pizza
Sindhura Puvvu Krishna Reddy press meet about Angel
నాకు సినిమాయే దైవం - సింధూర పువ్వు కృష్ణారెడ్డి
You are at idlebrain.com > News > Functions
Follow Us

28 October 2017
Hyderabad

శ్రీ సరస్వతి ఫిలిమ్స్‌ పతాకంపై నాగ అన్వేష్‌, హెబ్బా పటేల్‌ జంటగా తెరకెక్కిన విజువల్‌ వండర్‌ 'ఏంజెల్‌'. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. సింధూర పువ్వు కృష్ణారెడ్డి నిర్మాత. నవంబర్‌ 3న సినిమా విడుదలవుతుంది.

ఈ సందర్భంగా నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ -''ఏంజెల్‌ సినిమా నవంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా వ్యవథి రెండు గంట ఎనిమిది నిమిషాలు. రీసెంట్‌గా యూనిట్‌ అంతా సినిమా చూశాం. చాలా బావుంది..హ్యాపీగా అనిపించింది. సినిమా ఫీల్డ్‌లో చేసిన పనిని స్క్రీన్‌పైనే చూస్తే వచ్చే ఆనందమే వేరుగా ఉంటుంది. దాన్నే ప్యాషన్‌ అంటారు. నాకు సినిమానే దైవం,బాధ్యత, బలం. సెన్సార్‌ సభ్యులు కూడా సినిమాను అప్రిసియేట్‌ చేశారు. నాగ అన్వేష్‌ డ్యాన్సులు, ఫైట్స్‌, స్క్రీన్‌ ప్రెజన్స్‌ చూసి తను తొందరలోనే తెలుగులో టాప్‌ స్టార్స్‌లో ఒకడు అవుతాడనిపించింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్సియల్‌ స్టేటస్‌ కాస్త ఇబ్బందిగానే ఉంది. అయినా మేం అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని ప్రిపేర్‌ అయ్యాం. సినిమా బిజినెస్‌ చూసిన తర్వాత నిర్మాతగా నమ్మకం కలిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 300 థియేటర్స్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్స్‌ చేస్తున్నాం. తెలుగులో మాత్రం నవంబర్‌ 3న విడుదల చేస్తాం. తమిళ, కన్నడ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ రెండు వెర్షన్స్‌లో సినిమాను వారం లేదా రెండు వారాల తర్వాత విడుదల చేయడానికి ప్లాన్స్‌ చేస్తున్నాం'' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved