pizza
Winner pre-release function
‘విన్నర్’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 February 2017
Hyderaba
d

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మించిన చిత్రం `విన్న‌ర్‌`.మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్బంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని, సురేంద‌ర్ రెడ్డి, శ్రీనువైట్ల‌, నాగ‌బాబు, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, గౌతంరాజు, జెమిని కిర‌ణ్‌, ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, ఛోటా కె.నాయుడు, ప్ర‌సాద్ వి.పొట్లూరి, సంక‌ల్ప్‌, అనిల్ రావిపూడి, బి.వి.ఎస్.రవి, బాబీ, అనూప్ సింగ్, అబ్బూరి రవి, వెలిగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ - ``ఈ సినిమాలో హీరో నుండి ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు నుండి ప్ర‌తి ఒక్క‌రితో మంచి అనుబంధం ఉంది. నిర్మాత‌లు న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధు ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్నారు. సాయిధ‌ర‌మ్ తేజ్ లుక్ చాలా బావుంది. ఈ సినిమా గొప్ప సినిమా అవుతుంది`` అన్నారు.

నాగ‌బాబు మాట్లాడుతూ - ``న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధులు మాకెంతో ఆత్మీయులు, గోపీచంద్‌కు ఆల్ ది బెస్ట్‌. థ‌మ‌న్ చాలా మంచి మ్యూజిక్‌. నాకు, అన్న‌య్య చిరంజీవికి, త‌మ్ముడు ప‌వ‌న్‌కు చాలా ఇష్ట‌మైన మేన‌ల్లుడు. చిన్న‌ప్ప‌ట్నుంచి అమాయ‌కుడు, నిజాయితీగా గ‌ల వ్య‌క్తి. అబద్ధం చెప్ప‌డం కూడా చేత‌కాక నాతో తిట్లు తింటుండేవాడు. ఇప్పుడు తేజ్ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. విన్న‌ర్ అనే టైటిల్ పాజిటివ్ టైటిల్‌. క‌థ కూడా నాకు తెలుసు. సూప‌ర్‌హిట్ కొట్ట‌బోతున్నాడ‌ని తెలుసు. క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ అయిన గోపీచంద్ ఈ సినిమాను తీశాడు. తేజ్‌కు టీంకు కంగ్రాట్స్‌`` అన్నారు.

బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``టైటిలే సినిమా అంటే ఏంటో చెబుతుంది. టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

పివిపి మాట్లాడుతూ - ``2017 చాలా స‌క్సెస్‌ఫుల్ ఇయ‌ర్‌గా ఖైదీ నంబ‌ర్ 150తో స్టార్ట్ అయ్యింది. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, శ‌త‌మానం భ‌వ‌తి ఇలా స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌తో ముందుకు సాగుతుంది. ఇప్పుడు విన్న‌ర్ సినిమా త్వ‌ర‌లోనే మ‌న ముందుకు రానుంది. ఈ ఏడాది విన్న‌ర్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలుస్తుంద‌ని బావిస్తున్నాను. తేజు, ర‌కుల్‌ల‌కు ఈ సినిమా మ‌రో స‌క్సెస్ అవుతుంది. బ‌లుపు టీం ఈ సినిమాకు వ‌ర్క్ చేసింది. బ‌లుపు కంటే పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. నిర్మాత‌ల‌కు ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి కావాలి`` అన్నారు.

సంక‌ల్ప్ మాట్లాడుతూ - ``టీం అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ - ``సాయిధ‌ర‌మ్ తేజ్‌..మేన‌మామ‌ల‌ను మించిన పెద్ద హీరో కావాల‌ని కోరుకుంటున్నాను. చిరంజీవిలో ఎన‌ర్జీ తేజులో చూశాను. విన్న‌ర్ సినిమా ఇంత బాగా రావ‌డానికి తేజు ముఖ్య కార‌ణం. నిర్మాత‌లు బుజ్జి, మ‌ధు క‌థ విన‌గానే ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను చేద్దామ‌ని అన్నారు. సౌతాఫ్రికా, దుబాయ్ స‌హా ప‌లు లోకేష‌న్స్ చూశాం. చివ‌ర‌కు ట‌ర్కీలో అద్భుత‌మైన లోకేష‌న్స్‌లో షూట్ చేశాం. ప్ర‌తి సినిమాకు గోపీచంద్ ఎదుగుతున్నాడు. ఈ సినిమాతో త‌ను ఇంకా హై రేంజ్‌కు చేరుకుంటాడు.

బాబీ మాట్లాడుతూ - ``గోపీచంద్‌కు బ‌లుపు కంటే పెద్ద హిట్ కావాలి. థ‌మ‌న్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. గౌతంరాజు, ఛోటా వంటి టాప్ టెక్నిషియ‌న్స్‌, నిర్మాత‌లు బుజ్జి, మ‌ధు, తేజు, ర‌కుల్ స‌హా ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

శ్రీను వైట్ల మాట్లాడుతూ - ``తేజు, ర‌కుల్‌, బుజ్జి, మ‌ధుగారు స‌హా అంద‌రితో నాకు మంచి ప‌రిచ‌యం ఉంది. మా గోపీచంద్ చాలా ఫోక‌స్‌డ్‌గా సినిమా చేశాడ‌ని అంద‌రూ అంటున్నారు. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది. తేజు హార్డ్ వ‌ర్క్, డేడికేష‌న్ గురించి అంద‌రూ గొప్ప‌గా చెబుతుంటారు. తేజు వాళ్ళ మావ‌య్య‌ల్లాగానే గొప్ప రేంజ్‌కు చేరుకుంటాడ‌ని భావిస్తున్నాను`` అన్నారు.

సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ - ``నిర్మాత‌లు మ‌ధు, బుజ్జి ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్స్‌. డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను. ఎన‌ర్జీ అంటే నాకు బ‌న్ని త‌ర్వాత తేజునే గుర్తుకు వ‌స్తాడు. ఈ చిత్రంతో డెఫ‌నెట్‌గా తేజు టాప్ పొజిష‌న్‌లోకి వెళ‌తాడు. థ‌మ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ మ్యూజిక్ ఇచ్చాడు. మూవీ రేసుగుర్రం కంటే పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

Glam galleries from the event

అన‌సూయ మాట్లాడుతూ - ``మ‌ధు, బుజ్జి, గోపీచంద్‌, తేజు, ఛోటాగారు స‌హా అంద‌రికీ థాంక్స్‌. కొత్త‌గా ట్రై చేశాను. సూయ సూయ‌...పాట నాకు చాలా స్పెష‌ల్‌. రామ‌జోగ‌య్య శాస్త్రిగారు పాట‌ను బాగా రాశారు. థ‌మ‌న్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. తేజు, ర‌కుల్ జంట బావుంది. అంద‌రికీ థాంక్స్`` అన్నారు.

ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ మాట్లాడుతూ - ``డైరెక్ట‌ర్ గోపీచంద్ నా లైఫ్‌లో ఒక బాడీగార్డ్‌లా నా వెనుక నిల‌బ‌డ్డాడు. బ‌లుపు వంటి మూవీ ఇచ్చాడు. పండ‌గ‌చేస్కో, ఇప్పుడు విన్న‌ర్ సినిమాల‌ను చేశాను. క‌మ‌ర్షియ‌ల్‌గా సినిమాను ఎలా తీయాలో తెలిసిన ద‌ర్శ‌కుడు గోపీచంద్‌. సినిమా పెద్ద హిట్ అవుతుంది. సాయిధ‌ర‌మ్ తేజ్‌కు మ్యూజిక్ చేసేట‌ప్పుడు చిరంజీవిగారు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, స్టైలిష్ స్టార్ స‌హా అంద‌రూ గుర్తుకు వ‌స్తారు. అందుకే త‌న‌కు మంచి మ్యూజిక్ ఇవ్వడానికే ప్ర‌య‌త్నిస్తాను. ఇప్పుడు తేజుతో జ‌వాన్ సినిమా చేస్తున్నాను. రేసుగుర్రం త‌ర్వాత బుజ్జిగారి బ్యాన‌ర్‌లో వ‌ర్క్ చేశాను. ఛోటాగారు విజువ‌ల్స చాలా గొప్ప‌గా వ‌చ్చాయి. అనూప్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌కుల్ స‌హా అంద‌రూ అద్భుతంగా చేశారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ - ``ఈ సినిమాకు తేజుతో వ‌ర్క్ చేస్తున్న‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారిని డైరెక్ట్ చేసిన ఫీలింగ్ క‌లిగింది. తేజు డైరెక్ట‌ర్స్ ఆర్టిస్ట్‌. తేజు నాకు బ్ర‌ద‌ర్‌లాంటివాడు. తేజుకు ఒక మంచి సినిమా. అల్రెడి స్టార్ అయిన తేజు ఇంకా పెద్ద స్టార్ట్ అవుతాడు. చాలా మంచి వ్య‌క్తి. తేజుకు ఈ సినిమా పెద్ద రేంజ్ మూవీ అవుతుంది. సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. రిస్క్ చేసి యాక్ష‌న్స్ సీన్స్ చేశాడు. ఎక్స్‌ట్రార్డిన‌ర్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా త‌ర్వాత క‌మ‌ర్షియ‌ల్‌గా నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ‌తాడు. జ‌గ‌ప‌తిబాబుగారు తండ్రిగా చాలా ముఖ్య‌మైన రోల్ చేశారు. నిర్మాత‌లు బుజ్జి, మ‌ధు స‌పోర్ట్‌తోనే సినిమా ఇంత రిచ్‌గా తీయ‌గ‌లిగాను. ఛోటా, థ‌మ‌న్‌, గౌతంరాజుగారు, ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌, అబ్బూరి ర‌వి, రామ‌జోగ‌య్య శాస్త్రి వంటి టెక్నిషియ‌న్స్ ఇచ్చారు. వెలిగొండ అద్భుత‌మైన క‌థ‌ను ఇచ్చారు. థ‌మ‌న్‌తో నేను చేసిన మూవీల‌న్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి. ఈ సినిమాకు ఛోటాగారు నాకు ఒక వెప‌న్‌లాగా దొరికారు. సూప‌ర్బ్ విజువ‌ల్స్ ఇచ్చారు. ర‌కుల్‌తో నేను చేసిన రెండో సినిమా. త‌ను మంచి డేడికేష‌న్ ఉన్న హీరోయిన్‌. అనుష్క త‌ర్వాత అంత హార్డ్ వ‌ర్క‌ర్ ర‌కుల్‌. ఈ సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించిన అన‌సూయ‌కు థాంక్స్‌. ముఖేష్ రుషి, అనూప్ సింగ్, పృథ్వీ, అలీ స‌హా అంద‌రూ బాగా చేశారు. బ‌ల్గేరియా, ట‌ర్కీ, యుక్రేయిన్‌, హైద‌రాబాద్ , బెంగ‌ళూర్ హార్స్ కోర్స్‌ల్లో సినిమాను షూట్ చేశాం. ఎక్స్‌ట్రార్డిన‌రీ టీం కుదిరింది. స‌పోర్ట్ చేసిన అందరికీ థాంక్స్‌`` అన్నారు.

సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ - ``క‌థ విన‌గానే చాలా ఖ‌ర్చుతో కూడుకున్న సినిమా.నిర్మాత‌లు మ‌ధు, బుజ్జిగారు, నాపైన అంత బ‌డ్జెట్ పెడ‌తారా..అంత అవ‌స‌ర‌మా.. అని క‌న్‌ప్యూజ్ అయ్యేవాడిని. క‌థ‌కు ఎంత ఖ‌ర్చు పెట్టాలో ఆలోచించారే కానీ..మ‌రేం ఆలోచించ‌లేదు. నిర్మాత‌ల గ‌ట్స్‌కు హ్యాట్సాఫ్‌. నిర్మాత‌లు నాకు మంచి అవ‌కాశాన్ని ఇచ్చారు. గోపీ అన్న..స్వంత బ్ర‌ద‌ర్‌లా స‌పోర్ట్ చేసి చాలా విష‌యాలు నేర్పించి నా నుండి బెస్ట్‌ను రాబ‌ట్టుక‌న్నారు. ఆయ‌న‌తో ఎప్పుడు వ‌ర్క్ చేయాలా అని ఎదురుచూస్తున్నాను. గోపీ అన్న‌, ఛోటా మావ‌య్య‌లు ఎంతో కేర్ తీసుకున్నారు. థ‌మ‌న్ మంచి ఫ్రెండ్‌. ఆల్బ‌మ్ ప‌రంగా సూప‌ర్‌హిట్ మ్యూజిక్ ఇచ్చాడు. వెలిగొండ శ్రీనివాస్‌గారు మెస్మ‌రైజింగ్ క‌థ‌ను ఇచ్చారు. మిస్ట‌ర్ వ‌రల్డ్ అయిన అనూప్ చాలా నైజ్ జెంటిల్‌మేన్‌. అబ్బూరి ర‌విగారు మంచి ఎమోష‌న‌ల్ డైలాగ్స్ రాశారు. మ‌హేష్‌బాబుగారు, స‌మంత‌, అనిరుధ్‌, ర‌వితేజ‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌గారు అడ‌గ్గానే సాంగ్స్ రిలీజ్ చేసి ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. నాకు మొద‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు అండ‌గా నిల‌బ‌డ్డ‌ మా అమ్మ‌గారికి, మా మెగాఫ్యాన్స్‌కు థాంక్స్‌`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved