్తున్నాం. మీ సమక్షంలో జరగాలి. తప్పకుండా రావాలని అడిగాడు. ఒక్క నిమిషం ఆలోచించకుండా నాగశౌర్యకి వస్తాను అని చెప్పాను. దీనికి కారణం ఒక్కసారి గతంలోకి వెళ్లాలి. నా కెరీర్‌ బిగినింగ్‌ స్టేజ్‌లో ఆ రోజుల్లో నా సినిమా హండ్రెడ్‌ డేస్‌ ఫంక్షన్‌కి నేను అభిమానించే ఓ పెద్ద స్టార్‌ వస్తే బాగుంటుంది. ఆ ఉత్సాహం, ప్రోత్సాహం వేరు అని అడిగితే.. ఆయన బిజీగా రాలేని పరిస్థితి వుండి రాలేకపోతున్నాను.. ఏమీ అనుకోవద్దు అని చెప్పడం జరిగింది. కానీ ఆయన లేకుండా ఆ ఫంక్షన్‌ తూతూ మంత్రంగా చేసుకున్నాం. ఆరోజు నాకు చాలా డిజప్పాయింట్‌గా అన్పించింది. ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడు నాగశౌర్యలో నన్ను నేను చూసుకున్నాను. నన్ను రమ్మని కోరుతున్నాడు అంటే ఆ ఉత్సాహం, ఆ ప్రోత్సాహం వేరు కాబట్టి నాగశౌర్యకి ప్రోత్సాహం ఇవ్వాలి. అతన్ని ఉత్సాహ పర్చాలి. ఒక ఆర్టిస్ట్‌గా ఎంత మోటివేట్‌ చేస్తుంది అనేది నాకు తెల్సు. నేను చవి చూశాను. అలాంటి ఫీలింగ్‌ నాగశౌర్యకి ఇవ్వాలి అని వెంటనే వస్తానని చెప్పటంతో చాలా ఆనందించాడు. నాగశౌర్య సినిమాలు పెద్ద స్క్రీన్‌ మీద ఏదీ చూడలేదు. మా నిహారికతో చేసిన సినిమా టీవిలో చూశాను. చాలా హ్యాండ్‌సమ్‌గా వున్నాడు. స్పార్క్‌గా వున్నాడు. మంచి పర్సనాల్టీతో బావున్నాడు. ఇలాంటి హీరోలు ఖచ్చితంగా ఇండస్ట్రీకి రావాలి, కావాలి. అప్పుడే ఇండస్ట్రీకి ఒక ఫ్రెష్‌నెస్‌, కొత్త ఉత్సాహం వుంటుంది. నాగశౌర్యలాంటి నటులు ఇండస్ట్రీకి వస్తే ఫ్రెష్‌నెస్సే కాదు కొత్త రక్తం కూడా ఇండస్ట్రీకి వచ్చినట్లుగా వుంటుంది. ఒలింపిక్‌ గేమ్స్‌కి వెళ్లే ఆటగాళ్ళలో వన్‌వీక్‌ ముందు రక్తం డొనేట్‌ చేస్తారు. ఆ తర్వాత కొత్త రక్త కణాలతో ఫ్రెష్‌నెస్‌ వస్తుంది. అప్పుడు స్పోర్ట్స్‌ పర్సన్స్‌కి వచ్చే నూతన ఉత్సాహం వేరు. ఒలింపిక్స్‌లో కొత్త ఉత్సాహంతో ప్లేయర్స్‌ ఎలా పరుగెడతారో అదేరకంగా ఈ పరిశ్రమకి నాగశౌర్యలాంటి కొత్త నటులు కావాలి. రెండు మూడు సంవత్సరాలుగా చూస్తే పెద్ద హీరోల సినిమాలు ఎంత హిట్‌ అయ్యాయో యంగ్‌ హీరోస్‌ చిత్రాలు కూడా అంతకంటే హిట్‌ అయ్యాయి. ఇది చాలా హెల్దీ వాతావరణం. 'ఉయ్యాలా జంపాలా' 'పెళ్ళి చూపులు', 'అర్జున్‌ రెడ్డి' 'ఊహలు గుసగుసలాడే', 'శతమానం భవతి' 'ఫిదా', అలాగే ఈమధ్య రిలీజ్‌ అయిన 'హలో' ఇవన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందాయి. కొత్తవారిని అక్కున చేర్చుకుని ఇండస్ట్రీలో మంచి స్థానాన్ని ఇచ్చే గొప్ప మనసున్న ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు. 'ఛలో' కూడా పెద్ద స్థాయిలో విజయం సాధించాలని నాగశౌర్య కెరీర్‌లో 'ఛలో' బెస్ట్‌ సినిమాగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 'ఛలో' ట్రైలర్‌ చూశాక ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌లో జరిగే ప్రేమకథా చిత్రంలా కన్పిస్తుంది. బోర్డర్‌లో జనరల్‌గా ఉద్రిక్త వాతావరణం వుంటుంది. అలాంటి వాతావరణంలో యాక్షన్‌ డ్రమెటిక్‌ సీన్స్‌కి, రెండు భాషల వారి మధ్య జరిగే సన్నివేశాలు అద్భుతంగా వుంటాయి. ట్రైలర్‌ చూడగానే ఈ సినిమా ఎంత త్వరగా చూడాలా అని నాకు అన్పించింది. ఈ సినిమా ఖచ్చితంగా అందర్నీ అలరించే సినిమా అవ్వాలని శంకర్‌ ప్రసాద్‌, గౌతం, ఉషగారికి వారి బేనర్‌లో మంచి సినిమాగా నిలవాలని ఆశిస్తున్నాను. వెంకీ కుడుముల ఒక డైరెక్టర్‌లా కన్పించలేదు. అభిమానుల్లో ఒకడిగా అన్పించాడు. తన ఎమోషన్‌ చూస్తుంటే నా అభిమాని ఒక డైరెక్టర్‌ అయ్యాడు. ఈ సినిమా అందర్నీ అలరించి సూపర్‌డూపర్‌ హిట్‌ అవ్వాలని కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు విజయం పరిశ్రమకి అవసరం. అందరూ సినిమా చూసి ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా'' అన్నారు.

ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''వెంకీ ఫస్ట్‌ సినిమా ఇది. ట్రైలర్‌ చూశాక ఎంత కాన్ఫిడెంట్‌తో తీశాడో అర్థం అవుతుంది. సాగర్‌ ఫెంటాస్టిక్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. నాగశౌర్య సినిమాలు చూశాను. మూడు సినిమాలు చాలా ఇష్టం. ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మంచి ప్లేస్‌ సంపాదించుకున్నాడు. ఆ ప్లేస్‌ రావాలంటే చాలా కష్టం. నాగశౌర్యలాంటి ఫ్యామిలీ వున్న వారందరూ అదృష్టవంతులే. కథ నచ్చి ప్యాషన్‌తో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా మంచి హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా'' అన్నారు.

ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ - ''చిరంజీవిగారు యంగ్‌స్టర్స్‌ని బ్లెస్‌ చేస్తే ప్రతి ఒక్కరూ సక్సెస్‌ అయ్యారు. అలాగే ఇప్పుడు మా నాగశౌర్యని బ్లెస్‌ చెయ్యడానికి మెగాస్టార్‌ వచ్చారు. ఈ సినిమాకి అన్ని శుభసూచకాలే. రిలీజ్‌కి ముందే సక్సెస్‌ టాక్‌ సంపాదించుకుంది. ఈ సినిమా మ్యూజికల్‌గా చాలా హిట్‌ అయ్యింది. డెఫినెట్‌గా సాగర్‌కి చాలా మంచి భవిష్యత్‌ వుంది. సినిమా చూశాను. చాలా బాగుంది. డైరెక్టర్‌ వెంకీ బాగా తీశాడు. ప్రతి ఒక్కరూ మా సినిమా అని ఫీలై వర్క్‌ చేశారు. 'ఛలో' సూపర్‌హిట్‌ అవుతుంది'' అన్నారు.

సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్‌ మాట్లాడుతూ - ''ఐరా క్రియేషన్స్‌లో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. శౌర్య బ్రదర్‌లా ట్రీట్‌ చేశారు. శంకర్‌ ప్రసాద్‌, ఉషాగారు ఎంతో సపోర్ట్‌ చేశారు. వెంకీ గ్రేట్‌ ఫ్రెండ్‌. సినిమాని ఎక్స్‌ట్రార్డినరీగా తీశారు. హండ్రెడ్‌ పర్సెంట్‌ జాబ్‌ శాటిస్‌ఫ్యాక్షన్‌ ఇచ్చింది. ఈ చిత్రం నాగశౌర్య సినిమాలో ఇరగదీశాడు. ఎక్‌ట్రార్డినరీగా చేశాడు. 'ఛలో' బిగ్‌ సక్సెస్‌ అవుతుంది'' అన్నారు.

చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ - ''చిరంజీవిగారికున్న ఫ్యాన్స్‌, భక్తుల్లో నేను ఒకడ్ని. 'ఇంద్ర', 'ఠాగూర్‌' ఎన్నో సినిమాలకి కటౌట్‌లు కట్టాను. ఆయన కలిసే అవకాశం రాలేదు. మా సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో కలుస్తానని అస్సలు ఊహించలేదు. ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని అయిన నన్ను డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇచ్చిన ఐరా క్రియేషన్స్‌కి, నాగశౌర్యకి థాంక్స్‌. శంకర్‌ ప్రసాద్‌, ఉషగారు లేకపోతే ఈ సినిమా వచ్చేది కాదు. సాయి శ్రీరామ్‌ వండ్రఫుల్‌ విజువల్స్‌ ఇచ్చారు. సాగర్‌ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చాడు.

హీరో నాగశౌర్య మాట్లాడుతూ - ''నేను చాలా చిన్నవాణ్ణి. చిరంజీవిగారి చెయ్యి నా మీద పడింది. ఇది చాలు నాకు. ఎప్పటికైనా మెగాస్టార్‌ కుర్చీ మెగాస్టార్‌గారిదే. మళ్ళీ జన్మంటూ వుంటే మా అమ్మా, నాన్నలకే పుడతాను. మెగాస్టార్‌ అభిమానిగానే పుడతాను. నన్ను సపోర్ట్‌ చేయడానికి వచ్చిన చిరంజీవిగారికి చాలా చాలా థాంక్స్‌. వెంకీ చాలా అద్భుతమైన డైరెక్టర్‌. టు ఇయర్స్‌లో వెంకీ పెద్ద డైరెక్టర్‌ అయి చిరంజీవిగారితో సినిమా చెయ్యాలని కోరుకుంటున్నాను. కెమెరామెన్‌ సాయిశ్రీరామ్‌ లేకుండా ఈ సినిమా లేదు. మా ఐరా క్రియేషన్స్‌ పెట్టి వాళ్లమే కాదు. మా టీమ్‌ అందరూ చాలా కష్టపడి వర్క్‌ చేశారు. అందరికీ థాంక్స్‌'' అన్నారు.

దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ - ''శంకర్‌ ప్రసాద్‌, గౌతం, ఉషగారు చాలా ఇష్టపడి, కష్టపడి ఈ సినిమా చేశారు. మహతి స్వర సాగర్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. సాంగ్స్‌ ఆల్‌రెడీ సూపర్‌హిట్‌ అయ్యాయి. ట్రైలర్‌ సూపర్‌గా వుంది. హీరోయిన్‌ రష్మికకి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

హీరోయిన్‌ రష్మిక మండన్నా మాట్లాడుతూ - ''ఈ టీమ్‌ అంతా నాకు చాలా సపోర్ట్‌ చేశారు. పర్టిక్యులర్‌గా ఉషాగారు తెలుగు నేర్పించారు. సాగర్‌ మంచి ట్యూన్స్‌ కంపోజ్‌ చేశారు. చిరంజీవిగారు ఈ ఫంక్షన్‌కి వచ్చి మా టీమ్‌ని బ్లెస్‌ చేసినందుకు చాలా థాంక్స్‌. వెంకీ బ్యూటిఫుల్‌గా సినిమాని డైరెక్ట్‌ చేశాడు. తప్పకుండా ఈ చిత్రం మంచి హిట్‌ అవుతుంది'' అన్నారు.


 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved