pizza
Chal Chal Gurram release on 28 October
అక్టోబర్‌ 28న విడుదలవుతున్న 'చల్‌ చల్‌ గుర్రం'
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 October 2016
Hyderaba
d

ఎం.ఆర్‌.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై శైలేష్‌ బొలిశెట్టి, దీక్షాపంత్‌, అంగనా రాయ్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'చల్‌ చల్‌ గుర్రం'. మోహన ప్రసాద్‌ దర్శకత్వంలో రాఘవయ్య నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 28న విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో చిత్రయూనిట్‌ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో....

దర్శకుడు మోహన ప్రసాద్‌ మాట్లాడుతూ - '''చల్‌ చల్‌ గుర్రం' చిత్రాన్ని అక్టోబర్‌ 28న విడుదల చేస్తున్నాం. కొత్త కాన్సెప్ట్‌ను యంగ్‌టీంతో కలిసి చేశాం. టైటిల్‌కు అనుగుణంగానే సినిమా ఫన్‌ ఎంటర్‌టైనర్‌. నిర్మాత రాఘవయ్యగారు చేసిన సపోర్ట్‌తో సినిమా చక్కగా వచ్చింది. పలు ఇంటర్నేషనల్‌ కార్‌ రేసింగ్స్‌లో పాల్గొన్న హీరో శైలేష్‌ ముకుంద సినిమా తర్వాత చేసిన చిత్రమిది. అద్భుతంగా నటించారు. అలాగే హీరోయిన్స్‌ అంగనా రాయ్‌, దీక్షాపంత్‌లు చక్కగా యాక్ట్‌ చేశారు. సినిమాలో ఏ పాత్ర మధ్య రిలేషన్‌ ఉండదు. అలా ఏ రిలేషన్‌ లేని 36 పాత్రల మధ్య నడిచే చిత్రమిది. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు తెలుగులో సినిమా రాలేదు. ఈ నెల 28న విడుదలవుతున్న మా చిత్రాన్ని పెద్ద సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

హీరో శైలేష్‌ మాట్లాడుతూ - ''ముకుంద సినిమా తర్వాత చిత్ర దర్శకుడు మోహనప్రసాద్‌గారు, నిర్మాత రాఘవయ్యగారు వచ్చి నన్ను కలిసి ఈ కథను చెప్పారు. కథ నచ్చడంతో సినిమాలో నటించడానికి అంగీకరించాను. మంచి ఎంటర్‌టైనింగ్‌ మూవీ. సినిమా చాలా బాగా వచ్చింది. అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఈ నెల 28న సినిమా విడుదలవుతుంది. సినిమాను పెద్ద హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ఈ కార్యక్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ వెంగీ, సినిమాటోగ్రాఫర్‌ వి.శ్యామ్‌ప్రసాద్‌, హీరోయిన్స్‌ దీక్షాపంత్‌, అంగనారాయ్‌లు పాల్గొని అక్టోబర్‌ 28న విడుదలవుతున్న 'చల్‌ చల్‌ గుర్రం' సినిమాను పెద్ద హిట్‌ చేయాలని ప్రేక్షకులను కోరారు.

నాగబాబు, బెనర్జీ, ముక్తర్‌ ఖాన్‌, ప్రవీణ్‌, సుడిగాలి సుధీర్‌, చిత్రం శ్రీను, అశోక్‌కుమార్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్‌: శంకర్‌, సినిమాటోగ్రఫీ: వి.శ్యామ్‌ ప్రసాద్‌, ఆర్ట్‌: జె.కె.మూర్తి, మ్యూజిక్‌: వెంగీ, ఫైట్స్‌: రామ్‌ సుంకర, ప్రొడ్యూసర్‌: రాఘవయ్య, స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, దర్శకత్వం: మోహనప్రసాద్‌.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved