pizza
Goodachari pre release function
`గూఢ‌చారి` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


1 August 2018
Hyderabad

అడివిశేష్‌, శోభితా ధూళిపాళ హీరో హీరోయిన్‌గా అభిషేక్ పిక్చ‌ర్స్‌, విస్తా డ్రీమ్ మ‌ర్చంట్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ స‌మ‌ర్ప‌ణ‌లో.. శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌కుడిగా.. అభిషేక్ నామ‌, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించిన చిత్రం `గూఢ‌చారి`. ఆగ‌స్ట్ 3న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో...

అడివిశేష్ మాట్లాడుతూ - ``2004లో తెలుగు నేర్చుకుంటున్న స‌మ‌యంలో ఈ కాన్సెప్ట్ ఐడియా వ‌చ్చింది. నేను రాసుకున్న ఫైల్‌ను దాచుకున్నాను. దాన్ని క్ష‌ణం రిలీజ్ త‌ర్వాత డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్‌కి చూపించాను. త‌ను దాన్ని చ‌దివి.. ఇది చాలా బ్యాడ్‌గా ఉంది. వ‌ర్కవుట్ కాదు అన్నాడు. మూల క‌థ‌ను బేస్ చేసుకుని ప‌ది నెల‌లు క‌ష్ట‌ప‌డి నేను, రాహుల్‌, శశి స్క్రిప్ట్‌, స్క్రీన్‌ప్లే త‌యారు చేశాం. ఎప్పుడో క‌న్న క‌ల ఇప్పుడు నిజ‌మైంది. మంచి, చెత్త సినిమా.. దేనికైనా క‌ష్ట‌ప‌డాల్సిందే. నేను డైరెక్ట‌ర్ శ‌శితో సింక్ కావ‌డానికి టైమ్ ప‌ట్టింది. త‌న‌ను నేను న‌మ్మితే... త‌ను న‌న్ను న‌మ్మాడు. త‌ను సినిమాను చాలా బాగా గైడ్ చేశాడు. శ్రీచ‌ర‌ణ్ పాకాల‌.. హీరో అని చెప్ప‌వ‌చ్చు. త‌న‌తో క్ష‌ణం చేశాను. ఈ సినిమాకు అద్భుత‌మైన రీ రికార్డింగ్ చేశాడు. శోభితకు థాంక్స్‌. అలాగే సుప్రియ‌ను 22 ఏళ్ల త‌ర్వాత తెలుగులో మా సినిమాతో మ‌ళ్లీ న‌టింప చేశాం. ఓ మంచి యూనిట్‌తో మంచి సినిమా చేశామ‌నే భావ‌న క‌లిగింది. అలాగే ఈ సినిమాలో నా చిన్న‌ప్ప‌టి పాత్ర‌ను సుధీర్ బాబు త‌న‌యుడు... కృష్ణ‌గారి మ‌న‌వ‌డు చేశాడు. ఈ సినిమాను హిందీలోనూ.. త‌మిళంలోనూ రీమేక్ చేయాల‌నుకుంటున్నారు. నిర్మాత‌ల‌క
ు థాంక్స్‌`` అన్నారు.

డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్ తిక్క మాట్లాడుతూ - ``శేషు విజ‌న్‌ని నేను షేర్ చేసుకోగ‌ల‌నా అనుకున్నాను. అయితే 9-10 నెల‌లు నేను, రాహుల్‌, శేష్ క‌లిసి స్క్రిప్ట్ రాశాం. మ‌ధ్య మ‌ధ్య‌లో అబ్బూరి ర‌విగారిని క‌లిసేవాళ్లం. ఆయ‌న ద‌గ్గ‌ర రియ‌ల్ ఫిలిం స్కూల్ అంటే ఏంటో నేర్చుకున్నాను. ప్ర‌తి స‌న్నివేశాన్ని బెట‌ర్‌గా ఎలా రాయ‌వ‌చ్చో అనేది ఆయ‌నే నేర్పిస్తూ.. మంచి మాట‌లు ఇచ్చారు. శ్రీచ‌ర‌ణ్ అద్బుత‌మైన సంగీతం అందించాడు`` అన్నారు.

కోన‌వెంక‌ట్ మాట్లాడుతూ - ``ప్రేక్ష‌కులు టీజ‌ర్‌ను చూసే సినిమా ఎలా ఉందో డిసైడ్ చేసుకుని సినిమాకి వెళ్లాలా వ‌ద్దా? అని నిర్ణ‌యించుకుంటున్నారు. శేషు నాకు తెలిసి ఆంధ్ర ఆమిర్‌ఖాన్ అని నా ఫీలింగ్‌. సినిమా చేయ‌డానికి ఎందుకు ఇన్నిరోజులు ప‌డుతుంద‌ని నేను ఆలోచించాను. అయితే టీజ‌ర్ చూసిన త‌ర్వాత షాక్ అయ్యాను. తెలుగు సినిమా స్టాండ‌ర్డ్స్‌ని పెంచిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఎందుకంటే అంత మంచి క్వాలిటీ సినిమా ఇది. మంచి స‌పోర్టివ్ టీం దొరికింది. అనీల్ సుంక‌ర‌, విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్‌గారు సినిమా యూనిట్‌కు అందించిన స‌పోర్ట్ కార‌ణంగానే ఇది సాధ్య‌మైంద‌ని భావిస్తున్నాను. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

శోభితా దూళిపాల మాట్లాడుతూ - ``తెలుగులో నా మొద‌టి చిత్రం. నేను తెలుగు అమ్మాయినే. ఓ మంచి టీంతో ప‌నిచేశాన‌నే ఫీలింగ్ క‌లిగింది. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ప్రాముఖ్య‌త ఉంటుంది. మంచి ఎమోష‌న్స్ ఉన్నాయి`` అన్నారు.

భ‌ర‌త్ చౌద‌రి మాట్లాడుతూ - ``మా విశ్వ‌ప్ర‌సాద్ స‌హా ఇత‌ర నిర్మాత‌ల‌కు ముందుగానే అభినంద‌న‌లు. ఈ సినిమా పేరుతో పాటు డ‌బ్బులు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది. శేష్‌గారు.. ఆయ‌న టీంతో ప‌నిచేయాల‌ని ఉంది`` అన్నారు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ - ``శ‌శి నాకు ఎప్ప‌టి నుండో తెలుసు. ఇద్ద‌రం క‌లిసి శేఖ‌ర్ క‌మ్ముల‌గారి వ‌ద్ద ప‌నిచేశాం. మంచి కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమాకు ప‌నిచేసింది. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

డి.సురేశ్ బాబు మాట్లాడుతూ - ``శేష్‌.. సినిమాల‌పై ఆస‌క్తితో అమెరికా నుండి ఇక్క‌డ‌కు వ‌చ్చాడు. క్ష‌ణం త‌ర్వాత చేసిన చిత్ర‌మిది. విజువ‌ల్స్ చూస్తేనే సినిమా ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. 160 రోజుల్లో 168 లొకేష‌న్స్‌లో ఈ సినిమాను షూట్ చేయ‌డం గొప్ప విష‌యం. నిర్మాత‌లంద‌రికీ అభినంద‌న‌లు`` అన్నారు.

అనిల్ సుంక‌ర మాట్లాడుతూ - ``శేష్ వ‌చ్చి ఈ క‌థ చెప్పిన‌ప్పుడు.. బ‌డ్జెట్ ఎంత అవుతుంద‌ని అడిగితే.. శేష్ చెప్పిన బ‌డ్జెట్ విని ఏదో చెబుతున్నాడ‌ని అనుకున్నాను. కానీ సినిమా టీజ‌ర్ త‌ర్వాత థ్రిల్ అయ్యాను. అంత త‌క్కువ బ‌డ్జెట్‌లో ఇంత మంచి సినిమా చేయ‌డానికి కుదురుతుందా అనిపించింది. నేను చేయ‌లేను. 20-30 కోట్ల రూపాయ‌ల సినిమ‌లా అనిపిస్తుంది. ప్లానింగ్‌, ప్రీ ప్రొడ‌క్ష‌న్, హార్డ్ వ‌ర్క్ ఉంటే సినిమాను చాలా త‌క్కువ బ‌డ్జెట్‌లో చేయ‌వ‌చ్చు. ఈ సినిమాకు ప‌నిచేసిన ఇత‌ర నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``మంచి సినిమా చేశాం. మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌నుకుంటున్నాం`` అన్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved