pizza
Green Card press meet
ఆగ‌స్ట్ 4న `గ్రీన్ కార్డ్` విడుద‌ల
You are at idlebrain.com > News > Functions
Follow Us

26 July 2017
Hyderabad

దేవాన్ష్ స‌మ‌ర్ప‌ణ‌లో సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ‌తృఘ్న రాయ‌పాటి(యు.ఎస్‌.ఎ),స్టెఫానీ(యు.ఎస్‌.ఎ), జోసెలిన్‌(యు.ఎస్‌.ఎ) తారాగ‌ణంగా ర‌మ్స్ (యు.ఎస్‌.ఎ) ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస్ గుప్తా(యు.ఎస్‌.ఎ), మోహ‌న్‌.ఆర్‌(యు.ఎస్‌.ఎ), న‌ర‌సింహ‌, నాగ‌శ్రీనివాస‌రెడ్డి నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం `గ్రీన్‌కార్డ్‌`. ఈ సినిమాను ఆగ‌స్ట్ 4న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని ఫిల్మ్ చాంబ‌ర్‌లో బుధ‌వారం విలేక‌రుల స‌మావేశం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో

సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు మాట్లాడుతూ ``ద‌ర్శ‌కుడు ర‌మ‌ణారెడ్డిగారు కూడా అమెరికా వెళ్ళి ర‌మ్స్‌గా పేరు మార్చుకున్నారు. గ‌తంలో రియ‌ల్ స్టోరీ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ గ్రీన్ కార్డ్ సినిమా 80 శాతం అమెరికాలోనే చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంది. ఇక్క‌డ నుండి అమెరికాకు వెళ్ళే వారు గ్రీన్‌కార్డ్ కోసం ఎన్ని తిప్పులు ప‌డ‌తార‌నే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించ‌బ‌డింది. సినిమాలో నేను హీరో తండ్రి పాత్ర‌లో న‌టించాను. ప్ర‌ణ‌య్‌కుమార్ మంచి సాంగ్‌ను రాశారు. ఆగ‌స్ట్ 4న రానున్న ఈ సినిమా అమెరికాలో మ‌న వారు ప‌డే క‌ష్టాల‌ను చూపిస్తుంది`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ర‌మ్స్ మాట్లాడుతూ ``ఆగ‌స్ట్ 4న సినిమాను విడుద‌ల చేస్తాం. డిఫ‌రెంట్ చిత్ర‌మిది. మ‌నం అమెరికాకు వెళ్తే అక్క‌డ ఎక్కువ డాల‌ర్లు

సంపాదించ‌వ‌చ్చు అని అంతా అనుకుంటారు. కానీ అక్క‌డికి వెళ్లిన వారు ఎలాంటి క‌ష్ట‌ప‌డ‌తారో నాకు తెలుసు. వాట‌న్నిటినీ ఇందులో చూపించాను. సినిమా చాలా స‌ర‌దాగా ఉంటుంది. ఈ సినిమా ద్వారా నేను మ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌గారికి ఓ విష‌యాన్ని చెప్పాల‌నుకుంటున్నాను. ఎన్నారైలు హ్యాపీగా ఉంటార‌ని అంతా అనుకుంటారు. కానీ ఎన్నారైలు హ్యాపీగా లేరు. క‌న్నీళ్ల‌తో బ‌తుకుతున్నారు. ఇప్పుడు వ‌చ్చిన ఎన్నారైలు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నార‌నే ధోర‌ణితోనే చూస్తున్నారు త‌ప్ప వారి క‌ష్టాల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే ఇది రొటీన్‌కి భిన్నంగా ఉంటుంది. 80 శాతం అమెరికాలోనే చేశాం. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది`` అని చెప్పారు.

శ‌తృఘ్న రాయ‌పాటి(యు.ఎస్‌.ఎ),స్టెఫానీ(యు.ఎస్‌.ఎ), జోసెలిన్‌(యు.ఎస్‌.ఎ), రెబెకా(యు.ఎస్‌.ఎ), మిల్లి(యు.ఎస్‌.ఎ), స్వీటెన్ (యు.ఎస్‌.ఎ) త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః కు(యు.ఎస్‌.ఎ), హెన్నీ ప్రిన్స్‌, ప్ర‌ణ‌య్‌కుమార్‌, కెమెరాః న‌వీన్‌(యు.ఎస్‌.ఎ), నాగ‌శ్రీనివాస్‌రెడ్డి, ఎడిటింగ్ః మోహ‌న్‌, రామారావు, నిర్మాత‌లుః శ్రీనివాస్ గుప్తా(యు.ఎస్‌.ఎ), మోహ‌న్‌.ఆర్‌(యు.ఎస్‌.ఎ), న‌ర‌సింహ‌, నాగ‌శ్రీనివాస‌రెడ్డి, ద‌ర్శ‌క‌త్వంః ర‌మ్స్ (యు.ఎస్‌.ఎ).

 



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved